Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. స్టీల్‌ ప్లాంట్‌ ఘటన.. నారా లోకేశ్‌ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
ADVERTISEMENT 

స్టీల్‌ ప్లాంట్‌ ఘటన.. నారా లోకేశ్‌ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

Politics Sakshi User Sakshi Sakshi Time Jun 9, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Lokesh-Vizag-Steel-Plant.jpg

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద మంత్రి నారా లోకేశ్‌ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికుల ఆగ్రహం, నిరసనల మధ్య ఆయన వ్యవహరించిన తీరు కాస్త అక్కడి వాతావరణాన్ని వేడెక్కించింది.  హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి స్టీల్‌ప్లాంట్‌ వద్దకు చేరుకున్న లోకేశ్‌కు.. కార్మికుల మృతి, నిర్వహణ లోపంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఆయన సహనం కోల్పోయి.. కార్మిక సంఘాల నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ప్లాంట్‌లో జరిగిన ప్రమాదాలు, కార్మికుల భద్రత అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు.. మంత్రి లోకేశ్‌ ఎదుటే నిరసనకు దిగాయి. నైపుణ్యం లేని కాంట్రాక్ట్‌ కార్మికులను ఎలా అనుమతించారన్న ప్రశ్నతో మంత్రిని నిలదీశాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో ఎంపీ భరత్‌, హోం మంత్రి అనితలు పరిస్థితిని చల్లార్చేందుకు ప్రయత్నించినా, కార్మికుల ఆగ్రహం తగ్గలేదు.

ఈ క్రమంలో కార్మికుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయిన లోకేశ్‌, “స్టీల్‌ప్లాంట్‌ను మేమే కాపాడాము” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందించాయి. “అందుకే ఇంతమంది చనిపోయారా?” అంటూ వారు తిరిగి ప్రశ్నించారు.


పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో, కార్మికుల ఆవేదనను అర్థం చేసుకోకుండా మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఎందుకు గొడవ పడుతున్నారు.. రాజకీయం చేయడానికి వచ్చారా?” అంటూ లోకేశ్‌ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కార్మిక సంఘాలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో మరోసారి కలుగజేసుకున్న లోకేశ్‌.. “మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదు కదా?” అంటూ వ్యాఖ్యానించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారాయి. 

పరామర్శకు వచ్చి అవహేళనగా మాట్లాడారని.. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని లోకేశ్‌ను ఉద్దేశించి కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనూ ఆయన ‘‘మరి మమ్మల్నెందుకు నిలదీశారు?’’ అంటూ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. మొత్తానికి, పరామర్శగా మొదలైన నారా లోకేశ్‌ స్టీల్‌ప్లాంట్‌ పర్యటన కార్మికుల ఆగ్రహం, ప్రశ్నలు, ఎదురుదాడులతో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.

నియంతలా లోకేశ్‌ తీరు
స్టీల్‌ ప్లాంట్‌ వద్ద పరామర్శ పేరుతో నారా లోకేశ్‌ చేసిన ఓవరాక్షన్‌పై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పందించారు. ‘‘కార్మికుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. అందుకే ఈ ఘోరం జరిగింది. పైగా కార్మిక సంఘాలను, కార్మికులను ఇప్పుడు నారా లోకేశ్‌ అవమానించారు. నియంతలా వ్యవహరిస్తూ.. ఎవరికీ సమాధానం చెప్పను అన్నట్లు ఉంది ఆయన తీరు. కార్మికులను బెదిరించే విధంగా లోకేశ్‌ మాట్లాడారు. కార్మిక సంఘాలకు, కార్మికులకు ఆయన క్షమాపణలు చెప్పాలి. బాధిత కుటుంబాలకు రూ కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కేజీహెచ్‌ దగ్గరా.. 
కేజీహెచ్‌ వద్ద పరామర్శకు వెళ్లిన మంత్రి లోకేశ్‌కు.. అక్కడా చేదు అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులను పరామర్శించబోయే సమయంలో వామపక్ష నేతలు అడ్డుకున్నారు. పరిహారం విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ సమయంలోనూ లోకేశ్‌ తీవ్ర అసహనానికి లోనయ్యారు. డబ్బులిచ్చి చేతులు దులుపుకునేందుకు రాలేదు అనడంతో.. వామపక్ష నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Andhra Pradesh
Nara Lokesh Babu
AP Politics
trade unions
Vizag Steel plant
Accident
Visakhapatnam
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.