ఒంటారియో (కెనడా): భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్... ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్ టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో టాప్ సీడ్ అనాహత్ 11–3, 11–7, 11–9తో రుఖయ్య సలీమ్ (ఈజిప్ట్)పై గెలిచింది. తద్వారా భారత్ నుంచి తొలి ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌గా అవతరించింది.

2005లో జోష్నా చినప్ప ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. గతేడాది కైరోలో జరిగిన ఈ టోర్నమెంట్లో కాంస్యం నెగ్గిన అనాహత్... ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గానూ రికార్డుల్లోకెక్కింది. ఈ నేపథ్యంలో చాంపియన్‌గా నిలిచిన అనాహత్‌కు పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు.
BIG BIG BIGGG NEWS 🔥🔥🔥🔥
ANAHAT SINGH IS WORLD JUNIOR CHAMPION 🏆 🇮🇳
THE QUEEN FROM INDIA IS AT THE TOP OF WORLD TODAY!
Anahat defeated Ruqayya Salem 🇪🇬 3-0 to become the first Indian to win the Junior Squash World Championship 🏆
First Non Egyptian player to win Jr World… pic.twitter.com/eA0rouqE2f— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) July 25, 2026