Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. బండికి 100 కోట్లు ఎక్కడివి?
ADVERTISEMENT 

బండికి 100 కోట్లు ఎక్కడివి?

Politics Sakshi User Sakshi Sakshi Time Jul 4, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
B.J.P-TELANGANA--M.L.jpg

సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా బీజేపీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు..సోమవారం పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లక్ష్యంగా పదునైన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌ పత్రికల్లో రూ.100 కోట్ల విలువైన యాడ్‌లు ఇచ్చారని, అసలు భార్య పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు అన్ని డబ్బులు ఎక్కడివని నిలదీశారు. రెండు, మూడేళ్లయినా పార్టీలో పదవులను భర్తీ చేయడంలో రాష్ట్ర అధ్యక్షుడు విఫలమయ్యారని విమర్శించారు.



పార్టీ అధ్యక్షుడి మార్పు విషయమై వస్తున్న కథనాలు వాస్తవమేనని చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఏయే పదవులు ఖాళీగా ఉన్నాయో కూడా తెలియదని విమర్శించారు. పార్టీకి ఎల్పీ నేత లేరన్న విషయమూ నడ్డాకు తెలియదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని గెలిపిస్తానన్న అమిత్‌ షా గెలిపించలేకపోయారని ధ్వజమెత్తారు. దుబ్బాకలో తనను చూసి ఓట్లేశారు తప్పితే.. పార్టీ గుర్తును చూశో, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ను చూశో కాదని స్పష్టం చేశారు. తాను కోరిన పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వకుంటే తన దారి తనదేనని అల్టిమేటమ్‌ ఇచ్చారు.  



కిషన్‌రెడ్డిని కలిసిన కొద్ది సేపట్లోనే .. 

రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీలో మార్పుచేర్పులపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్‌ పెంచిన నేపథ్యంలో పార్టీ పెద్దలతో భేటీ అయ్యేందుకు రఘునందన్‌రావు ఆదివారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. 3 గంటల సమయంలో కిషన్‌రెడ్డి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ ఆయన పక్కనే కూర్చున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికి అక్కడే ఉన్న మీడియాతో ఆయన చిట్‌చాట్‌ చేశారు.



అధ్యక్షుడి మార్పు విషయంలో వస్తున్న కథనాలన్నీ వాస్తవమేనని, సంజయ్‌ను మార్చేందుకే అధిస్టానం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ విషయంలో సంజయ్‌ది స్వయంకృతాపరాధం అన్నారు. ‘పార్టీల ఇన్‌చార్జిలు తరుణ్‌ఛుగ్, సునీల్‌ బన్సల్‌ల ఫొటోలు పెట్టి రూ.100 కోట్లతో పత్రికల్లో యాడ్‌లు వేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న నా ఫోటోనో, ఈటల రాజేందర్‌ ఫొటోనో వేయలేదు. తరుణ్‌ఛుగ్‌నో, బన్సల్‌ను చూసి ప్రజలు ఓట్లేయరు కదా..’అని రఘునందన్‌ ప్రశ్నించారు.  



జాతీయ అధ్యక్షుడికే తెలియదంటే ఎలా..? 

పార్టీ శాసనభా పక్షనేత పదవి రెండేళ్లుగా ఖాళీగా ఉన్నా దానిపై బండి సంజయ్‌ నిర్ణయం తీసుకోలేక పోయారని, ఈ విషయమై నడ్డాను అడిగితే.. ’అవునా..నిజమా’అంటూ తననే ప్రశ్నించారని రఘునందన్‌ తెలిపారు. ‘పదవుల నియామకంపై పార్టీ జాతీయ అధ్యక్షుడికే తెలియకుంటే ఎలా? అట్లుంది పార్టీ పరిస్థితి..’అంటూ వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ ఫ్లోర్‌లీడర్‌ విషయంలోనూ నాన్చుడు ధోరణినే అవలంబించారని, చివరకు ఫ్లోర్‌ లీడర్‌ పదవి అడిగిన కార్పొరేటర్‌ చనిపోయినా, ఇంతవరకు దానిపై నిర్ణయమే లేదని విమర్శించారు.  



పదేళ్లుగా కష్టపడుతున్నా.. 

పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడుతున్నానని రఘునందన్‌ అన్నారు. మధ్యలో వచ్చిన నేతలు పదవులకు పనికొస్తారు కానీ నేను పనికిరానా? అని ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను సైతం అర్హుడనేనని అన్నారు. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి, జాతీయ అధికార ప్రతినిధి పదవి, శాసనసభాపక్ష నేత పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే తన దారి తనదేనంటూ వ్యాఖ్యానించారు. కీలక పదవులకు తనకు కులమే శాపంగా పరిణమించిందని ఆవేదన చెందారు. సేవలకు ప్రతిఫలం దక్కకుంటే నడ్డాపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు.

రూ.100 కోట్లు ఖర్చు చేసినా గెలవలేక పోయారు.. 

దుబ్బాక ఉప ఎన్నికల్లో తాను పూర్తిగా సొంత బలంతోనే గెలిచానని రఘునందన్‌ చెప్పారు. ‘దుబ్బాకలో నేను స్వయంశక్తితో గెలిచా. నాకు ఎవరూ సహాయం చేయలేదు. ఇక్కడ పార్టీ గుర్తు చివరి అంశమే. మళ్లీ నా సొంత బలంతోనే దుబ్బాకలో గెలుస్తా’అని స్పష్టం చేశారు. తన గెలుపు తర్వాతే ఈటల పార్టీలోకి వచ్చారని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి భుజంపై చేయి వేసి మరీ నేను గెలిపిస్తానని అమిత్‌షా ప్రకటించారని, కానీ గెలిపించలేకపోయారని విమర్శించారు. రూ.100 కోట్లు ఖర్చు చేసినా గెలవలేకపోయారని అన్నారు.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
raghunandan rao
bandi sanjay kumar
JP Nadda
Amit Shah
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

తెలంగాణలో ఒంటరి పోరే

తెలంగాణలో ఒంటరి పోరే

రాజీనామా రచ్చ అంతా ఉత్తదేనా?

రాజీనామా రచ్చ అంతా ఉత్తదేనా?

బీజేపీతోనే మహిళలకు న్యాయం 

బీజేపీతోనే మహిళలకు న్యాయం 

ప్రతిపక్ష నేతకు అవకాశమివ్వలేదు

ప్రతిపక్ష నేతకు అవకాశమివ్వలేదు

మావోయిస్టులపై అమిత్‌షా కీలక ప్రకటన

మావోయిస్టులపై అమిత్‌షా కీలక ప్రకటన

తొలిసారిగా డిజిటల్‌ జనగణన

తొలిసారిగా డిజిటల్‌ జనగణన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.