Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ఉత్తరాంధ్ర నుంచే వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావం 
ADVERTISEMENT 

ఉత్తరాంధ్ర నుంచే వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావం 

Politics Sakshi User Sakshi Sakshi Time Feb 11, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
subareddy.jpg

సాక్షి, విశాఖపట్నం: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారని వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. గురువారం ఎండాడలోని పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్, సీదిరి అప్పలరాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ఈ నెల 25న సుమారు 3 లక్షల మందితో భీమిలిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. భీమిలిలో జరిగే బహిరంగ సభ ద్వారా పార్టీ శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో 175/175 లక్ష్యంతో ఎన్నికల ప్రచారం సాగుతుందని స్పష్టం చేశారు. గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో ఇచి్చన హామీలను అధికారం చేపట్టిన తరువాత పూర్తిగా అమలుచేసి చూపించారన్నారు.

వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని భీమిలి బహిరంగ సభ ద్వారా ప్రజలకు వివరిస్తారని పేర్కొన్నారు. బహిరంగ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరుకానున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భా­గం­గా రాష్ట్రవ్యాప్తంగా 5 ప్రాంతీయ సమా­వే­శా­లు నిర్వహించి పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశమవుతారని చెప్పారు. పార్టీ క్యాడర్‌లో అసంతృప్తిని తొలగించడంతోపాటు ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులకు గల కారణాలను నేరుగా సీఎం వైఎస్‌ జగన్‌ వివరిస్తారన్నారు. 

విశాఖ రాజధాని కావడం తథ్యం 

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖ పరిపాలన రాజధాని కావడం తథ్యమని, దివంగత సీఎం వైఎస్, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే విశాఖ నగరం, ఉత్తరాంధ్ర అభివృద్ధి బాట పట్టిందని కొనియాడారు. కాదని చేప్పే దమ్ము ఎవరికైనా ఉందా అని సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భీమిలి బహిరంగ సభకు ముందు ఈ నెల 21 నుంచి 23 వరకు ఉత్తరాంధ్రలో నియోజకవర్గస్థాయి పార్టీ సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దళారులు, మధ్యవర్తులు లేకుండా నేరుగా ప్రజల బ్యాంక్‌ ఖాతాలకు నేరుగా నగదు జమ చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, దీనిని ప్రజలు చూస్తూ ఊరుకోరని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. తమ సంకల్పం ఉత్తరాంధ్ర అభివృద్ధి అని స్పష్టం చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స సమాధానమిస్తూ.. రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమన్నారు. జూనియర్‌ ఎనీ్టఆర్‌ ఫ్లెక్సీలు ఎందుకు తీసేశారనేది టీడీపీ ఇష్టమని.. తమకు సంబంధం లేని అంశంపై తాను మాట్లాడనన్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
YS Jagan Mohan Reddy
YSRCP
Bheemili
open house
subbareddy
botsa satyanarayana
AP Elections 2024
AP Politics
AP Assembly Elections 2024
AP 175
Bheemili Assembly Constituency
Visakapatnam Elections
Visakapatnam Assembly Constituencies
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.