Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. కర్నాటకలో ఖతర్నాక్‌ పోటీ.. ఆసక్తికరంగా ట్రాకర్‌ పోల్‌ సర్వే
ADVERTISEMENT 

కర్నాటకలో ఖతర్నాక్‌ పోటీ.. ఆసక్తికరంగా ట్రాకర్‌ పోల్‌ సర్వే

Politics Sakshi User Sakshi Sakshi Time Apr 20, 2023 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
KTK.jpg

కర్ణాటకలో వచ్చే ఏప్రిల్‌/మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ జరగనుందని  పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన మొదటి ట్రాకర్‌ పోల్‌ సర్వేలో వెల్లడయ్యింది. ‘సౌత్‌ ఫస్ట్‌’ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం పీపుల్స్‌పల్స్‌ సంస్థ - ‘సిస్రో’తో కలిసి తాజాగా ఈ సర్వే నిర్వహించింది. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాల్లో, మెజారిటీ రాకపోయినా.. కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు సాధిస్తుందని, మొత్తం మీద హంగ్‌ ఏర్పడే అవకాశాలున్నాయని ట్రాకర్‌ పోల్‌లో తెలిసింది. 



పీపుల్స్‌పల్స్‌ డైరెక్టర్‌ ఆర్‌.దిలీప్‌రెడ్డి గురువారం మొదటి ట్రాకర్‌పోల్‌ ఫలితాలను విడుదల చేశారు. మొదటి ట్రాకర్‌ పోల్‌ 2022 డిసెంబర్‌ 22-31 వరకు నిర్వహించారు. పది రోజుల పాటు జరిగిన తాజా సర్వే గణాంకాలను శాస్త్రీయంగా అన్వయించి విశ్లేషించి, సిస్రో వ్యవస్థాపక డైరెక్టర్‌ ధనుంజయ్‌ జోషి ఆధ్వర్యంలో నివేదికను రూపొందించారు. ఎన్నికలలోపు మరో రెండు విడతల్లో రాష్ట్రంలో ఈ సర్వే జరుగనుంది. మరో రెండు మార్లు ట్రాక్‌ పోల్స్‌ సర్వేను 2023 మార్చిలో ఒకసారి, సరిగ్గా ఎన్నికల ముందు మరోసారి చేపడుతారు.

కర్నాటకలో గత మూడున్నర దశబ్దాలుగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా వరుసగా తిరిగి విజయం సాధించలేదు. దక్షిణ భారత దేశంలో కర్నాటక రాష్ట్రంలో మాత్రమే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ అధికారం నిలుపుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. 2022లో ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో వరుసగా రెండోసారి తామే అధికారంలోకి వచ్చినట్టు ఇక్కడ కూడా పట్టు సాధించి, తిరిగి అధికారం నిలుపుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు, హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికార మార్పు సంప్రదాయం కొనసాగినట్లే ఇక్కడ కూడా అధికార పార్టీ పరాజయం పాలై, తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) పార్టీలు ధీమాతో ఉన్నాయి.

పీపుల్స్‌ పల్స్‌-సిస్రో రీసెర్చ్‌ సంస్థలు నిర్వహించిన మొదటి ట్రాకర్‌ పోల్‌ సర్వే ప్రకారం 224 అసెంబ్లీ స్థానాల్లో 101 స్థానాలు (ప్లస్‌/మైనస్‌ 9 స్థానాలు) సాధించి కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. అధికార బీజేపీ 91 స్థానాలకు (ప్లస్‌/మైనస్‌ 7 స్థానాలు) పరిమితమవుతుందని, జేడీ(ఎస్‌)29 (ప్లస్‌/మైనస్‌ 5 స్థానాలు), ఇతరులు మూడు స్థానాలు సాధించవచ్చని ట్రాకర్‌పోల్‌లో తేలింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 113 స్థానాల మెజార్టీ సంఖ్యను ఏ పార్టీ సాధించలేకపోతోంది. 2018 ఎన్నికల తర్వాత రెండు పార్టీల కూటమి ప్రభుత్వం మరోసారి ఏర్పడే అవకాశాలున్నాయి. రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకంగా మారనున్నామని జేడీ(ఎస్‌) ఇప్పటికే చెబుతూ వస్తోంది. వాస్తవిక ఫలితాలు ట్రాకర్‌పోల్‌ సర్వే అంచనాల ప్రకారంగానే ఉంటే, అదే నిజమై జేడీ(ఎస్‌) కీలకం కానుంది.

ట్రాకర్‌పోల్‌ సర్వే గణాంకాల ప్రకారం కాంగ్రెస్‌ 2018 ఎన్నికలతో పోలిస్తే రెండు శాతం ఓట్లను పెంచుకొని 22 స్థానాలను అధికంగా సాధిస్తుందని తేలింది. 2018లో 38 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ ఈసారి 40 శాతం సాధిస్తుందని రహస్య బ్యాలెట్‌ ద్వారా నిర్వహించిన ట్రాకర్‌పోల్‌ సర్వేలో తేలింది. అదే సమయంలో బీజేపీకి, 2018 ఎన్నికలతో పోలిస్తే 0.2 శాతం ఓట్లు తగ్గే ఆస్కారం కనిపిస్తోంది. 2018లో 36.2 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు 36 శాతం ఓట్లు సాధిస్తుంది. ఈ స్వల్ప వ్యత్యాసంతో ఆ పార్టీ 13 స్థానాలు కోల్పోనుంది.

పీపుల్స్‌ పల్స్‌-సిస్రో రీసెర్చ్‌ సంస్థల సర్వే ప్రకారం, జేడీ(ఎస్‌) ఈ ఎన్నికల్లో కిందటి ఎన్నికల కన్నా తక్కువ ఓటు షేర్‌తో, తక్కువ సంఖ్యలో సీట్లు సాధిస్తూ కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనుంది. ఈ పార్టీ 16 శాతం ఓట్లు సాధించనుంది. 2018 ఎన్నికలతో పోలిస్తే 2.4 శాతం తక్కువ సాధించి 29 సీట్లు (కిందటిసారి వారి సంఖ్య 37) పొందుతుంది. జేడీ(ఎస్‌) దృష్ట్యా చూస్తే ఆ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగినా దాదాపు తన ఓటు బ్యాంకును నిలుపుకోవడం ఎంతో కీలకం. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలంటే తన ఓటు బ్యాంకును జెడీ(ఎస్)‌ నిలుపుకోవడంతోపాటు అధిక సీట్లను సాధించాలి.

కర్నాటక ఎన్నికల్లో కులాలతో పాటు మత అంశాలు కూడా  కీలకంగా మారనున్నాయని సౌత్‌ ఫస్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం పీపుల్స్‌ పల్స్‌ సిస్రో రీసెర్చ్‌ సంస్థలు నిర్వహించిన ట్రాకర్‌పోల్‌ సర్వేలో తేలింది. ఓబీసీలు, మాదిగలు, హోలియాలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిస్తున్నారు. మరోవైపు అగ్రకులాలు, వొక్కలింగాలు, లింగాయత్‌లు బీజేపీ వెంట ఉన్నట్లు ట్రాకర్‌పోల్‌ సర్వేలో తేలింది. జేడీ(ఎస్‌) ప్రధాన ఓటు బ్యాంకు అయిన వొక్కలింగాలలో 50 శాతం మంది ఈ పార్టీకి మద్దతుగా ఉన్నారు. అహిందా కూటమి, వొక్కలింగాయతేతరులైన ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడంతో ఆ పార్టీ కొంతమేర ఆధిపత్యం పొందుతుందని ట్రాకర్‌పోల్‌లో తేలింది. 

2013-2018 మధ్య కాంగ్రెస్‌ పార్టీ కర్నాటకలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కాలంలో, ఆయా వర్గాల సంక్షేమ పథకాల ప్యాకేజీలను అందజేయడం, సమర్థంగా అమలుపరచడంతో కాంగ్రెస్‌కు పార్టీకి వీరి నుండి ఎక్కువ మద్దతు లభిస్తోంది. పీపుల్స్‌ పల్స్‌- సిస్రో  రీసెర్చ్‌ సంస్థలు  నిర్వహించిన ట్రాకర్‌పోల్‌ సర్వేలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు సిద్దరామయ్యకు 28 శాతం మద్దతిచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మైకు 19 శాతం, కుమారస్వామికి 18 శాతం మంది నుంచి మద్దతు లభించింది. 

హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే ఏయే పార్టీలు కూటమిగా ఏర్పడాలన్న నిర్దిష్ట ప్రశ్నకు కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) కూటమి ప్రభుత్వం ఏర్పడాలని 41 శాతం బీజేపీ, జేడీ(ఎస్‌) కూటమి ప్రభుత్వం ఏర్పడాలని 38 శాతం మంది అభిప్రాయపడ్డారు. అవినీతి, ఉద్యోగ నియామకాలలో కుంభకోణాలు, నిరుద్యోగం, పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం అంశాలు బీజేపీకి అడ్డంకులుగా ఉన్నాయని ఈ ట్రాకర్‌ పోల్‌ సర్వేలో తేలింది. రైతులలో 40 శాతం, నిరుద్యోగులలో 41 శాతం కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్‌కు 8 శాతం ఆధిపత్యం లభిస్తుండగా, బీజేపీకి పట్టణ ప్రాంత్రాల్లో కేవలం ఒక శాతం మాత్రమే ఆధిక్యం కనిపిస్తున్నది. 

కర్నాటక అభివృద్ధికి ఏ పార్టీ పాలన మెరుగైనదని ప్రశ్నించినపుడు.. 38 శాతం కాంగ్రెస్‌, 36 శాతం బీజేపీ, 18 శాతం జేడీ(ఎస్‌)కి అనుకూలంగా ఓటర్లు స్పందించారు. రాబోయే ఎన్నికల్లో కర్నాటకలో ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందని అడిగినపుడు.. 38 శాతం మంది కాంగ్రెస్‌ అని, 37 శాతం మంది బీజేపీ అని తెలిపారు. బీజేపీకి మరో మారు అవకాశమిస్తారా అని ప్రశ్నించగా 51 శాతం మంది లేదని, 41 శాతం అనుకూలమని తెలిపారు.

సౌత్‌ ఫస్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం పీపుల్స్‌ పల్స్‌-సిస్రో రీసెర్చ్‌ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలిన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే, హోరాహోరీ పోరులో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత కనబడుతోంది. కర్నాటకలో ఇప్పటికే పలు రాజకీయ పరిణామాలతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.

సర్వే చేపట్టిన విధానం..

‘సౌత్‌ ఫస్ట్‌’న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం పీపుల్స్‌ పల్స్‌-సిస్రో రీసెర్చ్‌ సంస్థలు ఈ సర్వేను 56 అసెంబ్లీ స్థానాల్లో 224 పోలింగ్‌ బూత్‌లను ఎంపిక చేసుకొని మొత్తం 4584 శాంపిల్స్‌ (ఓటర్ల) నుండి సమాచారం సేకరించాము. జనాభా దామాషాను పరిగణనలోకి తీసుకొని, సామాజిక వర్గాల ఆధారంగా ర్యాం​డమ్‌ పద్దతిలో ఎంపిక ద్వారా ఈ శాస్త్రీయ సర్వే జరిగింది. డిసెంబర్‌ 22  నుండి 31 వరకు ఈ ట్రాకర్‌పోల్‌ సర్వే ప్రక్రియ సాగింది. మార్చి 2023లో ఒకసారి, ఎన్నికల ముందు మరోమారు సర్వేను నిర్వహించనున్నాము. ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌ నుండి 35 మంది ఓటర్ల నుండి సమాచారం సేకరించాము. ఈ సర్వేలో సీఏపీఐ (కంప్యూటర్‌ అసిస్టెడ్‌ ఇంటర్‌పర్సనల్‌ ఇంటర్వీయింగ్‌) పద్దతిన డేటా సేకరణ జరిపి, ఓటర్లను ముఖాముఖి కలుసుకుని, ఈ సర్వేలో అవసరమైన ప్రశ్నలు వేస్తూ డమ్మీ ఈవీఎమ్‌ ద్వారా రహస్య ఓటింగ్‌ నిర్వహించారు. ఈ సర్వే ఫలితాల్లో 1-2 (+/-) వ్యత్యాసాలకు ఆస్కారం ఉంది. (క్లిక్‌ చేయండి: రాజకీయాలకు ఎస్‌ఎం కృష్ణ గుడ్‌బై)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Karnataka Assembly Election 2023
Karnataka Assembly Elections
2023
Survey Report
Congress Party
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

ఇండియా కూటమిలో చేరనున్న డీఎంకే..?

ఇండియా కూటమిలో చేరనున్న డీఎంకే..?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.