Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Sakshi Special
  3. హై ప్రోటీన్‌ మంత్రం
ADVERTISEMENT 

హై ప్రోటీన్‌ మంత్రం

Sakshi Special Sakshi User Sakshi Sakshi Time May 13, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
1111.jpg

ఉత్పత్తులకు సరికొత్త ‘హెల్త్‌ ట్యాగ్‌’ పేరులోనే ప్రోటీన్‌ ప్రస్తావన

అమూల్, బ్రిటానియా, ఐటీసీ.. అన్నీ ఇదే బాటలో లేబుళ్లను జాగ్రత్తగా చదవాలి

ఐసీఎమ్‌ఆర్‌ – ఎన్‌ఐఎన్‌ సూచన

గతంలో అన్ని పోషకాలూ ఇందులోనే ఉన్నాయి అంటూ పాలల్లో కలుపుకొని తాగే పొడులు, బిస్కట్ల వంటివాటిని కంపెనీలు తీసుకొచ్చేవి. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. కరోనా తరవాత ప్రజల్లో ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. రాగి ఇడ్లీ మొదలు మొలకలు, ఫ్రూట్‌ సలాడ్లు, చిరు ధాన్యాల వంటకాలు.. ఇవన్నీ చాలామంది నిత్య జీవితంలో భాగమైపోయాయి. విడివిడిగా పోషకాలు, వాటి అవసరంపై అవగాహ­నా పెరిగింది.

ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని కంపెనీలు ప్రోటీన్‌ మంత్రాన్ని జపిస్తున్నాయి. మా ఉత్పత్తిలో అత్యధిక ప్రోటీన్‌ ఉందంటూ ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు మనకు రోజువారీ ఎంత ప్రోటీన్‌ కావాలి? అది ఎలా లభిస్తుంది? భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్‌ఆర్‌), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) ఏం చెబుతున్నాయి?    –(సాక్షి, స్పెషల్‌ డెస్క్‌)

అమూల్‌ కంపెనీ ఇటీవల ‘ప్రోటీన్‌ కుల్ఫీ’ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో 10 గ్రాముల ప్రోటీన్‌ ఉంటుందని ప్యాక్‌మీద పెద్దగానే ముద్రించింది. అమూల్‌ ఇప్పటికే బటర్‌ మిల్క్, రోజ్‌ లస్సీ, కూల్‌ కేసర్, కూల్‌ కాఫీ, టిన్‌ పనీర్‌ వంటి వాటిని ‘హై ప్రోటీన్‌’ పేరుతో విక్రయిస్తోంది. ఇంకా ఆసక్తికరం ఏంటంటే.. ప్రోటీన్‌ సమోసా, ప్రోటీన్‌ వడాపావ్‌ వంటివి కూడా తీసుకొచ్చింది. అలాగే మిల్కీ మిస్ట్‌ కంపెనీ ‘స్కైఆర్‌’– హై ప్రోటీన్‌ పెరుగు తీసుకొచ్చింది.

ఇందులో 11 గ్రాముల ప్రోటీన్‌ ఉంటుందట. ఐటీసీ కంపెనీ ‘ఆశీర్వాద్‌’ ఉత్పత్తుల్లో భాగంగా...నమ్మ చక్కీ పేరిట గోధుమ పిండి విక్రయిస్తోంది. ఇందులోనూ ‘హై ఇన్‌ ప్రోటీన్‌’ అని ప్యాక్‌ మీదే ముద్రించి, ప్రతి 100 గ్రాముల్లో 14.7 గ్రాముల ప్రోటీన్‌ ఉంటుందని రాశారు.బ్రిటానియా కంపెనీ ‘బి యు’ పేరిట ప్రోటీన్‌ బార్‌లు తెచ్చింది. 45 గ్రాముల ఈ బార్‌లో 10.8 గ్రాముల ప్రోటీన్‌ ఉంటుందని పేర్కొంది. ఇవేకాదు, ఇంకా చాలా కంపెనీలు.. ఇప్పుడు ప్రోటీన్‌ మంత్రం జపిస్తున్నాయి. కరోనా తరవాత ప్రజల్లో పెరిగిన ఆరోగ్య స్పృహను దృష్టిలో పెట్టుకుని, వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఇలాంటి ఉత్పత్తులు తీసుకొస్తున్నాయి.

ఐసీఎమ్‌ఆర్‌ – ఎన్‌ఐఎన్‌ ఏమంటున్నాయి?
భారతీయులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో పూర్తి మార్గదర్శకాలతో ఐసీఎమ్‌ఆర్‌ – ఎన్‌ఐఎన్‌... ‘డైటరీ గైడ్‌లైన్స్‌ ఫర్‌ ఇండియన్స్‌ 2024’ పుస్తకం వెలువరించాయి.  శరీరంలో ఎంజైములు, హార్మోన్లు, హిమోగ్లోబిన్, కణత్వచం భాగాల వంటివాటి తయారీ.. ఇలాంటి ఎన్నో పనులకు ప్రోటీన్లు చాలా అవసరం. విరిగిపోయిన కణజాలాల స్థానే కొత్తవాటి కోసమూ ప్రోటీన్లే కావాలి. ఎదిగే పిల్లల్లో కండరాలు, ఎముకల నిర్మాణానికీ ఇవే అవసరం.

ఎంత ప్రోటీన్‌ అవసరమంటే
ఐసీఎమ్‌ఆర్‌ – ఎన్‌ఐఎన్‌ సూచనల ప్రకారం.. ఆరోగ్యంగా ఉండే ఒక వ్యక్తి... తన శరీరంలో ప్రతి కేజీ బరువుకీ రోజుకి 0.83 గ్రాముల ప్రోటీన్‌ తీసుకోవాలి. అంటే సగటున 25 కేజీల బరువుండే మనిషి రోజుకి సుమారు 21 గ్రాముల ప్రోటీన్, 50 కిలోలుంటే 42 గ్రాములు, 65 కిలోలుంటే 54 గ్రాముల ప్రోటీన్‌ తీసుకోవాలి. అలాగని ప్రోటీన్‌ ఉండే ఆహారం ఒక్కటే తీసుకుంటే.. కండరాల బలం పెరగదు. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు కూడా చాలా అవసరం. 

అంతేకాదు, రోజూ సరిపడా శారీరక వ్యాయామం చేయకపోయినా మనం తీసుకున్న ప్రోటీన్లు కండరాల నిర్మాణానికి తోడ్పడవు. మార్కెట్లోకి కొన్ని కంపెనీలు ప్రోటీన్‌ పౌడర్లను కూడా విడుదల చేస్తున్నాయి. ఇందులో అదనంగా షుగర్లు, స్వీటెనర్లు, ఇతరత్రా కృత్రిమ పదార్థాలు ఉంటున్నాయి. ప్రోటీన్‌ సప్లిమెంట్ల రూపంలో అత్యధిక ప్రోటీన్‌ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని ఐసీఎమ్‌ఆర్‌ చెబుతోంది. చాలామంది అథ్లెట్లు సప్లిమెంట్ల అవసరం లేకుండానే.. తమ రోజువారీ ఆహారంలో నుంచే తమ శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ పొందగలుగుతారని స్పష్టం చేస్తోంది.

లేబుల్‌ చదవాలి
మార్కెట్లో ఏ వస్తువు కొన్నా లేబుల్‌ మాత్రం తప్పనిసరిగా చదవాలని ఐసీఎమ్‌ఆర్‌  సూచిస్తోంది. ఉదాహరణకు ‘తక్కువ కొవ్వులు (లో ఫ్యాట్‌)’ అని లేబుల్‌లో రాస్తారు. కానీ, ఆ ఉత్పత్తి ద్వారా చాలా క్యాలరీలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మిగతా సమాచారాన్ని కూడా చదవాలి. గుడ్‌ సోర్స్‌ ఆఫ్‌ ప్రోటీన్, విటమిన్‌ డి.. వంటివి లేబుల్‌లో రాసి ఉంటే.. సింగిల్‌ సెర్వింగ్‌ ద్వారా 10 నుంచి 19 శాతం ఆ పోషకం మనకు అందే అవకాశం ఉంటుంది.

ప్రోటీన్లు అత్యధికంగా ఉండేవి
⇒ మాంసం, గుడ్లు, చికెన్, చేపలు
⇒ పాలు, పప్పు దినుసులు, సోయా బీన్, కిడ్నీ బీన్స్, బఠానీ, పెసలు, శెనగలు, బాదం, పిస్తా, జీడిపప్పు, అక్రోటు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు, క్వినోవా మొదలైనవి
⇒ మాంసాహారులకు వారంలో 700 –900 గ్రాముల చేపలు లేదా చికెన్‌ తినడం వల్ల వారికి అవసరమైన ప్రోటీన్‌ అందుతుంది.

 ప్రాసెస్డ్‌ ఫుడ్‌ కొనేస్తున్నారు
కేంద్ర గణాంక శాఖ ‘గృహ వినియోగ వ్యయ సర్వే’ ప్రకారం... పానీయాలు, ప్రాసెస్డ్‌ ఆహారంపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు నెలకు సగటున చేసే ఖర్చు 2022–23తో పోలిస్తే 2023–24లో పెరిగింది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
products
Health
Protein
Andhra Pradesh
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.