Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

IPL 2026: సీఎస్‌కేను కోర్టుకీడ్చిన కావ్యా మారన్‌!

Sports Sakshi User Sakshi Sakshi Time Mar 14, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Kavya-Maran.jpg

ఐపీఎల్‌-2026 ఆరంభానికి ముందే చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) అభిమానుల మధ్య సోషల్‌ మీడియా యుద్ధం మొదలైపోయింది. మైదానంలో ఎస్‌ఆర్‌హెచ్‌కు చెన్నై కచ్చితంగా ‘సినిమా’ చూపిస్తుందంటూ సీఎస్‌కే ఫ్యాన్స్‌ సవాలు విసరుతుండగా.. తమ జట్టు సత్తా ఏమిటో మైదానంలోనే చూస్తారంటూ ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ కౌంటర్లు ఇస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. సీజన్‌ ఆరంభానికి ముందు ఫ్రాంఛైజీలు తమ కొత్త జెర్సీల ఆవిష్కరణ, కొత్తగా వచ్చిన ఆటగాళ్లకు ఆహ్వానం పలికే క్రమంలో వినూత్న రీతిలో వీడియోలు రూపొందించడం పరిపాటి. సోషల్‌ మీడియాలో బజ్‌ క్రియేట్‌ చేసేందుకు, అభిమానులను అలరించేందుకు ఇలాంటి వీడియోలు ఉపయోగపడతాయి.

హుకుమ్‌, అల్తోప్పా, డిస్కో రీమిక్స్‌
సీఎస్‌కే సైతం దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, రాజస్తాన్‌ నుంచి సీఎస్‌కేలోకి వచ్చిన సంజూ శాంసన్‌ సహా కీలక ఆటగాళ్లపై వీడియోలు రూపొందించింది. అయితే, ఇందులో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలకు సంబంధించిన జైలర్‌, కూలీ, జైలర్‌-2ల మ్యూజిక్‌ వాడుకుంది.

ముఖ్యంగా హుకుమ్‌, అల్తోప్పా, డిస్కో రీమిక్స్‌ వంటి ట్రాక్స్‌ను తమ ఆటగాళ్లకు హైప్‌ ఇచ్చే క్రమంలో బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌గా వాడుకుంది. ఈ పాటలు, సంగీతానికి అనిరుద్‌ రవిచంద్రన్‌ రూపకర్త. ఈ నేపథ్యంలో సీఎస్‌కే తమ ఆటగాళ్ల హీరో ఎడిట్స్‌కు ఈ సంగీతం వాడుకోవడంపై సన్‌ టీవీ గ్రూపు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అనుమతి లేకుండానే
ఈ పాటలు తమకు చెందేలా అనిరుద్‌ రవిచంద్రన్‌ రాత పూర్వక ఒప్పందం కుదుర్చుకున్నారని.. అయితే, సీఎస్‌కే మాత్రం తమ వాణిజ్య లాభం కోసం అనుమతి లేకుండానే మ్యూజిక్‌ను వాడుకుంటోందని కోర్టుకెక్కింది. ఇందుకు సంబంధించి మార్చి 13న సన్‌ టీవీ నెట్‌వర్క్‌ మద్రాస్‌ హైకోర్టులో కాపీరైట్‌ ఉల్లంఘన కింద సీఎస్‌కేపై పిటిషన్‌ దాఖలు చేసింది.

లైసెన్స్‌ వచ్చేదాకా
ఈ విషయంపై సీఎస్‌కే న్యాయవాది పీఎస్‌ రామన్‌ వాధిస్తూ.. గత మూడేళ్లుగా చెన్నై జట్టు ఈ మ్యూజిక్‌ను వాడుకుంటోందని.. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకని ప్రశ్నించారు. సన్‌ టీవీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని తాము అస్సలు ఊహించలేదన్నారు. 

ఏదైమైనా సన్‌ పిక్సర్చ్‌ లేదంటే ఫొనోగ్రాఫిక్‌ పెర్ఫామెన్స్‌ లిమిటెడ్‌ నుంచి లైసెన్స్‌ వచ్చేదాకా తాము జైలర్‌, కూలీ, జైలర్‌ 2 మ్యూజిక్‌ను వాడబోమని స్పష్టం చేశారు. అదే విధంగా.. ఇప్పటికే ఈ మ్యూజిక్‌తో కూడిన వీడియోలను డిలీట్‌ చేసిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

కావ్యా మారన్‌పై నెట్టింట ట్రోలింగ్‌
ఈ క్రమంలో జస్టిస్‌ సెంథిల్‌కుమార్‌ రామమూర్తి ఈ కేసును మార్చి 16కు వాయిదా వేశారు. పిటిషన్‌దారుకు సంబంధించిన ఆడియో మెటీరియల్‌ను తాము వాడటం లేదన్న విషయాన్ని ధ్రువీకరిస్తూ సీఎస్‌కే అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

కాగా ‘ది హండ్రెడ్‌ లీగ్‌’- 2026 వేలంలో పాకిస్తాన్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు చేసినందుకు సన్‌రైజర్స్‌ లీడ్స్‌ యజమాని, సన్‌ టీవీ నెట్‌వర్క్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కావ్యా మారన్‌పై నెట్టింట విపరీతంగా ట్రోలింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎస్‌కేను కోర్టుకు ఈడ్చటంపై కూడా దుమారం రేగుతోంది. 

చదవండి: IPL 2026: తొలి విడతలో సన్‌రైజర్స్‌ షెడ్యూల్‌ ఇదే..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
IPL 2026
Kavya Maran
sunrisers hyderabad
Chennai Super Kings
Sun TV Network
Madras High Court
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వివాదాల నేపథ్యంలో.. విజయ్‌ సంచలన నిర్ణయం

వివాదాల నేపథ్యంలో.. విజయ్‌ సంచలన నిర్ణయం

సన్‌రైజర్స్‌కు ఆడేందుకు పాక్‌ ఆటగాడికి అనుమతి

సన్‌రైజర్స్‌కు ఆడేందుకు పాక్‌ ఆటగాడికి అనుమతి

ఐపీఎల్‌లో డ్రింక్స్‌ బాయ్‌.. క‌ట్ చేస్తే! అక్క‌డ కేవ‌లం 25 బంతుల్లోనే

ఐపీఎల్‌లో డ్రింక్స్‌ బాయ్‌.. క‌ట్ చేస్తే! అక్క‌డ కేవ‌లం 25 బంతుల్లోనే

IPL 2027: యువరాజ్‌ సింగ్‌ ఐపీఎల్‌ రీఎంట్రీ?

IPL 2027: యువరాజ్‌ సింగ్‌ ఐపీఎల్‌ రీఎంట్రీ?

విజయ్‌, ఉదయనిధికి బిగ్‌ రిలీఫ్‌..

విజయ్‌, ఉదయనిధికి బిగ్‌ రిలీఫ్‌..

చాట్‌జీపీటీ గురువు కాదు.. కాలేజీకి డుమ్మా కుదరదు!

చాట్‌జీపీటీ గురువు కాదు.. కాలేజీకి డుమ్మా కుదరదు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.