కేటీఆర్ సిట్ విచారణ.. లైవ్ అప్డేట్స్
కేటీఆర్ విచారణపై సీపీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా సజ్జనార్.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ నెం. 243/2024 కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగింపులో భాగంగా, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు అనుగుణంగా మాజీ మంత్రి కేటీఆర్‌కు 23 జనవరి 2026న ఒక నోటీసు జారీ చేయబడింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉదయం 11:00 గంటలకు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ఆ నోటీసులో ఆదేశించబడింది.
నోటీసుకు అనుగుణంగా కేటీఆర్.. సిట్ దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారు. ఆయనను వివరంగా విచారించడం జరిగింది. కేసులోని సంబంధిత అంశాలను రాబట్టడం జరిగింది. వాటిని రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలతో విశ్లేషిస్తున్నారు. ఆయన ఏ సాక్షులను సంప్రదించవద్దని లేదా ప్రభావితం చేయవద్దని ఆదేశించబడింది. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పాం.
రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థ, ప్రముఖులతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన వేలాది మంది పౌరులపై విస్తృతంగా అనధికారిక, చట్టవిరుద్ధమైన ఫోన్ నిఘా, ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించిన క్రైమ్ నెం. 243/2024 కేసు విషయంలో మాత్రమే కేటీఆర్‌ను ఈరోజు విచారించడం జరిగింది.
భద్రతా కారణాల దృష్ట్యా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఇందులో ఎలాంటి చట్టవిరుద్ధం లేదని పేర్కొంటూ, కొన్ని మీడియా వర్గాలు, వ్యక్తులు తప్పుదోవ పట్టించే నిరాధారమైన సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు గమనించబడింది. దర్యాప్తు సంస్థ ఇటువంటి తప్పుడు కథనాలతో సంబంధం కలిగి లేదు. దర్యాప్తు చట్టానికి అనుగుణంగా, నిష్పక్షపాతంగా వృత్తిపరంగా నిర్వహించబడుతోంది.
In continuation of the further investigation in Crime No. 243 of 2024 of Panjagutta Police Station, and pursuant to the constitution of a Special Investigation Team (SIT), a notice was issued to Sri K. T. Rama Rao, former Minister and MLA, Sircilla, on 23 January 2026, directing… pic.twitter.com/R5QPjfxrDZ
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 23, 2026
కాసేపట్లో తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్‌మీట్
తెలంగాణ భవన్‌కు బయల్దేరిన కేటీఆర్
ముగిసిన విచారణ
-
కాసేపట్లో బయటకు రానున్న కేటీఆర్.
-
కేటీఆర్‌ను దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించిన సిట్..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నేడు కేటీఆర్ విచారణ
సీరియల్లా సిట్ విచారణ : బండి సంజయ్
-
సిట్ విచారణ సీరియల్లా ఉంది
-
ప్రభుత్వ పెద్దల డైరైక్షన్లోనే సిట్ విచారణ
-
సిట్ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం లేదు
-
కేటీఆర్‌ను ఎందుకు విచారణకు పిలిచారు
కొనసాగుతున్న సిట్ విచారణ
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ
-
జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్ సభ్యులు
-
కేటీఆర్‌తో పాటు మాజీ డీసీపీ రాధా కిషన్ రావులను కలిపి ప్రశ్నిస్తున్న సిట్ సభ్యులు
ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు
-
దేశ భద్రత కోసం అత్యంత గొప్యంగా జరపాల్సిన ట్యాపింగ్ విషయాన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బజారుకు ఇడ్చారు
-
హరీష్ రావు, కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టినా తెలంగాణ సంపద కాపాడందుకు బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది
-
తెలంగాణ సంపద నైనీ కోల్ బ్లాక్‌ను దోచుకునే ప్రయత్నం చేస్తే కేటీఆర్,హరీష్ రావు అడ్డుకున్నారు
-
రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్, పార్మలా ఈ రేసు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసుపై టైమ్ పాస్ చేస్తోంది
-
సంబంధం లేకున్నా హరీష్ రావు,కేటీఆర్‌ను సిట్ పేరుతో వేదించడం ఖండిస్తున్నాం
-
ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం కాదు
-
స్వాతంత్రం వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేస్తారు.
-
దేశ అంతర్గత భద్రత కోసం ట్యాపింగ్ చేయొచ్చు అని చట్టమే చెప్తోంది.
-
ఆనాడు దివంగత దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ వేదికగా ప్రకటన చేశారు.
-
టెలిఫోన్ ట్యాపింగ్ తప్పుకాదని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా చెప్పారు.
-
ఫోన్ ట్యాపింగ్ కేవలం పోలీసులు మాత్రమే చేస్తారు.
-
ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలో చర్చ జరగడం లేదు.
-
దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా సీఎం రేవంత్ వ్యవహార శైలి ఉంది.
-
మంత్రులు, సీఎం ఫోన్ ట్యాప్ చేయమని చెప్పరు!
-
ఎస్ఐబీ చీఫ్ ఎక్కడ ఉంటారు అనేది ఎవ్వరికీ తెలియదు
-
ప్రతిపక్షాల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ట్యాపింగ్‌ను వాడుతున్నారు
-
రేవంత్ రెడ్డికి కొందరు అధికారులు సహకరిస్తున్నారు.
-
సంబంధం లేకున్నా హరీష్ రావు,కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు.
-
పంజాగుట్ట కేసులో వేసిన ఎస్ఐటీ చట్ట వ్యతిరేకం
-
ఆ సిట్ సభ్యులు 350 మందిని విచారించారు.
-
ఆ విచారణలో ఏ ఒక్కరూ కేటీఆర్, హరీష్ రావు పేరు చెప్పలేదు
-
ఆ సిట్‌తో నాయకుల పేర్లు రాలేదు కాబట్టి... సజ్జనార్‌తో మరో సిట్ వేశారు.
-
సజ్జనార్‌తో వేసిన సిట్ రెండోది.. నాయకులను వేధించే సిట్.. ఈ సిట్‌కు భాద్యత వహించే అర్హత సజ్జనార్‌కు లేదు.
-
ఆనాడు ఇంటలిజెన్స్‌లో సజ్జనార్,శివధర్ రెడ్డి ఉన్నారు.
-
ఆనాడు రేవంత్ రెడ్డి 50లక్షలు ఎలా ఇచ్చారు?
-
రేవంత్ రెడ్డిని ఎలా పట్టుకున్నారు అనేది సజ్జనార్, శివధర్ రెడ్డి సమాధానం చెప్పాలి.
-
సిట్ నన్ను విచారణ చేసినప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రుల ట్యాప్ అయినట్లు ఫిర్యాదు చేశాను
కేటీఆర్ సిట్ విచారణ
-
సజ్జనార్ సిట్ ముందుకు కేటీఆర్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వ సిట్ ఏర్పాటు
-
సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సిట్ సభ్యులు
-
ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించిన ఏపీసీ పీ.వెంకటగిరి,ఎస్పీ ఎం.రవీందర్ రెడ్డి
-
కేటీఆర్‌ను విచారించనున్న సజ్జనార్ నేతృత్వంలోని సిట్ సభ్యులు
-
సిట్ కార్యాలయం లోపలికి వెళ్లిన కేటీఆర్
-
కేటీఆర్ ఒక్కడినే లోపలికి అనుమతించిన పోలీసులు
-
హరీష్‌రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు బయటే
-
జూబ్లీహిల్స్ పీఎస్ బయట భారీగా బీఆర్ఎస్ శ్రేణులు.. పోలీస్ బందోబస్తు
సిట్ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణ
-
సిట్ ఆఫీస్‌కు చేరుకున్న కేటీఆర్
-
జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద భారీ బందోబస్తు
-
కేటీఆర్ వెంట హరీష్‌రావు
-
లోపలికి కేటీఆర్‌ను మాత్రమే అనుమతిస్తామన్న పోలీసులు
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
-
సిట్ కార్యాలయానికి బయల్దేరిన కేటీఆర్
-
ఆ సమయంలో కార్యకర్తల అత్యుత్సాహం
-
అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు
-
తెలంగాణ భవన్ గేట్ వద్ద తోసుకున్న పోలీసులు, కార్యకర్తలు
-
కాసేపు ఉద్రిక్తత
-
గాయపడ్డ మహిళా కార్యకర్తలు
సిట్ విచారణకు బయల్దేరిన కేటీఆర్
-
జూబ్లీహిల్స్ పీఎస్‌కు బయల్దేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-
కేటీఆర్ వెంట కీలక నేతలు పార్టీ శ్రేణులు
-
లోపలికి కేటీఆర్‌ను మాత్రమే అనుమతిస్తామంటున్న పోలీసులు
-
సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం.. భారీ బందోబస్తు ఏర్పాటు
తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్
-
రెండేళ్లుగా.. అంతులేని కథలా ఫోన్ ట్యాపింగ్ కేసు
-
ఇది ప్రభుత్వం, పోలీసుల కుట్ర
-
నోటీసులు, విచారణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న పొలిటికల్ గేమ్
-
బీఆర్ఎస్ ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ.. ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా పోరాడిన నాయకత్వం మాది
-
రాష్ట్రం కోసం రాజీలేని పోరాటాలు చేశాం. అనుక్షణం ప్రజలు, రాష్ట్రం కోసమే పని చేశాం.
-
ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత కేసీఆర్‌ది.
-
కావాలనే బురద చల్లడం, హింసించడం మేం ఏనాడూ చేయలేదు.
-
మేం ఎప్పుడూ టైం పాస్ కార్యక్రమాలు చేయలేదు
-
అసమర్థుడి జీవన యాత్రలా కాంగ్రెస్ పాలన
-
ఒక్కో రోజు ఒక్కో డ్రామాతో నెట్టుకొస్తున్నారు.
-
పిచ్చోడి చేతిలో రాయిలా కాంగ్రెస్ పాలన
-
మేం ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు.
-
పదేళ్లు రాష్ట్రం కోసమే పని చేశాం
-
అక్రమ, అనైతిక పనులు చేయలేదు. అయినా నాపై తీవ్ర వ్యక్తిత్వ హననం చేస్తున్నారు.
-
నాపై దిక్కుమాలిన వార్తలు రాయిస్తున్నారు.
-
నేను డ్రగ్స్ తీసుకుంటానని.. హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు
-
ఈ వ్యక్తిత్వ హననానికి బాధ్యులెవరు? సీఎం రేవంతా? అధికారులా?
-
ఎమ్మెల్యేగా, మంత్రిగా చిత్తశుద్ధితో పని చేశా. ఎంక్వైరీలకు భయపడేది లేదు.
-
సింగరేణిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని హరీష్‌రావు అన్నందుకే నోటీసులు ఇచ్చారు
-
సింగరేణి స్కామ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బామర్ది సృజన్ రెడ్డిది కీలక పాత్ర.
-
సింగరేణితో సీఎం రేవంత్ ఎలా ఫుట్‌బాల్ ఆడుతున్నారో హరీష్ వివరించారు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు, విచారణ టైంపాస్ ప్రోగ్రాం
-
మా ప్రభుత్వం ఏం తప్పు చేసిందని అడుగుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని చెప్పగలరా?.
-
కాంగ్రెస్ ప్రభుత్వంలో దండుపాళ్యం ముఠా ఉంది. వారి దోపిడీ బయటపెడతామనే మాకు నోటీసులు ఇస్తున్నారు.
-
రేవంత్‌కు, ఆయన తొత్తులుగా ఉన్న పోలీసులను వదిలను
-
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటా
-
ఈ కేసుతో నాకు సంబంధం లేదు
-
ప్రజల దృష్టి మళ్లించేందుకే కుతంత్రాలు
-
సీఆర్పీసీ కింద నాకు నోటీసులు ఇచ్చారు
-
అయినా పిలిస్తే పదిసార్లైనా విచారణకు వెళ్తా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు
-
మరికాసేపట్లో సిట్ విచారణ
-
తెలంగాణ భవన్లో కీలక నేతలతో కేటీఆర్ సమాలోచనలు
-
తన న్యాయవాదులతో మాట్లాడుతున్న కేటీఆర్
-
కేటీఆర్ వెంట సిట్ కార్యాలయానికి వెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ శ్రేణులు
-
పోలీసులు అడ్డుకునే చాన్స్
-
తెలంగాణ భవన్ చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు
-
తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్‌కు స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు
-
మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ.
-
మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న కేటీఆర్
తెలంగాణ భవన్‌కు బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు
-
కోకాపేట టెంపుల్ ట్రీ నివాసం నుండి తెలంగాణ భవన్‌కు బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు
-
తొమ్మిది గంటలకు తెలంగాణ భవన్ రానున్న కేటీఆర్
-
కేటీఆర్‌తో పాటే హరీష్ రావు
-
తెలంగాణ భవన్ చేరుకున్న కార్యకర్తలు, అభిమానులు
-
పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న కేటీఆర్
-
10 గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్
-
10:30 కు బయలుదేరి జూబ్లీహిల్స్ పీఎస్‌కి వెళ్ళనున్న కేటీఆర్
-
రాత్రి బీఆర్ఎస్ లీగల్ టీంతో సమావేశమైన కేటీఆర్,హరీష్ రావు
-
ఇప్పటివరకు ఈ కేసులో విచారించిన వ్యక్తులను ఏం ప్రశ్నించారు?
-
కేటీఆర్‌ను ఏం ప్రశ్నించబోతున్నారు అనే విషయాలను బ్రీఫ్ చేసిన లీగల్ టీం
బీఆర్ఎస్ నేతలు,ఓయూ విద్యార్థుల అరెస్ట్
-
కేటీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు
-
సిట్ విచారణకు కేటీఆర్.. ఓయూ విద్యార్థుల అరెస్ట్
-
అర్దరాత్రి హాస్టల్‌కు వచ్చి విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు
-
బీఆర్ఎస్వీ కార్యదర్శి జంగయ్య అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
-
పోన్ ట్యాపింగ్ కేసులో నేడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ
-
11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణ
-
కేటీఆర్‌ను విచారించనున్న జాయింట్ సీపీ విజయ్ కుమార్,ఏసీపీ వెంకట గిరి
-
కేటీఆర్ విచారణ కోసం ప్రత్యేక ప్రశ్నలు సిద్దం చేసిన సిట్
-
జూబ్లీహిల్స్ పీఎస్,తెలంగాణ భవన్ వద్ద భారీ భద్రత
-
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
-
పోలీస్ స్టేషన్‌కి రెండు వైపులా భారీకేడ్లు ఏర్పాటు
-
రంగంలోకి లోకల్ పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు
మరికాసేపట్లో తెలంగాణ భవన్‌కు కేటీఆర్
-
మరికాసేపట్లో కోకాపేట నివాసం నుంచి తెలంగాణ భవన్‌కు కేటీఆర్
-
కేటీఆర్ వెంట మంత్రి హరీష్ రావు కూడా!
-
కేటీఆర్‌కు వీరతిలకం దిద్దిన మహిళా నేతలు
-
తెలంగాణ భవన్లో కీలక నేతలతో భేటీ
-
అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం
-
అక్కడి నుంచే సిట్ విచారణకు కేటీఆర్..
కేటీఆర్‌ను విచారించనున్న వెంకటగిరి
-
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుపుతున్న సీపీ సజ్జనార్ నేతృత్వంలోని బృందం
-
కేటీఆర్‌ను విచారించనున్న వెంకటగిరి అండ్ టీం
-
ఇంతకు హరీష్‌రావును విచారించిన ఇదే బృందం
విచారణకు రావాలంటూ నోటీసులు
-
కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు
-
సీఆర్పీసీ 160 సెక్షన్ కింద విచారణకు రావాలని పిలుపు
-
నందినగర్ నివాసంలోని వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు అందజేత
-
ఇవాళ ఉదయం 11గం. జూబ్లీహిల్స్ పీఎస్‌లో సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసులు

