Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. Telangana: ఎన్నికలొచ్చాయ్‌..
ADVERTISEMENT 

Telangana: ఎన్నికలొచ్చాయ్‌..

Politics Sakshi User Sakshi Sakshi Time Oct 10, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ELECTION-NAGARA-2.jpg

సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్‌ 3వ తేదీన నోటిఫికేషన్‌ ఇవ్వడంతోపాటు నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. అదే నెల 30న పోలింగ్, డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తెలంగాణతోపాటు మరో నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం శాసనసభలకు ఎన్నికల ఏర్పాట్లు, ఇతర వివరాలను చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్,ఎలక్షన్‌ కమిషనర్లు అనూప్‌ చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌ సోమవారం ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. 



రాష్ట్రంలో ఒకే దశలో.. : వచ్చే ఏడాది జనవరి 16వ తేదీతో ముగిసే తెలంగాణ అసెంబ్లీలోని 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఈసారి ఒకే విడతలో జరుగనుంది. నవంబర్‌ 3న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. నామినేషన్‌ దాఖలుకు నవంబర్‌ 10 ఆఖరు తేదీగా నిర్ణయించారు. నవంబర్‌ 13న దరఖాస్తుల పరిశీలన చేపడతారు. ఉపసంహరణకు నవంబర్‌ 15 వరకు గడువు ఇస్తారు. అదే నెల 30న రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకేసారి పోలింగ్‌ జరుగుతుంది. మావోయిస్ట్‌ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో, మిగతా మూడు రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్‌ పూర్తికానుంది. ఎన్నికల షెడ్యూల్, పోలింగ్‌ వేర్వేరు తేదీల్లో ఉన్నా.. ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును మాత్రం డిసెంబర్‌ 3వ తేదీనే చేపట్టి, ఫలితాలను ప్రకటించనున్నారు. 



ఐదు రాష్ట్రాలు.. 16.14 కోట్ల మంది ఓటర్లు 

ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, మొత్తం 16.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లేనని సీఈసీ రాజీవ్‌కుమార్‌ ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి 2,900కు పైగా పోలింగ్‌ కేంద్రాలను యువత నిర్వహిస్తారని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో నగదు తరలింపు, ఉచితాలు, బహుమతులు, మద్యం, డ్రగ్స్‌ అక్రమ రవాణాను అరికట్టడానికి విస్తృత తనిఖీలు చేపట్టనున్నామని.. ఈ మేరకు నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని వివరించారు. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 940 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. 



మొదటిసారిగా ‘సీజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం’ 

ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌)ను ఎవరైనా అతిక్రమించినట్టు గుర్తిస్తే.. సీవిజిల్‌ యాప్‌ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ సూచించారు. క్రిమినల్‌ కేసులున్న అభ్యర్థులు తప్పనిసరిగా కేసులకు సంబంధించి పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మొదటిసారిగా ‘ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం’ను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ఖర్చుపై పూర్తిస్థాయి పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. నాన్‌ షెడ్యూల్డ్‌ చార్టర్డ్‌ విమానాలతోపాటు రైల్వే, పోస్టల్‌ కార్గోలను క్షుణ్నంగా తనిఖీ చేస్తామని చెప్పారు. వివాదాస్పద, సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరిస్తామన్నారు. 

 





ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Central Election Commission
Rajiv Kumar
general elections
Assembly Elections
TS Assembly Top Stories
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

89 లక్షల మంది ఓటర్లకు నోటీసులు?

89 లక్షల మంది ఓటర్లకు నోటీసులు?

ఆక్రమిత కశ్మీర్‌ కల్లోలం

ఆక్రమిత కశ్మీర్‌ కల్లోలం

హరీష్‌ రావుపైనే మా అమ్మ పోటీ.. కవిత కుమారుడు ఆదిత్య

హరీష్‌ రావుపైనే మా అమ్మ పోటీ.. కవిత కుమారుడు ఆదిత్య

నేపాల్‌లో నేడే పోలింగ్‌

నేపాల్‌లో నేడే పోలింగ్‌

రాష్ట్రాల ఎన్నికల కమిషనర్‌లతో 24న ఈసీ భేటీ

రాష్ట్రాల ఎన్నికల కమిషనర్‌లతో 24న ఈసీ భేటీ

సభకు వెళ్లే పెద్దలెవరు?

సభకు వెళ్లే పెద్దలెవరు?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.