Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

44 బంతుల్లో శతక్కొట్టిన పాక్‌ ఓపెనర్‌.. 9 వికెట్ల తేడాతో చిత్తైన న్యూజిలాండ్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Mar 21, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pajk.jpg

ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్‌ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ యువ ఓపెనర్‌ హసన్‌ నవాజ్‌ 44 బంతుల్లోనే శతక్కొట్టి పాక్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. టీ20ల్లో పాక్‌ తరఫున ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ. గతంలో ఈ రికార్డు బాబర్‌ ఆజమ్‌ పేరిట ఉండేది. బాబర్‌ 2021లో సౌతాఫ్రికాపై 49 బంతుల్లో శతక్కొట్టాడు.

నవాజ్‌ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్‌ నిర్ధేశించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్‌ 16 ఓవర్లలోనే ఊదేసింది. ఈ గెలుపుతో పాక్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు టీ20ల్లో ఘన విజయాలు సాధించిన న్యూజిలాండ్‌ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని భావించింది. 

అయితే కివీస్‌ అశలపై హసన్‌ నవాజ్‌ నీళ్లు చల్లాడు. నవాజ్‌ తన కెరీర్‌లో మూడో మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించడం విశేషం. ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నవాజ్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు.

పాక్‌ క్రికెట్‌ జట్టు విషయానికొస్తే.. ఈ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలీదు. వరుసగా పరాజయాలతో ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న ఆ జట్టు.. ఒ‍క్కసారిగా సంచలన ప్రదర్శనతో భారీ లక్ష్యాన్ని ఛేదించి ఊహించని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ గెలవడాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఇటీవలికాలంలో ఆ జట్టు ప్రదర్శన అంత దారుణంగా ఉంది మరి. నవాజ్‌ తన సుడిగాలి శతకంతో పాక్‌ క్రికెట్‌లో ఒక్కసారిగా హీరో అయిపోయాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 19.5 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. మార్క్‌ చాప్‌మన్‌ 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ చేయడానికి దోహదపడ్డారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో చాప్‌మన్‌ తర్వాత ఎవరూ ఆ స్థాయిలో రాణించలేదు. 

ఆఖర్లో కెప్టెన్‌ బ్రేస్‌వెల్‌ (18 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. టిమ్‌ సీఫర్ట్‌ (19), డారిల్‌ మిచెల్‌ (17), ఐష్‌ సోధి (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఫిన్‌ అలెన్‌ 0, నీషమ్‌ 3, మిచెల్‌ హే 9, జేమీసన్‌ 0, డఫీ 2 పరుగులకు  ఔటయ్యారు. పాక్‌ బౌలర్లలో హరీస్‌ రౌఫ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 3 వికెట్లు తీయగా.. షాహీన్‌ అఫ్రిది, అబ్రార్‌ అహ్మద్‌, అబ్బాస్‌ అఫ్రిది తలో 2, షాదాబ్‌ ఖాన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌ ఆది నుంచి దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు మహ్మద్‌ హరీస్‌ (20 బంతుల్లో 41), హసన్‌ నవాజ్‌ (45 బంతుల్లో 105 నాటౌట్‌; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగులు సాధించారు. హరీస్‌ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన సల్మాన్‌ అఘా (31 బంతుల్లో 51 నాటౌట్‌) కూడా దూకుడుగా ఆడాడు. ఫలితంగా పాక్‌ మరో 4 ఓవర్లు మిగిలుండగానే వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. పాక్‌ కోల్పోయిన ఏకైక వికెట్‌ డఫీకి దక్కింది. ఈ సిరీస్‌లో నాలుగో టీ20 మార్చి 23న మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా జరుగనుంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Pakistan
New Zealand
cricket news
fastest century
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘నేనింకా పిల్లాడినే.. అందుకు అర్హుడిని కాను’

‘నేనింకా పిల్లాడినే.. అందుకు అర్హుడిని కాను’

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.