Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

సెలక్ట్‌ కాకుండా అడ్డుకుంటావా?.. కోచ్‌పై క్రికెటర్ల పాశవిక దాడి!

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 10, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
coach.jpg

భారత క్రికెట్‌లో విస్మయకర ఘటన చోటు చేసుకుంది. తాము జట్టుకు ఎంపిక కాకుండా అడ్డుకున్నాడనే అనుమానంతో యువ క్రికెటర్లు దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కోచ్‌ను చితకబాది.. అతడిని తీవ్రంగా గాయపరిచినట్లు వార్తలు వస్తున్నాయి.

ఎన్‌డీటీవీ కథనం ప్రకారం.. పుదుచ్చేరి అండర్‌-19 క్రికెట్‌ కోచ్‌ వెంకటరామన్‌ (Venkataraman)కు తీవ్ర గాయాలయ్యాయి. పుదుచ్చేరి క్రికెట్‌ అసోసియేషన్‌ (CAP) పరిసరాల్లోనే ముగ్గురు స్థానిక క్రికెటర్లు అతడిపై దాడికి పాల్పడ్డారు. దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ (SMAT 2025)కి తమను ఎంపిక చేయకుండా.. సెలక్టర్లను ప్రభావితం చేశాడనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డారు.

హత్యాయత్నం కింద నిందితులపై కేసు
ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. హత్యాయత్నం కింద నిందితులపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా నెట్స్‌లో ఆటగాళ్లకు సూచనలు ఇస్తున్న వేళ.. అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు అతడిపై దాడికి దిగారు.

విరిగిన భుజం, ఇరవై కుట్లు
క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి వెంకటరామన్‌ను గాయపరిచారు. ఈ ఘటనలో అతడి భుజానికి (విరిగినట్లు అనుమానం), పక్కటెముకలకు తీవ్రంగా గాయాలయ్యాయి. తలపై బలంగా కూడా కొట్టడంతో నుదుటిపై దాదాపు 20 కుట్లు పడ్డాయి. ఈ ఘటన గురించి పోలీస్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. నిందితులను కార్తికేయన్‌, అర్వింద్‌రాజ్‌, సంతోష్‌ కుమారన్‌గా గుర్తించినట్లు తెలిపారు.

అత్యంత హింసాత్మకంగా
ప్రస్తుతం అసోసియేషన్‌లోని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని.. అయినప్పటికీ అక్కడ ఉన్నవారి సాయంతో నిందితులను గుర్తించామని తెలిపారు. ఈ ఘటనలో వెంకటరామన్‌ తీవ్రంగా గాయపడ్డారని.. అత్యంత హింసాత్మకంగా అతడిపై దాడి చేశారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని సదరు అధికారి పేర్కొన్నారు. నిందితులు పరారీలో ఉన్నారని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు.

కాగా ఈ ఘటనపై క్రికెట్‌ వర్గాల్లో ఆందోళన రేకెత్తింది. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటమే కాకుండా.. కోచ్‌పై దాడి చేయడాన్ని పుదుచ్చేరి అసోసియేషన్‌ అధికారులు ఖండించారు. విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఏదేమైనా ఈ అనూహ్య పరిణామంతో సెలక్షన్‌ కమిటీలో కీలకంగా వ్యవహరించే ‘పెద్దలు’ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాష్ట్రస్థాయి కోచ్‌లకు కూడా సరైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

స్కామ్‌ చేశారా?
అయితే, సెలక్షన్‌ విషయంలో పుదుచ్చేరి క్రికెట్‌ అసోసియేషన్‌ అవకతవలకు పాల్పడిందనే ఆరోపణలూ ఉన్నాయి. స్థానిక క్రికెటర్లను కాదని.. బయటి నుంచి వచ్చిన వారికి నకిలీ విద్యా సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డులు జారీ చేయించేసి.. వాటి ద్వారా లోకల్‌ కోటాలో ఇతరులను ఎంపిక చేసినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంది. ఈ కారణంగా రంజీ ట్రోఫీ 2021 సీజన్‌ నుంచి ఐదుగురు అర్హులైన క్రికెటర్లకు అన్యాయం జరిగిందని తన నివేదికలో వెల్లడించింది.

చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్‌.. నమ్మశక్యంగా లేదు

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Puducherry
cricket association
u-19 cricket team
Coach
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సీఎం రంగస్వామితో విజయ్ దూత రహస్య భేటీ!

సీఎం రంగస్వామితో విజయ్ దూత రహస్య భేటీ!

ప్రతీ ఆదివారం రెండు బిర్యానీలు ఫ్రీ : అవాక్కయ్యారా?

ప్రతీ ఆదివారం రెండు బిర్యానీలు ఫ్రీ : అవాక్కయ్యారా?

టెకె టెకెమా నేతృత్వంలో ‘డ్రాగ్‌ ఫ్లికింగ్‌’ శిక్షణ

టెకె టెకెమా నేతృత్వంలో ‘డ్రాగ్‌ ఫ్లికింగ్‌’ శిక్షణ

 ఆ ఆరోపణల్లో నిజం లేదు!.. HCAకు వ్యతిరేకంగా ధర్నా

ఆ ఆరోపణల్లో నిజం లేదు!.. HCAకు వ్యతిరేకంగా ధర్నా

4 రాష్ట్రాల ఎన్నికలకు మార్చిలో షెడ్యూల్‌

4 రాష్ట్రాల ఎన్నికలకు మార్చిలో షెడ్యూల్‌

కమల్ హాసన్‌కు ‘టార్చ్ లైట్’.. ‘ఎంఎన్‌ఎం’లో ఉత్సాహం ఉరకలు

కమల్ హాసన్‌కు ‘టార్చ్ లైట్’.. ‘ఎంఎన్‌ఎం’లో ఉత్సాహం ఉరకలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.