Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. బాబు విషబీజాలు.. ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు: వైఎస్‌ జగన్‌
ADVERTISEMENT 

బాబు విషబీజాలు.. ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు: వైఎస్‌ జగన్‌

Politics Sakshi User Sakshi Sakshi Time Jul 31, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ysjagan7.jpg

రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తన పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటని.. పర్యటన కోసం ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారాయన.  నెల్లూరులో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.. 

సాక్షి, నెల్లూరు: రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మా పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటి?.. పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారాయన. గురువారం నెల్లూరు పర్యటనలో భాగంగా.. అక్రమ కేసుల్లో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణితో ములాఖత్‌ అయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. 

మా పార్టీ శ్రేణులు, అభిమానులు రాకుండా రోడ్లను తవ్విన అధ్వాన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతను చూసి చంద్రబాబు ఇంతలా ఎందుకు భయపడుతున్నారు?. ఇవాళ వేల మంది పోలీసులు.. లెక్కలేనంత మంది డీఐజీలు, డీఎస్పీలు ఉన్నారు. వీళ్లంతా నా సెక్యూరిటీ కోసం కాకుండా.. అభిమానులను ఆపడం కోసం ఉన్నారు.  

సూపర్‌సిక్స్‌ అంటూ ప్రజలను మోసం చేశారు. నాడు నేడు ఆగిపోయింది. ఇంగ్లీష్‌ మీడియం ఆగిపోయింది. అన్ని పథకాలు ఆపేశారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. తన పాలన చూసి చంద్రబాబే భయపడుతున్నారు.  ప్రజలకు సమాధానం చెప్పుకోలేకే రెడ్‌బుక్‌ రాజ్యాంగం. ప్రశ్నించేవారి గొంతులను నొక్కేస్తున్నారు. 

ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ప్రసన్న ఇంటిపైకి 80 మందిని పంపి దాడి చేయించారు. మారణాయుధాలతో ఇంట్లోకి ప్రవేశించి.. ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ఆ దాడితో ప్రసన్న తల్లి వణికిపోయారు. ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. లేకుంటే చంపి ఉండేవారేమో. ఇళ్లపై దాడులేంటి.. మనుషుల్ని చంపాలని చూడడమేంటి?. మనిషి నచ్చకపోతే చంపేస్తారా?.. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు గతంలో చూడలేదు. మా పార్టీ మహిళా నేతలు రోజా, ఉప్పాడ హారిక, విడదల రజిని లాంటి వాళ్లను ఉద్దేశించి టీడీపీ నేతలు ఎంత దారుణంగా మాట్లాడారో అంతా చూశారు.  రాష్ట్రంలో చంద్రబాబు విషబీజాలు నాటారు.. 

కాకాణి గోవర్ధన్‌పై 14 కేసులు పెట్టారు. కావలిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. దానిని ప్రశ్నించినందుకే తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కాకాణిపై కేసులు పెట్టారు. ఒక రాజకీయ నాయకుడు ప్రెస్‌ మీట్‌ పెడితే.. దానిని వాట్సాప్‌లో షేర్‌ చేస్తే కేసులు పెడతారా?. ఒక కేసు అయిపోగానే మరో కేసు పెట్టి వేధిస్తున్నారు. ఏ తప్పు చేశాడని కాకాణిపై కేసులు పెట్టారు?. శాడిజం చంద్రబాబు నరనరాన పేరుకుపోయిందనడానికి ఇదే నిదర్శనం అని జగన్‌ అన్నారు.

టీడీపీ కార్యకర్త సాక్ష్యం చెబితే కాకాణిపై కేసు పెడతారా?. మాగుంట శ్రీనివాసులు ఫోర్జరీ కేసులో చొవ్వా చంద్రబాబు కోసం కాకాణిపై కేసు పెడతారా?. టీడీపీ నేతల దాడుల్లో గాయపడిన బాధితులను పరామర్శించినా కేసులు పెడతారా?. పోలీసుల పక్షపాత ధోరణిని ఎత్తి చూపించినా కేసులు పెడతారా?. ఇంతకన్నా అన్యాయమైన పరిస్థితులు ఉంటాయా?.. అని జగన్‌ ప్రశ్నించారు. 

లిక్కర్‌ మాఫియాకు డాన్‌ చంద్రబాబే. కూటమి ప్రభుత్వంలో ఇల్లీగల్‌ పర్మిట్‌ రూంలో మద్యం అమ్ముతున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు అమ్ముతున్నారు. మద్యం కమీషన్లు చంద్రబాబు, ఎమ్మెల్యేలే పంచుకుంటున్నారు. సిలికా, క్వార్ట్జ్‌ను విచ్చలవిడిగా దోచేస్తున్నారు. మైన్స్‌ కమీషన్లు చంద్రబాబు, లోకేష్‌కే చేరుతున్నాయి. పరిశ్రమలు నడుపుకోవాలన్నా.. ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ పరిస్థితులే ఉదాహరణలు.

నందిగం సురేష్‌ను జైల్లో పెట్టారు. వల్లభనేని వంశీని చిత్రహింసలు పెట్టారు. కాలేజీ రోజుల నాటి గొడవ.. పెద్దిరెడ్డితో కోపంతోనే మిథున్‌రెడ్డిపై చంద్రబాబు లిక్కర్‌ కేసు పెట్టారు. తన సొంత నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడనే కోపంతోనే చంద్రబాబు కేసు పెట్టించాడు. కొడాలి నాని, పేర్ని నాని.. పేర్ని నాని భార్యను, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను వేధిస్తున్నారు. ఇలా ఎంతో మంది(పేర్లు చదివి వినిపించారు) అన్యాయాలను ప్రశ్నిస్తున్నవాళ్ల మీద తప్పుడు కేసులు పెట్టారు అని జగన్‌ అన్నారు.


చంద్రబాబూ.. మీరు ఏదైతే విత్తుతారో అదే రేపు పండుతుంది. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. కళ్లు మూసి తెరిచేలోపే మూడేళ్లు గడుస్తుంది. అప్పుడు మా ప్రభుత్వమే వచ్చింది. అప్పుడు కచ్చితంగా చంద్రబాబుకి, చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తిన అధికారులకు లెక్క జమ తీసి చట్టం ముందు నిలబెడుతాం. తప్పు చేసిన ప్రతీ ఒక్కరికి శిక్ష తప్పదు. ఇప్పటికైనా అది గుర్తించండి.. అని జగన్‌ మరోసారి హెచ్చరించారు. 

LIVE: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Andhra Pradesh
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
Kutami Prabhutvam
AP Politics
YSRCP
nellore tour
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.