Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. గుడివాడలో హై అలెర్ట్
ADVERTISEMENT 

గుడివాడలో హై అలెర్ట్

Politics Sakshi User Sakshi Sakshi Time Feb 2, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Chandrababu-Cunning-Politics-Gudivada.jpg

ఎన్టీఆర్‌ మృతికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా రెండు విధాలుగా కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశంలో ఎవరిని అడిగినా చెబుతారు. అలాంటి మనిషి.. ఎన్టీఆర్‌ వర్ధంతి రోజున దొంగ నాటకానికి దిగారనీ గుడివాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్‌ సిసలైన రాజకీయ వారసులతో పోటీ పడుతూ.. దుష్ట రాజకీయం ప్రదర్శిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల్ని ఎన్టీఆర్‌ సొంత జిల్లా వాసులు భరించలేకపోతున్నారు. 

ఆంధ్రుల అభిమాన నటుడు.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్థంతి నేడు. ఆనవాయితీ ప్రకారం ఎన్టీఆర్‌ శిష్యుడు.. స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతి ఏటా వర్ధంతి వేడుకల్ని నిర్వహిస్తున్నారు.  ప్రతీ యేడులాగే.. నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు  చేసుకున్నారు. అయితే.. దేనిని వదలకుండా తన పొలిటికల్‌ మైలేజ్‌ కోసం వాడుకోవాలని గోతికాడ నక్కలాగా చూసే చంద్రబాబు కూడా ఎన్టీఆర్‌ వర్థంతి వేడుకల నిర్వహణకు సిద్ధమయ్యారనీ వైయస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు.  

అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ ప్రచార కార్యక్రమం.. రా కదలి రా గురువారం గుడివాడలో నిర్వహిస్తున్నారు. దీనిని ఎన్టీఆర్‌ వర్ధంతి నిర్వహణకు వేదికగా మార్చబోతున్నారు చంద్రబాబు. అది పక్కా ఎన్నికల ప్రచార సభ. కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకే టీడీపీ మొదలుపెట్టింది. అలాంటి సభను ఎన్టీఆర్‌ వర్ధంతి సభగా మార్చేందుకు శతవిధాల బాబు ప్రయత్నిస్తుండడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

ఎన్టీఆర్‌ జిల్లావాసుల ఆవేదన

ఎన్టీఆర్‌ మృతికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా రెండు విధాలుగా కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అలాంటి మనిషి.. ఎన్టీఆర్‌ వర్ధంతి రోజున దొంగ నాటకానికి దిగారు. బాబు తొలి నుంచే నందమూరి కుటుంబాన్ని అణగదొక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ సిసలైన రాజకీయ వారసులతో పోటీ పడుతూ.. దుష్ట రాజకీయం ప్రదర్శిస్తున్నారు. దీనిని ఎన్టీఆర్‌ సొంత జిల్లా వాసులు భరించలేకపోతున్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని.. తనను వెన్నుపోటు పొడిచాడని మానసిక క్షోభతో ఎన్టీఆర్‌ చెప్పిన మాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. అలాంటిది.. ఇవాళ అదే చంద్రబాబు ఎన్టీఆర్‌ ఫొటోకు దండ వేసి నివాళులు ఇస్తుండడంపై గుడివాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు.  

హీటెక్కిన గుడివాడ రాజకీయం

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎప్పటిలాగే ఎన్టీఆర్‌ వర్థంతి వేడుకలు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా సభ. గుడివాడ సెంటర్‌లో ఇద్దరు నేతల పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇరువర్గాల కార్యకర్తలూ భారీ సంఖ్యలో పోగయ్యారు. అంతే..  దెబ్బకు అక్కడి రాజకీయం వేడెక్కింది. ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గుడివాడ మొత్తం పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. 

బాబు మాములోడు కాదుగా!

చంద్రబాబు దుష్ట ఆలోచనల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అందునా జనం గుమిగూడారంటే.. ఆయన క్రిమినల్‌ మైండ్‌ అక్కడ ఏదో ఒక నష్టం జరిగి తీరాలని కోరుకుంటుంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుంది. దాడులకు ఉసిగొల్పుతుంది కూడా. తొక్కిసలాటలు.. అల్లర్లు అందుకు బోలెడు ఉదాహరణలు. ఇందులో అంగళ్లు అలర్లు ఒకటి. కిందటి ఏడాది ఆగష్టు 4వ తేదీన అన్నమయ్య జిల్లా తంబళపల్లె అంగళ్లు కూడలిలో జరిగిన హింసాత్మక ఘటనలకు చంద్రబాబే కారణం. ‘తమాషాగా ఉందా.. ఆ నా కొడుకులను తరమండిరా.. వేసేయండిరా వాళ్లని’ అని వేలేత్తి చూపించి టీడీపీ శ్రేణులను ఉసిగొల్పారు. 

ఈ వ్యవహారంలో బాబుపై మర్డర్‌ అటెంప్ట్‌, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులోనూ ముందస్తు బెయిల్‌ మీదే చంద్రబాబు ఇప్పుడు బయట ఉన్నారు. మరి ఎన్నికల వేళ.. ఈ తరహా అల్లర్లకు ఉసిగొల్పరని గ్యారెంటీ ఏంటి? గుడివాడ ఉద్రిక్త వాతావరణాన్ని చూసి.. చంద్రబాబు తన నేర బుద్ధికి పని చెప్పకుండా ఉండగలరా?. అదీ ఎన్టీఆర్‌ వర్ధంతి నాడు సభ పెట్టి.. చంద్రబాబు రెచ్చగొట్టుడు ధోరణి ప్రదర్శించకుండా ఉంటారా? అనే చర్చ నడుస్తోంది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
AP Politics
Chandrababu Naidu
AP Assembly Elections 2024
gudivada
NTR Death Anniversary
TDP
High alert
AP Elections 2024
AP 175
Gudivada Assembly Constituency
Krishna Assembly Constituencies
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.