Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. పొత్తులో కొత్త ‘డ్రామా’.. పవన్‌ మరో నాటకం 
ADVERTISEMENT 

పొత్తులో కొత్త ‘డ్రామా’.. పవన్‌ మరో నాటకం 

Politics Sakshi User Sakshi Sakshi Time Feb 5, 2024 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Pawan.jpg

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: జనసేన –టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీనే పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటన చేయడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో.. రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేనే పోటీ చేస్తుందని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించడం అంతకన్నా హాస్యాస్పదమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

2019 ఎన్నికల్లో పవన్‌ స్వయంగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినప్పటికీ, ఒక్క రాజోలులోనే జనసేన గెలిచింది. అలాంటి రాజోలు స్థానంలో జనసేన పోటీ చేయడం ఏమైనా విచిత్రమా? రాజానగరం నియోజకవర్గాన్ని టీడీపీ ఇప్పటికే జనసేనకు వదిలేసింది. పవన్‌ పోటీ చేస్తున్నట్లు చెప్పింది కూడా ఈ రెండు నియోజకవర్గాలే. ఇక్కడే డ్రామా మొత్తం బయటపడిపోయిందని పరిశీలకులు చెబుతున్నారు. మండపేట, అరకు నియోజకవర్గాలకు  చంద్రబాబు ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడానికి కౌంటర్‌గా, గుణపాఠం చెబుతున్నట్లుగా పవన్‌ ఈ ప్రకటన చేయలేదన్నది సుస్పష్టమని అంటున్నారు. కేవలం పార్టీ నేతలు, అభిమానుల ముందు బిల్డప్‌ ఇవ్వడానికే పవన్‌ రెండు నియోజకవర్గాలపై ఈ హాస్యాస్పద ప్రకటన చేశారని, దీని వెనుకా చంద్రబాబే ఉన్నారని రాజకీయ పరిశీలకులు, జనసేన నేతలు కూడా చెబుతున్నారు.  

టీడీపీ – జనసేనల మధ్య పొత్తు ఖరారై నాలుగు నెలలు దాటింగి. ఇప్పుటికీ రెండు పార్టీల మధ్య సీట్ల గొడవ సాగుతూనే ఉంది. సీట్ల కేటాయింపుపై బాబు–పవన్‌ ఉమ్మడిగా ప్రకటన చేయాలని ఇప్పటికి రెండుసార్లు నిర్ణయించి, విఫలమయ్యారు. ఇంకో పక్క మా సీటు మీరెలా అడుగుతారంటూ నియోజకవర్గాల్లో టీడీపీ –జనసేన నాయకులు గొడవలు పడుతున్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ తేలకపోయినప్పటకీ  మండపేట, అరకు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తున్నట్టు ఆ రెండు చోట్లా సభలు పెట్టి మరీ చెప్పారు. అభ్యర్థులను కూడా ఆ సభల్లోనే ప్రకటించారు.

బాబు తీరుపై జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ముఖ్యంగా మండపేట నేతలు పవన్‌ను కలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జనసేన శ్రేణుల్లో అసంతృప్తిని చల్లార్చడానికి చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్‌ శుక్రవారం నాటి ప్రకటన చేశారని చర్చ సాగుతోంది. సీట్ల కేటాయింపులో జరుగుతున్న ఆలస్యం, టీడీపీ ఏకపక్ష వైఖరి కారణంగా క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య పెద్దస్థాయిలో నెలకొన్న విభేదాలను తగ్గించి, అన్ని చో­ట్లా ఎలాంటి ఇబ్బంది లేకుండా జనసేన ఓట్లు టీడీపీకి బదలాయించడం కోసమే బాబు, పవన్‌ వ్యూహా­త్మకంగా ఈ నాటకాన్ని మొదలుపెట్టి ఉండవచ్చని పరిశీలకులు అంటున్నారు. దీనికి ‘టిట్‌ ఫర్‌ టాట్‌’గా కలరింగ్‌ ఇవ్వడం ఆ ఇద్దరికే 

చెల్లిందంటున్నారు. 

పొత్తులకు ఎన్నెన్ని ఎత్తులో.. 

నమ్మించి నట్టేట ముంచడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబును పవన్‌ విశ్వసిస్తున్నారని జనసేన నేతలూ నమ్మడంలేదు. పొత్తుల కోసం మొదటి నుంచి వెంపర్లాడుతూ మరోవైపు అలాంటిదేమీ లేదన్నట్లు బాబు, పవన్‌ చెబుతూ వచ్చారు. ఈ డ్రామాను ఇరు పారీ్టల వారితో పాటు రాష్ట్ర ప్రజలూ ఏ దశలోనూ విశ్వసించలేదు. ఈ దశలోనే స్కిల్‌ స్కాంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబుతో ములాఖత్‌ మాటున పవన్‌ పొత్తు ప్రకటనా నాటకమన్న విషయం అప్పట్లోనే తేటతెల్లమైంది.

బాబు అరెస్టుతో టీడీపీ పనైపోయిందని, పొత్తు ఉంటే జనసేనకు టీడీపీ అత్యధిక సంఖ్యలో సీట్లను కేటాయించే అవకాశం ఉందని నమ్మి ఆ పార్టీ నాయకులు కూడా కలిసిపోయేందుకు రెడీ అయ్యారు. జనసేన 68 సీట్లను టీడీపీ ముందు ప్రతిపాదించి, కనీసం 45 స్థానాల్లో పోటీ చేయాలని ఆశపడుతోంది. అందులో సగం సీట్లు కూడా జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా లేదని చర్చ సాగుతోంది. క్రమంగా టీడీపీ ముసుగు తొలగి, మోసపూరిత వైఖరి బయట పడుతుండటంతో జనసేన నాయకుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

వారంతా చంద్రబాబు, టీడీపీ మోసపూరిత వైఖరి గురించి మాట్లాడుతుంటే.. జనసేన అధినేత పవన్‌ మాత్రం సర్దుకుపోవాలన్న మాటలే వినిపిస్తున్నారు. పొత్తులో ఎలాంటి పరిస్థితులు ఉన్నా జనసేన సర్దుకపోవాల్సిందేనని, భరించాల్సిందేనని సొంత పార్టీ నేతలకు పదేపదే చెబుతున్నారు. శుక్రవారంనాటి సమావేశంలోనూ.. ముందుగా రెండు నియోజకవర్గాలపై ఓ బిల్డప్‌ ప్రకటన చేసి, చివరికి వచ్చేసరికి సర్దుకుపోవాల్సిందేనన్న టీడీపీ సందేశాన్నే ఇచ్చారు. సీట్ల కేటాయింపు తేలక మునుపే చంద్రబాబు మండపేట, అరకు అభ్యర్ధులను ప్రకటించడంపై సొంత పార్టీ నేతలకు క్షమాపణలు చెబుతూనే.. వాళ్ల పార్టీలో ఉన్న పరిస్థితిని మనమే అర్ధం చేసుకోవాలంటూ చంద్రబాబుకు వంతపాడారు. 

సీఎం పదవి లేదన్నలోకేశ్‌కూ జీ హుజూరే! 

టీడీపీ –జనసేన పొత్తు ఉన్నప్పటికీ, సీఎం పదవిలో పవన్‌ కళ్యాణ్‌కు వాటా లేదంటూ గతంలో లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలకు సైతం తాజాగా జనసేన అధినేత జీహుజూర్‌ అనేశారు. నెల  కిత్రం లోకేశ్‌ ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘చాలా స్పష్టంగా చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి. దేర్‌ ఈజ్‌ నో సెకండ్‌ థాట్‌ (రెండో మాటే లేదు)’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో జనసేన పారీ్టలో పెద్ద దుమారమే రేగింది. ఇన్నాళ్లూ దానిపై ఒక్కసారి కూడా మాట్లాడని పవన్‌.. శుక్రవారం పార్టీ నేతల సమావేశంలో స్పందించారు. పెద్ద మనస్సుతో ఆ వ్యాఖ్యలను తానే పట్టించుకోకుండా వదిలేశానని వివరించారు. 2024లో జగన్‌ ప్రభుత్వం రాకుండా ఉండేందుకు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటన్నింటికీ నన్ను చాలా సార్లు రెస్పాండ్‌ కానీయకుండా చేస్తోందంటూ వంకలు చెప్పారు.  



ఎమ్మెల్యే సీట్లను పక్కనపెట్టి.. వార్డు పదవుల వాటా చర్చ 

రెండు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ టీడీపీ కేటాయిస్తుంది, సీఎం పదవిలో వాటా ఉంటుందా అని జనసేన నేతలు ఉత్కంఠతో ఉంటే.. పవన్‌ మాత్రం వీటి ఊసెత్తకుండా ఎప్పుడో రెండు మూడేళ్ల తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకిన్ని సీట్లు వస్తాయంటూ పార్టీ నేతలను పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సీట్లెన్ని వస్తాయో చెప్పకుండా.. ఈ ఎన్నికల తర్వాత కామన్‌ పొలిటికల్‌ ప్రోగ్రాం పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలు మొదలు కార్పోరేషన్‌ వరకు జనసేన ఖచి్చతంగా మూడో వంతు సీట్లను తీసుకుంటుందంటూ పార్టీ నేతలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.  

కేవలం ఎమ్మెల్యే సీట్ల దగ్గర తాను ఆగిపోవడం లేదంటూ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, చంద్రబాబు ఏమిటో తెలిసిన జనసేన నేతలు పవన్‌ మాటలను నమ్మడంలేదు. ఇదంతా అసెంబ్లీ సీట్ల కేటాయింపుల వ్యవహారం నుంచి జనసేన నేతలు, అభిమానులను పక్కదారి పట్టించే ప్రయత్నమేనని, చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్‌ ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. చివరివరకు ఇలా సాగదీసి, ఎన్నికల ముంగిట్లో ఓ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేనకు విదిలిస్తారన్నది సుస్పష్టమని చెబుతున్నారు. కేవలం జనసేన ఓట్లు టీడీపీకి పడటానికే చంద్రబాబు ఇలా జనసేన నేతలు, అభిమానులకు పవన్‌తో చెప్పిస్తున్నారని విశ్లేíÙస్తున్నారు.   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Pawan Kalyan
Chandrababu Naidu
TDP-Jana Sena alliance
AP Politics
AP Elections 2024
AP Assembly Elections 2024
AP 175
Kuppam Assembly Constituency
Chittoor Assembly Constituencies
East Godavari Assembly Constituencies
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు

ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు

తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన

తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.