మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ మరోసారి నోరు జారి.. నవ్వుల పాలయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేశ్ గురువారం రాత్రి మంగళగిరి పరిధిలోని కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నిడమర్రులో ఆయన మాట్లాడుతూ.. రూ.300 పింఛన్‌ను రూ.400కు పెంచుతాననడంతో సభకు హాజరైనవారు అవాక్కయ్యారు. వెంటనే పక్కనే ఉన్న మరో నాయకుడు కలుగజేసుకొని.. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు అని చెప్పడంతో లోకేశ్ నాలుక కరుచుకున్నారు.
మరోసారి నోరుజారిన టీడీపీ నేత నారా లోకేశ్
ADVERTISEMENT
ADVERTISEMENT