Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

Mohammed Shami: ఇలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు!

Sports Sakshi User Sakshi Sakshi Time Mar 7, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
shami.jpg

టీమిండియా స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ(Mohammed Shami)కి అతడి చిన్ననాటి కోచ్‌ బదరుద్దీన్‌ సిద్దిఖీ(Badaruddin Siddiqui) అండగా నిలిచాడు. షమీ సరైన దారిలోనే వెళ్తున్నాడని.. అన్నింటి కంటే దేశమే ముఖ్యమని అతడికి తెలుసునని వ్యాఖ్యానించాడు. భారత్‌ కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వేళ షమీ ఏకాగ్రత దెబ్బతినేలా ఎవరూ మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశాడు.

కాగా ఆల్‌ ఇండియా ముస్లి జమాత్‌ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్‌ రజ్వీ బరేల్వి షమీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవిత్ర రంజాన్‌ మాసంలో ‘రోజా’(Roza) పాటించకుండా షమీ పెద్ద నేరం చేశాడని ఆయన ఆరోపించారు. 

అతడు ఇలాంటి తప్పు చేయకుండా ఉండాల్సిందని.. షరియత్‌ (చట్టం) దృష్టిలో అతడొక పెద్ద నేరగాడని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో అతడు దేవుడికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అత్యంత ముఖ్య విధి.. అతడో నేరగాడు
‘రోజా’లో ఉపవాసం పాటించడమే అత్యంత ముఖ్య విధి అని.. కానీ దానిని విస్మరించడం మహిళలకైనా, పురుషులకైనా మంచిదికాదని షహబుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా ప్రఖ్యాత క్రికెటర్‌ అయి ఉండి.. మ్యాచ్‌ మధ్యలో నీళ్లు లేదంటే వేరే ఏదో డ్రింక్‌ తాగడం సరికాదని విమర్శించారు.

ఈ నేపథ్యంలో ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యులు మౌలానా ఖలీద్‌ రషీద్‌ ఫరాంగి మాహిల్‌ మాత్రం షమీకి అండగా నిలిచారు. రోజా పాటించాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరు రోజా పాటించాలని ఖురాన్‌లో ఉందని.. అయితే, ప్రయాణాలు చేస్తున్నపుడు కొంతమందికి ఇది సాధ్యం కాదు కాబట్టి మినహాయింపు ఉంటుందని తమ పవిత్ర గ్రంథంలోనే ఉందని తెలిపారు. షమీ తప్పు చేశాడంటూ వేలెత్తి చూపే హక్కు ఎవరికీ లేదని ఖలీద్‌ స్పష్టం చేశారు.

షమీ చేసినదాంట్లో తప్పేమీ లేదు
ఈ క్రమంలో షమీ టీమిండియా బౌలర్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన చిన్ననాటి కోచ్‌ బదరుద్దీన్‌ సిద్ధిఖీ సైతం అతడికి మద్దతు పలికారు. ‘‘షమీ చేసినదాంట్లో తప్పేమీ లేదు. ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు.

దేశానికే మొదటి ప్రాధాన్యం 
బయట నుంచి వచ్చే విమర్శలను పక్కనపెట్టి.. షమీ ఫైనల్‌ మ్యాచ్‌పై దృష్టి పెట్టాల్సి ఉంది. అతడు ఎలాంటి నేరమూ చేయలేదు. దేశం కోసం అతడు ఆడుతున్నాడు. వ్యక్తిగత విషయాల కంటే దేశానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సరైంది. షమీ కూడా అదే చేస్తున్నాడు. దయచేసి ఎవరూ కూడా అతడి ఏకాగ్రత దెబ్బతినేలా మాట్లాడవద్దు’’ అని బదరుద్దీన్‌ విజ్ఞప్తి చేశారు.

చాంపియన్స్‌ ట్రోఫీతో బిజీ
కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్‌ షమీ ప్రస్తుతం ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025తో బిజీగా ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌.. తదుపరి చీలమండ గాయం వల్ల ఏడాదికి పైగా జట్టుకు దూరమయ్యాడు.

ఇటీవల ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన షమీ.. చాంపియన్స్‌ ట్రోఫీలోనూ రాణిస్తున్నాడు. గ్రూప్‌ దశతో తొలుత బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లతో చెలరేగిన షమీ.. ఆస్ట్రేలియాతో కీలక సెమీస్‌ మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. పది ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి కేవలం 48 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. 

ఇక ఈ మెగా వన్డే టోర్నీలో ఫైనల్‌కు చేరిన టీమిండియా ఆదివారం దుబాయ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో టైటిల్‌ పోరులో తలపడనుంది. అయితే, ఆసీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్‌ తాగుతున్న దృశ్యాలు వైరల్‌ కావడంతో అతడిపై విమర్శలు వచ్చాయి.

చదవండి: IND vs NZ: ఇది సరికాదు!.. టీమిండియాపై కివీస్‌ గెలవాలి: మిల్లర్‌
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Mohammed Shami
India vs New Zealand
Dubai
Roza
india vs australia
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

దుబాయ్‌ భారత కాన్సులేట్‌లోకి ఇక నేరుగా నో ఎంట్రీ!

దుబాయ్‌ భారత కాన్సులేట్‌లోకి ఇక నేరుగా నో ఎంట్రీ!

తమిళనాడు నుంచి దుబాయికి  బస్సు టికెట్‌

తమిళనాడు నుంచి దుబాయికి బస్సు టికెట్‌

దుబాయ్‌లో ఘోరం.. ఏడుగురి భారతీయులు మృతి

దుబాయ్‌లో ఘోరం.. ఏడుగురి భారతీయులు మృతి

టీమిండియాలో నో ప్లేస్‌.. గంటల వ్యవధిలోనే హ్యాట్రిక్‌తో చెలరేగిన షమీ

టీమిండియాలో నో ప్లేస్‌.. గంటల వ్యవధిలోనే హ్యాట్రిక్‌తో చెలరేగిన షమీ

ప్రేమ నుంచి పెళ్లిదాకా.. చీర్‌లీడ‌ర్స్‌తో క్రికెట‌ర్ల బంధం!

ప్రేమ నుంచి పెళ్లిదాకా.. చీర్‌లీడ‌ర్స్‌తో క్రికెట‌ర్ల బంధం!

12 మ్యాచ్‌లు.. 40 రోజులు! టీమిండియా ఫ్యాన్స్‌కు పండ‌గే

12 మ్యాచ్‌లు.. 40 రోజులు! టీమిండియా ఫ్యాన్స్‌కు పండ‌గే

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.