Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. వేసవిలో ప్రాణహిత శంకుస్థాపన
ADVERTISEMENT 

వేసవిలో ప్రాణహిత శంకుస్థాపన

Politics Sakshi User Sakshi Sakshi Time Dec 6, 2024 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
uttam.jpg

‘సాక్షి’ ఇంటర్వ్యూలో నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

తుమ్మిడిహెట్టి సహా పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం 

‘కాళేశ్వరం’పై రాజకీయ దురుద్దేశాల్లేవు..ప్రాజెక్టును వీలైనంత వాడుకుంటాం.. త్వరలో నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ

ఏపీతో నీటి వాటాలపై రాజీలేదు.. 

జనవరి/ఫిబ్రవరి నుంచి సన్న బియ్యం పంపిణీ  

సాక్షి, హైదరాబాద్‌: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్‌లతోపాటు అంచనాలను సవరించి వచ్చే వేసవిలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఎన్నికల హామీ మేరకు ఈ టర్మ్‌లోనే ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మించే అంశాన్ని పునఃపరిశీలిస్తున్నామని.. నిపుణుల సలహా మేరకు ముందుకెళ్తామని అన్నారు. గత డిజైన్లు, నీటి లభ్యతను పునఃసమీక్షించి బరాజ్‌ను తప్పనిసరిగా కడతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రేపటితో (డిసెంబర్‌ 7) ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఏడాది కాలంలో సాధించిన ప్రగతి, పాలనా విశేషాలను పంచుకున్నారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

‘కాళేశ్వరాన్ని’ సాధ్యమైనంత వరకు వాడుకుంటాం... 
తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగానే ఉండాలనే రాజకీయ దురుద్దేశాలు మాకు లేవు. ప్రాజెక్టును ఏ మేరకు ఉపయోగంలోకి తీసుకురాగలమో అంతవరకు తీసుకొస్తాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణకు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నివేదిక  కోసం నిరీక్షిస్తున్నాం. జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచనల మేరకు బరాజ్‌లను రక్షించుకోవడానికి గ్రౌటింగ్‌ పనులను అధికారులు చేయడంపై ఎన్డీఎస్‌ఏ అభ్యంతరం తెలపడం వాస్తవమే.

మేడిగడ్డ బరాజ్‌ కుంగినందున అన్నారం, సుందిళ్ల బరాజ్‌లనైనా వాడుకోవచ్చా? అని ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ను అడిగా. మూడు బరాజ్‌లకు సికెంట్‌ పైల్స్‌ వాడటంతో వాటి భద్రతపై అనుమానాలున్నాయని.. క్లియరెన్స్‌ ఇవ్వలేమని ఆయన బదులిచ్చారు. దీనిపై డిసెంబర్‌ ఆఖరిలోగా పరిశీలించి చెప్తామన్నారు. 

‘కాళేశ్వరం’లేకున్నా రికార్డుస్థాయి దిగుబడి.. 
కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లలో చుక్క నీళ్లు నిల్వ చేయకపోయినా గత వానాకాలంలో 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండటం దేశంలోనే రికార్డు. ధాన్యం అమ్మకాలతో రైతులు రూ. 35–40 వేల కోట్లు ఆర్జించారు. సన్నాలకు పరిమితి లేకుండా రూ. 500 చొప్పున 1,87,532 మంది రైతులకు బోనస్‌ ఇచ్చాం. యాసంగిలో సన్నాలకు బోనస్‌ కొనసాగిస్తాం. దొడ్డు వడ్లనూ కొంటాం. 

పాత, కొత్త ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.. 
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధిక కమీషన్లు వచ్చే పనులకే ప్రాధ్యాతనిచి్చంది. మేము సాగునీటి ప్రాజెక్టులను ఏ, బీ కేటగిరీలుగా విభజించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సత్వరమే సాగునీరు ఇచ్చే పనులను చేస్తున్నాం. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, డిండి, దేవాదుల, గౌరవెల్లి, ఎస్సారెస్పీ, అచ్చంపేట లిఫ్టుతోపాటు కొత్తగా చేపట్టిన కొడంగల్‌–నారాయణపేట ప్రాజెక్టులను ఈ టర్మ్‌లోనే పూర్తిచేస్తాం. నా ప్రధాన బాధ్యతగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను రెండేళ్లలో పూర్తిచేస్తా. జాతీయ విధానం ఆధారంగా లోయర్‌ మానేరు, మిడ్‌మానేరు ప్రాజెక్టుల్లో పూడిక తొలగింపు పనులను ప్రయోగాత్మకంగా చేపట్టబోతున్నాం. తర్వాత అన్ని ప్రాజెక్టుల్లో చేపడతాం. 

సీఎం, డిప్యూటీ సీఎం రాష్ట్రాభివృద్ధికి నిధులు సమీకరిస్తారని నమ్ముతున్నా.. 
బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు రూ. 22,160 కోట్లు కేటాయిస్తే అందులో రుణాలు, వడ్డీల చెల్లింపులు పోగా మిగిలిన రూ. 11 వేల కోట్లను ప్రాజెక్టులపై ఖర్చు చేస్తున్నాం. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాజెక్టులకు, రాష్ట్రాభివృద్ధికి సరిపడా నిధులు సమీకరిస్తారని నమ్మకం ఉంది. 

అన్ని జిల్లాలూ సమానమే.. 
ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రాజెక్టులకే ప్రాధ్యాత ఇస్తున్నామన్న ఆరోపణలు అవాస్తవం. కరీంనగర్‌లో గౌరవెల్లి ప్రాజెక్టుకి రూ. 500 కోట్లు ఇచ్చాం. చిన్నకాళేశ్వరం పూర్తి చేస్తున్నాం. పెద్దపల్లిలో పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మిస్తున్నాం. మాకు అన్ని జిల్లాలు సమానమే. 

గత సర్కారు చుక్క నీటినీ సాధించలేదు.. 
రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీటి వాటాలపై రాజీ ప్రసక్తే లేదు. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల ఉమ్మడి ఏపీ వాటాలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులను అంగీకరిస్తూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి లిఖితపూర్వకంగా సమ్మతి తెలిపింది. తాజాగా అందుకు అంగీకరించబోమని.. 70 శాతం పరీవాహక ప్రాంతంగల తెలంగాణకే 70 శాతం జలాలను కేటాయించాలని కేంద్రంతో కోట్లాడుతున్నాం. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క–సారక్క ప్రాజెక్టులకు చుక్క నీటి కేటాయింపులను కూడా గత సర్కారు సాధించలేదు. మా ప్రయత్నాలతో సీతారామకు 67 టీఎంసీల కేటాయింపులు తుది దశకు చేరాయి. 

శ్రీశైలంపై 10 రోజుల్లో సుప్రీంకు... (బాక్స్‌ ఐటెమ్‌) 
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు, ఇతర మార్గాల ద్వారా ఏపీ అక్రమంగా నీళ్లు తరలిస్తుండడంపై వారం 10 రోజుల్లో సుప్రీం కోర్టులో కేసు వేయబోతున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి వైఫల్యంతోనే నాగార్జునసాగర్‌పై నియంత్రణ సీఆర్పీఎఫ్‌ చేతుల్లోకి వెళ్లిందని ఎమ్మెల్సీ కె.కవిత చేసిన ఆరోపణలు అర్థరహితం. సాగర్‌ను తిరిగి కైవసం చేసుకోవడానికి చట్టప్రకారం అన్నీ చేస్తాం. ఇంజనీర్ల పదోన్నతులపై హైకోర్టులో స్టే తొలగిన వెంటనే నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరిస్తాం. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల్లో భారీ సంస్కరణలు తీసుకొస్తున్నాం. 

జనవరి లేదా ఫిబ్రవరిలో రేషన్‌కార్డులకు సన్న బియ్యం.. 
రైతులు సన్నాలను అధిక ధరకు ధాన్యం వ్యాపారులకు అమ్ముకోవడం సంతోషకరం. రేషన్‌కు కొరత లేకుండా అవసరమైన సన్న బియ్యాన్ని సమీకరిస్తాం. మేము అధికారంలోకి వచ్చేసరికి సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ అప్పులు రూ. 58,623 కోట్లు ఉండగా 10 నెలల్లో రూ. 11,600 కోట్లను కట్టేశాం. సంస్కరణల్లో భాగంగా మరో రెండు పంటల నాటికి మిల్లర్ల నుంచి 100 శాతం బ్యాంకు గ్యారంటీ అడుగుతాం. డిఫాల్టర్ల నుంచి చట్టపరమైన చర్యలతో రికవరీ చేస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు పూర్తయ్యాక రేషన్‌కార్డుల జారీకి మళ్లీ కసరత్తు ప్రారంభిస్తాం. రేషన్‌ షాపుల్లో సన్నబియ్యం పంపిణీని జనవరి లేదా ఫిబ్రవరిలో మొదలుపెట్టే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది. 

24 గంటలూ ప్రజలకు అందుబాటులో... 
తెలంగాణ ప్రజాకాంక్షలకు విరుద్ధంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేసింది. వన్‌ మ్యాన్‌ షో.. వన్‌ ఫ్యామిలీ షో అన్నట్లుగా పాలన సాగింది. నిలువెల్లా అహంకారం, నియంత్రతృత్వ ధోరణి, అవినీతితో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నాటి సర్కార్‌ నీరుగార్చింది. మేము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి శాసనసభ గౌరవాన్ని పెంపొందించాం. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. సమర్థంగా శాఖలను పరుగెత్తిస్తున్నాం. కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో మంత్రులకు గౌరవం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉంటుంది. 

బీఆర్‌ఎస్‌ అతిచేస్తోంది.. 
మేము అధికారంలోకి వచ్చి ఏడాది కాలేదు. ఇదైపోయింది... అదైపోయిందని బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడటం సరికాదు. మూసీ ప్రాజెక్టులో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోయినా కుంభకోణం అనడం అతి. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఉద్యోగ, ఉపాధి కల్పనలో పదేళ్లు విఫలమయ్యారు. 10 నెలల్లోనే 55 వేల ఉద్యోగాలిచ్చాం. నిన్న ఇంకా 9 వేల ఉద్యోగాలు భర్తీ చేసినా ఏడుపే. పదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టునూ భర్తీ చేయలేదు. మేము 11 వేల మంది టీచర్లను నియమించాం. నీటిపారుదల శాఖలో 687 మంది ఏఈఈలను భర్తీ చేశాం. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Uttam Kumar Reddy N
interview with sakshi
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.