Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. Manipur: ప్రధాని కాదు.. ఆయనే మాట్లాడతారట!
ADVERTISEMENT 

Manipur: ప్రధాని కాదు.. ఆయనే మాట్లాడతారట!

Politics Sakshi User Sakshi Sakshi Time Jul 25, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Centre-Plans-For-Handle-Manipur-Chaos.jpg

న్యూఢిల్లీ: మణిపూర్‌ అంశం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది. చర్చకు సిద్ధమని ప్రకటించినా.. విపక్షాలు లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నాయని కేంద్రం అంటోంది. గురివింద గింజ సామెతలాగా.. తమ రాష్ట్రాల్లో నేరాలను ఆయా ప్రభుత్వాలు అదుపు చేయలేకపోతున్నాయని విపక్షాలపై మండిపడుతోంది. ఈ క్రమంలో మంగళవారం సమావేశాలైనా సజావుగా జరుగుతాయా? అనే సందిగ్ధం నెలకొనగా.. అనూహ్యంగా క్విడ్‌ ప్రోకో(రెండు వైపులా లాభం) తెర మీదకు వచ్చింది.

‘‘మణిపూర్‌ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీనే పార్లమెంట్‌లో మాట్లాడాలి. ఇది తేలనిదే పార్లమెంట్‌ సమావేశాలను ముందుకు సాగనివ్వం’’ విపక్ష ఇండియా కూటమి చేస్తున్న ప్రధాన డిమాండ్‌ ఇది. ఈ డిమాండ్‌తోనే గత రాత్రి సైతం పార్లమెంట్‌ బయట తమ నిరసన గళం వినిపించాయవి.  అయితే కేంద్రం మాత్రం అందుకు సన్నద్ధంగా లేదు. పైగా ఈ సమావేశాల్లో 31 బిల్లులకు ఈ సమావేశాల్లో ఆమోదం తెలపాల్సిన అవసరం ఉండగా.. అందునా వివాదాస్పదమైన ఢిల్లీ ప్రత్యేక ఆర్డినెన్స్‌ కూడా ఉంది. దీంతో మణిపూర్‌ గండం దాటుకోవడం ఎలాగ? అనే విషయంలో కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది.

శాంతి భద్రతల అంశం కాబట్టి  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షానే మణిపూర్‌ అల్లర్లు.. హింసపై ప్రసంగం చేస్తారని.. అనుమానాలను నివృత్తి చేస్తారని చెబుతోంది. ఈ క్రమంలోనే క్విడ్‌ ప్రోకో ఆలోచనతో ముందుకు వచ్చింది. మణిపూర్‌ అంశంపై స్వల్ప కాలిక చర్చతో సరిపెడతామని.. ప్రతివిమర్శలు చేయబోమని విపక్షాలకు కేంద్రం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర వర్గాల సమాచారం ప్రకారం..  సమావేశాలకు సజావుగా సాగనిచ్చేందుకు, సామరస్యంగా మణిపూర్‌ చర్చ అంశాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రతిపక్ష నేతలతో ఫోన్‌లలో మాట్లాడారు. సభను సజావుగా సాగనిచ్చేందుకు సహకరించాలని కోరారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా సరే హోం మంత్రి నివృత్తి చేస్తారని.. చర్చించేందుకు అనుమతించాలని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని మోదీతో కొందరు కేంద్ర మంత్రులు.. హోం మంత్రి అమిత్‌ షా,  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి  లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో భేటీలు జరిపారు. 

దేశంలో ఏ రాష్ట్రం ఇంతకు ముందెప్పుడూ ఇంత సుదీర్ఘకాలం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొలేదని మణిపూర్‌ సంక్షోభంపై ఇండియా కూటమిని లీడ్‌ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ వాదిస్తోంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం మరోలా ప్రకటన చేసింది. ‘‘1993-97 మధ్యకాలంలో మణిపూర్‌ ఇంతకన్నా భయంకరమైన పరిస్థితులను చవిచూసింది. ఆ సమయంలో ఏ ప్రధాని ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదు. అలాగే పార్లమెంట్‌లో ఒక్కసారిగా కూడా చర్చించలేదు’’ అని కేంద్ర హోం శాఖ ఒక ప్రకటన రిలీజ్‌ చేసింది. 

మణిపూర్‌పై పరిమిత చర్చ మాత్రమే జరిపి.. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నేరాలపై ఎలాంటి ప్రస్తావన చేయొద్దని కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది. తద్వారా బిల్లుల ఆమోద ప్రయత్నాలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ప్రతిపక్షాలు కేంద్రం ప్రతిపాదనకు ఎలా స్పందించాయనేది తెలియాల్సి ఉంది. ప్రత్యేకించి ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లు విషయంలో సహకరిస్తాయా? అనేది అనుమానమే!. 

ఇదీ చదవండి: రూల్ నెంబర్ 267 వర్సెస్‌ 176 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
manipur violence
Parliament mansoon session
Amit Shah
Manipur
opposition parties
ordinance bills
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

తెలంగాణలో ఒంటరి పోరే

తెలంగాణలో ఒంటరి పోరే

రాజీనామా రచ్చ అంతా ఉత్తదేనా?

రాజీనామా రచ్చ అంతా ఉత్తదేనా?

బీజేపీతోనే మహిళలకు న్యాయం 

బీజేపీతోనే మహిళలకు న్యాయం 

ప్రతిపక్ష నేతకు అవకాశమివ్వలేదు

ప్రతిపక్ష నేతకు అవకాశమివ్వలేదు

మావోయిస్టులపై అమిత్‌షా కీలక ప్రకటన

మావోయిస్టులపై అమిత్‌షా కీలక ప్రకటన

తొలిసారిగా డిజిటల్‌ జనగణన

తొలిసారిగా డిజిటల్‌ జనగణన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.