Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. అసెంబ్లీ ఆవరణలో ఆనాడు చెప్పిన ముచ్చట్లు మరిచారా? ఈనాడు రామోజీ!
ADVERTISEMENT 

అసెంబ్లీ ఆవరణలో ఆనాడు చెప్పిన ముచ్చట్లు మరిచారా? ఈనాడు రామోజీ!

Politics Sakshi User Sakshi Sakshi Time Mar 28, 2023 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
babu_ramoji.jpg

ఆంద్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎంత ఘోరంగా తయారవుతున్నాయో చూడండి. ఇక మీడియా పరిస్థితి అయితే నానాటికి నాసిరకంగా మారుతోంది. ఒకప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే ఓటు అమ్ముకుంటే, అమ్ముకున్నవారిపై పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చేవి. చివరికి ఓటును విక్రయించారన్న ఆరోపణలు ఎదుర్కునేవారు సిగ్గుతో తలవంచుకునే విధంగా వార్తా కథనాలు ఉండేవి.

కానీ ఇప్పుడు ఏమి జరుగుతోందో గమనించండి. ఓటు అమ్ముకున్నవారికి మద్దతుగా పేజీలకు, పేజీల వార్తలు వండి వార్చుతున్నారు. అబ్బో.. తాము విలువలకు కట్టుబడి ఉన్నామని పోజులిచ్చిన రామోజీరావుకు చెందిన ఈనాడు మీడియా అయితే మరీ అరాచకంగా తయారైంది.

ప్లేట్ పిరాయించిన ఈనాడు

జర్నలిజాన్ని గాలికి వదలివేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎలాగోలా వ్యతిరేకత పెంచాలన్న నీచ మనస్తత్వంలో ఉన్న ఈనాడు పత్రిక పూర్తిగా దిగజారిపోయినట్లు ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటోంది. ఏపీలో ఎమ్మెల్యేల కోటా నుంచి  జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో నలుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన విషయాన్ని ఆ పత్రికే కథనాలుగా ఇచ్చింది.

దానిపై డబ్బు చేతులు మారాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో తెలుగుదేశం పార్టీ ఇరుకునపడింది. అంతే .. ఈనాడు కూడా ప్లేట్ పిరాయించేసింది. తాము వైఎస్సార్‌సీపీకే ఓటు వేశామని ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు చెబితే దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వార్తలు ఇచ్చారు. అంతేకాక ఆ ఎమ్మెల్యేలు నలుగురు ప్రభుత్వాన్ని, పార్టీని తీవ్రంగా విమర్శిస్తే దానిని పటం కట్టి ప్రచురించారు.

అంతే తప్ప.. ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలలో నిజం ఉందా? లేదా? అన్నదానిపై వార్తలు ఇవ్వలేకపోయింది. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా, భూతద్దంలో వెదికి రాసే ఈనాడుకు ఇంత పెద్ద డీల్ గురించి తెలియకపోవడం అంటే వారి అసమర్దత అనుకోవాలా? లేక అవినీతిని సమర్ధించడం అనాలా? తనకు కూడా టీడీపీ డబ్బు ఆఫర్ ఇచ్చిందని, తాను ఒప్పుకుంటే పది కోట్లు వచ్చి ఉండేవని, తనకు సిగ్గు,శరం ఉన్నాయి కాబట్టి ఆ పని చేయలేదని చెప్పిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన ప్రకటనను మాత్రం ఒక చిన్నపేరాగా ఎక్కడో లోపల పేజీలో కనబడి, కనబడనట్లుగా ప్రచురించారు. దీనిని బట్టి ఈనాడు అవినీతిపరుల వైపు నిలబడడానికి కంకణం కట్టుకుందని తేలడం లేదా!

పాఠకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు..

వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల వాదన ఇవ్వదలిస్తే ఇవ్వండి.. తప్పు లేదు. కాని అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేల కొనుగోలు బేరం గురించి మరో ఎమ్మెల్యే చేసిన ప్రకటనకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి కదా! అలాగే వాస్తవం ఏమిటో పాఠకులకు తెలియచేయాలి కదా! తను భుజాన వేసుకున్న తెలుగుదేశం పార్టీ ఇలాంటి అరాచకాలకు పాల్పడితే అది ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమర్దతగా, చాతుర్యంగా అభివర్ణించే అధమస్థాయి ఈనాడు, ఆంద్రజ్యోతి  ,టీవీ 5వంటి మీడియా సంస్థలు రావడం అత్యంత హేయంగా కనిపిస్తుంది.

అదే పని కనుక మరే పార్టీ అయినా చేసి ఉంటే ఈ పాటికి చంద్రబాబు కాని, ఆయనకు మద్దతు ఇచ్చే ఈ ఎల్లో మీడియా కాని గగ్గోలుగా ప్రచారం చేసి ఉండేవారు. తమకు పదహారు మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని టీడీపీ నాయకత్వం చెబితే అది గొప్ప విషయంగా ఈ మీడియా భావించింది. అంతే తప్ప.. అదేమిటి? అలాంటివాటిని ఎందుకు ప్రోత్సహిస్తారు.. అని ప్రశ్నించలేదు. గతంలో 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి గబ్బు పట్టిన తెలుగుదేశానికి ఇంకా గుణపాఠం రాకపోవడంపై ఆ మీడియా ప్రశ్నించలేదు. పైగా బలం లేకపోయినా టిడిపి అభ్యర్ది గెలిచారంటూ చంకలు గుద్దుకుంటూ ఈ మీడియా సంబరపడిపోయింది.

సుద్దులు చెప్పి.. ఇప్పుడేంటి ఇంత దారుణంగా..

రామోజీరావు విలువల గురించి ఎన్ని సుద్దులు చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏకంగా అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఒక సమావేశంలో ఎమ్మెల్యేల తీరుతెన్నుల గురించి ధర్మోపన్యాసం చేసిన రామోజీరావు ఇప్పుడు ఎమ్మెల్యేల బేరసారాలకు మద్దతు ఇచ్చే పరిస్థితికి చేరుకున్నారు. మరో మీడియా అధినేత గురించి చెప్పుకోవడం అనవసరం. ఎందుకంటే ఇలాంటి బ్రోకర్ పనులు చేయడంలో ఆయన ఆరితేరారని ఎప్పటి నుంచో ప్రజలలో ఉన్నదే. ఈసారి కూడా ఆయన తన వంతు పాత్ర పోషించారని ప్రచారం జరుగుతోంది. ఆయనను పెద్దగా సీరియస్‌గా తీసుకోనవసరం లేదు. కాని ఈనాడు మీడియా మోసపూరిత విధానాలపై మాత్రం మాట్లాడుకోక తప్పదు.

సస్పెండైన ఎమ్మెల్యేలు ఆనం నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలు నలుగురు కూడా తాము వైఎస్సార్‌సీపీ సూచించిన అభ్యర్దులకే ఓటు వేశామని చెబుతుండడం విశేషం. దానికి కారణం లేకపోలేదు. మీడియా ముందు తాము తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని  చెబితే వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. పైగా వీరు డబ్బుకు అమ్ముడుపోయారన్నది నిర్ధారణగా మారి ప్రజలు మరింత ఈసడించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తాము అమ్ముడుపోలేదని చెప్పుకుంటూనే వైఎస్సార్‌సీపీని విమర్శిస్తూ మీడియా ముందు మాట్లాడుతున్నారు.

నిజంగానే వీరు పార్టీకి ద్రోహం చేయకుండా ఉన్నట్లయితే , తాము ఎక్కడా పొరపాటు చేయలేదని, పార్టీ తమను అన్యాయంగా సస్పెండ్ చేసిందని చెప్పేవారు. కాని వారిలో ఆ ధైర్యం కొరవడింది. అపరాధ భావనను కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడ్డారు. అయినా ఆనం రామనారాయణరెడ్డి తనకున్న రాజకీయ అనుభవంతో బాగానే నటించగలిగారు.

ఆయన మొన్నటిదాకా సీఎం జగన్‌ను ఎలా మెచ్చుకున్నారు? ఇప్పుడు ఎంత ఘోరంగా విమర్శిస్తున్నారు? 2014లో రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీచేసి డిపాజిట్ పోగొట్టుకున్నారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలో ఉండడంతో ఆ వైపునకు వెళ్లి, ఆ పార్టీ పరిస్థితి బాగోలేదని తెలుసుకున్నారేమో తెలియదు కాని, 2019 ఎన్నికల నాటికి వైఎస్‌ జగన్‌ను ఆశ్రయించి వెంకటగిరి టిక్కెట్ పొందారు. ఆ కృతజ్ఞతను కూడా ఆనం మిగుల్చుకోకపోవడం విషాదం.

తండ్రి దారిలోనే ఆనం...

ఆనం ఇంతవరకు మూడుసార్లు టీడీపీలోకి ,రెండుసార్లు కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలోకి మారారు. తమకు ఎంతో చరిత్ర ఉందని ఆయన చెబుతున్నారు. నిజమే..ఆయన తండ్రి ఆనం వెంకటరెడ్డికి  కూడా ఇలాగే ఫిరాయింపులు చేసిన చరిత్ర ఉంది. దానిని రామనారాయణ కూడా అనుసరిస్తున్నట్లుగా ఉంది. వచ్చేసారి బీజేపీ, జనసేన, టీడీపీ లలో ఏదో ఒక పార్టీలో చేరవచ్చన్న సంకేతాలను ఆయన ఇస్తున్నారు. ఇక కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన ఉండవల్లి శ్రీదేవి అసెంబ్లీలో కాని, బయటకాని ముఖ్యమంత్రిని ఉద్దేశించి జగనన్న అంటూ ఎన్ని కబుర్లు చెప్పారు. ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

అమరావతి రాజధాని గురించి ఇంతకాలం ఏమి మాట్లాడింది.. ఇప్పుడు ఏమి మాట్లాడుతోంది.. వింటే నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుందంటే ఇదేనేమో అనిపిస్తుంది. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా వెలుగులోకి వచ్చాయి. ఈమె తన ఓటును టిడిపికి వేయడానికి ముందుగా ఎవరెవరి ద్వారా రాయబారాలు సాగించారన్న అంశంపై కొందరు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే బయటపడిపోయినందున ఆయన ఏమన్నా పట్టించుకోనవసరం లేదు.  మేకపాటి చంద్రశేఖరరెడ్డిపై ఇటీవలికాలంలో వచ్చిన ఆరోపణలు, దానికి ఆయన ఆత్మరక్షణలో పడిన తీరు మొదలైనవి చూసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమి చెప్పినా, జనం నమ్మే పరిస్థితి లేదు.

వీరంతా ఒక వైపు తాము వైసిపికే ఓటువేశామని చెబుతూనే , మరో వైపు వైసిపిని విమర్శిస్తున్న వైనాన్ని బట్టి వీరు ఏమి చేసింది అర్ధం చేసుకోవడం కష్టం కాదు. రాజకీయ నేతలు విలువలు పాటించడం లేదని సంపాదకీయాలు రాసే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా సంస్థలు సైతం అంతకన్నా ఘోరంగా , చివరికి అమ్ముడుపోయారన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలకు మద్దతు ఇవ్వడం జర్నలిజం విలువలను నిలువెత్తు గోతిలో పాతిపెట్టడమే.రాపాక వరప్రసాద్ చెబుతున్నట్లు ఈ మీడియా కూడా సిగ్గు,శరం వదలివేశాయని అనుకుంటే తప్పేముంటుంది?



-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
kommineni Srinivasa Rao
TDP
Undavalli Sridevi
Cross voting
Chandrababu Naidu
Yello Media
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

పోలవరంలో ‘కట్ట’ప్ప లూటీ!

పోలవరంలో ‘కట్ట’ప్ప లూటీ!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.