సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ విద్యుత్ రంగంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేతలు వర్సెస్ జగదీష్ రెడ్డి అనే విధంగా చర్చ నడుస్తోంది. నేతల మధ్య పవర్ వార్ జరుగుతోంది.
విద్యుత్ రంగంపై చర్చను మొదట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు.
రాజగోపాల్ రెడ్డి కామెంట్స్..
-
గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది.
-
అందుకే పవర్ సెక్టార్ గందరగోళంగా మారింది.
-
రైతులకు ఉచిత కరెంట్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే.
-
విద్యుత్ రంగం అస్తవ్యస్తమైంది.
-
యూపీఏ ప్రభుత్వం నిర్ణయం వల్ల 1800 మెగావాట్ల అదనపు కరెంట్ రాష్ట్రానికి వచ్చింది.
-
కేసీఆర్ ఎందుకు రాలేదంటే, మీ స్థాయికి మేము చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు.
-
ఇంత పెద్ద విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ సభకు రాలేదు.
-
మీ స్థాయి ఏంటో ప్రజలు మీకు చెప్పారు.
-
కనీసం అధికారులు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు.
-
చేసిన తప్పులు చాలవని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
-
విద్యుత్ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.
-
ఉచిత కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది.
-
ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.
-
విద్యుత్ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.
-
ఉచిత కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది.
-
ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.
-
గనులకు 250 కి.మీలకు దూరం ఉన్న దామెరచెర్ల దగ్గర పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టారు?.
-
యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు.
-
పవర్ ప్లాంట్‌లో టెండర్ వ్యవస్థ లేదు. పారదర్శకత లేదు.
అనంతరం, జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..
-
ఇప్పటి వరకు డిమాండ్ బుక్స్ ఇవ్వలేదు.
-
దేనిపై మాట్లాడాలో అర్థం కావడం లేదు
-
చర్చించడానికి సమయం లేదంటున్నారు.
-
పది రోజుల ముందే సభ పెడితే ఏమయ్యేది: జగదీష్ రెడ్డి.
-
ఒకేరోజు 19 పద్దులపై చర్చ పెట్టడం సమంజసమేనా?.
-
మీటర్ల విషయంలో సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించారు.
-
కరెంట్ తలసరి వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.
-
ఉదయ్ స్కీమ్‌లో 27 రాష్ట్రాలు చేరాయి.
-
స్మార్ట్ మీటర్లతో డిస్కంలు చేరాయి. మీటర్ల విషయంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు.
-
ఒప్పందంలో వాళ్లకు అనుకూలమైన అంశాలను మాత్రమే చెప్పారు.
-
తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు విద్యుత్ అందించామన్నారు.
అంతకుముందు మధ్యలో..
-
డిమాండ్ బుక్స్ నిన్నే రాత్రే పంపించామని స్పీకర్ చెప్పారు.
-
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. డిమాండ్ బుక్స్ ఇప్పటికే పంపించాం.
-
పదేళ్లలో రేపు చర్చ ఉండే ఈరోజు రాత్రి 10 గంటలకు వచ్చి మాకు బుక్స్ ఇచ్చేవారు.
-
ఇదే సమయంలో హరీష్ రావు మాట్లాడటంతో శ్రీధర్ బాబు ఫైర్.
-
హరీష్ రావు బుల్డోడ్ చేసేపని పెట్టుకున్నారు.
-
ఇది మానుకోవాలి. సభను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు.
-
మీరు త్వరగా ఇంటికి వెళ్తే మేమేం చేస్తాం అంటూ కౌంటర్..

