Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Sakshi Special
  3. శీతాకాల అతిథుల సందడి
ADVERTISEMENT 

శీతాకాల అతిథుల సందడి

Sakshi Special Sakshi User Sakshi Sakshi Time Nov 17, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bbb.jpg

కొల్లేరులో విదేశీ పక్షుల కిలకిలారావాలు, రెక్కల సవ్వడి

శీతాకాలపు విడిది కోసం వేల మైళ్ల దూరం నుంచి ఎగిరొచ్చున అతిథులు 

పక్షుల కిలకిలారావాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు 

పెలికాన్‌లు, ఉల్లంకిలు, కింగ్‌ఫిషర్‌లు.. సందడి చేస్తున్న పక్షులు ఎన్నో

సంతానోత్పత్తి చేసుకుని మార్చిలో స్వస్థలాలకు పయనం

శీతాకాలం వచ్చేసింది.. 
కొల్లేరు సరస్సుకు విదేశీ అతిథుల రాకా మొదలైంది. వేల మైళ్ల దూరం నుంచి ఎగిరొచి్చన రంగురంగుల పక్షులు కిలకిలారావాలతో పర్యాటకులను అలరిస్తున్నాయి. విదేశీ పక్షుల స్వస్థలాల్లో వాతావరణ మార్పు కారణంగా మనుగడ కోసం తరులు, గిరులు, సాగరాలను దాటి  ఏలూరు జిల్లా కొల్లేరుకు చేరుతున్నాయి. ఇక్కడే సంతానోత్పత్తి చేసుకొని పిల్లలతో మార్చి చివర్లో సొంతూర్లకు వెళ్లిపోతాయి. ఏటా వచ్చే ఈ అతిథులను ఇక్కడి ప్రజలు సొంతబిడ్డల్లా ఆదరిస్తారు. వీటిని చూసి ఆనందించేందుకు వచ్చే పర్యాటకులతో పక్షుల విహార కేంద్రాలు కళకళలాడుతున్నాయి.

రాష్ట్రంలో పక్షుల విహార కేంద్రాలు 
⇒ కొల్లేరు – ఏలూరు జిల్లా
⇒ పులికాట్‌ సరస్సు, నేలపట్టు – నెల్లూరు జిల్లా 
⇒ ఉప్పలపాడు – గుంటూరు 
⇒ తేలినీలపురం, తేలుకుంచి – శ్రీకాకుళం 
⇒ కౌండన్య – చిత్తూరు జిల్లా

77,138 ఎకరాల విస్తీర్ణంలో.. 
ప్రకృతి సోయాగాల ఆరాధకులను కనువిందు చేస్తుంది కొల్లేరు సరస్సు. ఏలూరు జిల్లాలో 77,138 ఎకకాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ ఆటపాక, మాధవపురం పక్షుల విహార కేంద్రాలు ప్రశిద్ధమైనవి. ఏటా శీతాకాలంలో వందలాది జాతుల పక్షులు ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటాయి. మన దేశానికి ఏటా వలస వచ్చే పక్షి జాతులు 1,349 ఉన్నట్లు అంచనా. వీటిలో ఎక్కువగా కొల్లేరు ప్రాంతానికి వస్తుంటాయి. ఏషియన్‌ వాటర్‌ బర్ట్స్‌ నివేదిక ప్రకారం గతేడాది ఇక్కడ 105 పక్షి జాతులకు సంబంధించి 81,495 పక్షులు విడిది చేశాయి. ఈ ఏడాది మార్చిలో 50 వేల పక్షులు ఉన్నట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.  

వలస పక్షులకు విడిది 
వలస అనేది పక్షుల జీవన శైలి. రుతువుల్లో మార్పులు వచ్చునప్పుడు దాదాపు 4,000 పక్షి జాతులు అనువైన ప్రదేశాలను వెతుక్కుంటూ వలసలు వెళతాయి. వీటిలో సుమారు 1,800 జాతులు అత్యంత సుదూర ప్రాంతాలకు వెళ్తాయి. కొల్లేరుకు సైబీరియా, రష్యా, టర్కీ, తూర్పు యూరప్, అ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ వంటి దేశాల నుంచి పక్షులు వస్తున్నాయి. వీటిలో ఆఫ్రికా నుంచి రెడ్‌ క్రిస్టెడ్‌ పోచార్డ్‌ (ఎర్ర తల చిలువ), అలాస్మా నుంచి పసిఫిక్‌ గెల్డెన్‌ ఫ్లోవర్‌ (బంగారు ఉల్లంకి), ఐర్లండ్‌ నుంచి కామన్‌ రెడ్‌ షాంక్‌ (ఎర్ర కాళ్ల ఉల్లంకి), ఐరోపా నుంచి యురేíÙయన్‌ స్పూన్‌ బిల్‌ (తెడ్డు మూతి కొంగ), దక్షిణాఫ్రికా నుంచి బ్రాహ్మణి షెల్‌ డక్‌ (బాపన బాతు), ఫిలిప్సీన్స్‌ నుంచి వైట్‌ పెలికాన్‌ (తెల్ల చింక బాతు) వంటివి ముఖ్యమైనవి.

చిత్తడి నేలల నెలవు ‘కొల్లేరు’ 
చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు పక్షుల జీవనానికి అనువైనది. ఇక్కడి ఆటపాక పక్షుల కేంద్రం పెలికాన్‌ (గూడబాతు) పక్షుల ఆవాస ప్రాంతంగా పేరుగడించింది. దీనిని పెలికాన్‌ ప్యారడైజ్‌గా పిలుస్తారు. కొల్లేరు సరస్సులో గూడబాతుతో పాటు ఎర్ర కాళ్ల కొంగ (పెయింటెడ్‌ స్టార్క్‌), నల్ల రెక్కల ఉల్లంకి పిట్ట (బ్లాక్‌ వింగ్డ్‌ స్టిల్ట్‌), తెడ్డు ముక్కు కొంగ (ఏషియన్‌ ఓపెన్‌బిల్‌ స్టార్క్‌) కంకణాల పిట్ట (గ్లోబీ ఐబీస్‌), చిన్న నీటి కాకి (లిటిల్‌ కార్మోరెంట్‌), సాధారణ కోయిలలు (స్వాలో), పెద్ద చిలువ బాతు (లార్జ్‌ విజ్లింగ్‌ డక్‌), చెరువు బాతు (గార్గనే), తొండు వల్లంకి (బ్లాక్‌ టయల్డ్‌ గాట్‌విట్‌) వంటి 105 రకాల పక్షి జాతులు ఉన్నాయి.

పక్షులు మంచి నేస్తాలు  
పక్షులు పర్యావరణ సమతుల్యతకు మంచి నేస్తాలు. వాటిని సంరక్షించుకోవాల్సిన బా ధ్యత అందరిపై ఉంది. వలస పక్షుల్లో అనేక జాతులు అంతరించేపోయే ప్రమాదంలో ఉన్నాయని ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. కొల్లేరులో చిత్తడి నేలల ప్రదేశాలు వలస పక్షులకు ఆవాసాలుగా ఉన్నాయి. పక్షులకు ఏ విధమైన హాని తలపెట్టకుండా సంరక్షించుకోవాలి.  –దీపక్‌ రామయ్యన్, వైల్డ్‌లైఫ్‌ ఎక్స్‌పర్ట్, హైదరాబాద్‌

ఆకాశమే వాటి హద్దు
సమశీతల వాతావరణాన్ని వెతుక్కుంటూ పక్షులు వలస వస్తాయి. ఆకాశమే వాటి హద్దు. కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం వీటికి అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో శీతాకాలంలో మంచుగడ్డ కడుతుంది. అందువల్ల అవి సెంట్రల్‌ ఆసియన్‌ ఫ్‌లైవే (సీఏఎఫ్‌) మీదుగా మన దేశానికి వస్తాయి. ఆటపాక పక్షుల కేంద్రంలో బోటు షికారు ద్వారా పక్షులను దగ్గరగా తిలకించే అవకాశం ఉంది.  –కేవీ రామలింగాచార్యులు, ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్, వైల్డ్‌ లైఫ్‌ మేనేజ్‌మెంట్, కైకలూరు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Kingfisher
Pelican birds
kolleru
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.