Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. మాట మీద నిలబడటం కొందరికే సాధ్యం!
ADVERTISEMENT 

మాట మీద నిలబడటం కొందరికే సాధ్యం!

Politics Sakshi User Sakshi Sakshi Time Oct 31, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Revanth_News.jpg

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి మహాభారతంలోని కర్ణుడి పాత్ర చాలా ఇష్టమట. చేతికి ఎముక లేనట్టుగా దానం చేసే లక్షణం కర్ణుడిది. మిత్రధర్మం కోసం ప్రాణత్యాగమూ చేసి ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్య యుగంలో కర్ణుడి పాత్ర అంత వాస్తవికమైంది కాదనే చెప్పాలి. పైగా రేవంత్ ఏ రాజకీయ ధుర్యోధనుడితో ప్రస్తుతం మిత్ర సంబంధం ఉందన్న చర్చకు ఆస్కారం ఇచ్చారు. రాజకీయ నేతలు తమని తాము కర్ణుడిలా ఊహించుకుంటారేమో తెలియదు కానీ ఆయన మాదిరిగా మాటమీద నిలబడే వారు చాలా అరుదు. 

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా సినీ కార్మికులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రేవంత్‌ పాల్గొన్నారు. సమ్మె సందర్భంగా సీఎం చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి సహకరించినందుకు సినీ కార్మికులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం పరిధిలో మరీ ముఖ్యంగా కృష్ణానగర్‌ ప్రాంతంలో సినీ జూనియర్‌ ఆర్టిస్టులు వేలమంది నివసిస్తూంటారు. వారి ఓట్లు దక్కించుకునేందుకు రేవంత్‌ ఈ మాట అన్నారేమో మరి!. ఎందుకంటే కార్మికుల సమ్మె ఎప్పుడో పరిష్కారమైతే ఇప్పుడు సన్మాన సభ ఏమిటో?.. 

అయితే ఈ సందర్భంగా రేవంత్‌ ఇంకో హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు ఆదాయంలో ఇరవై శాతం చెల్లిస్తేనే సినిమా టిక్కెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతిస్తుందని ప్రకటించారు. ధరల పెంపు నిర్మాతలు, హీరోలకు ఆదాయం తెస్తుందని, కార్మికులకు దక్కేది ఏమీ ఉండదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల చెవులకు ఈ హామీ వినసొంపుగా ఉండొచ్చు. కానీ అది ఆచరణ సాధ్యమా?..  

ఎందుకంటే... ప్రతి సినిమాకూ ఓ సంక్షేమ నిధి అంటూ ఏదీ ఉండదు. అందరికీ కలిపి ఒకదాన్ని ఏర్పాటు చేస్తే ఎవరికి ఎంతివ్వాలన్నది అర్థం కాని పరిస్థితి ఏర్పడొచ్చు. రేవంత్‌ మాట్లాడుతూ.. నిజమే కానీ టిక్కెట్‌ ధరలు అన్ని సినిమాలకూ పెరగవు. టిక్కెట్ ధరలు పెంచిన తరువాత కూడా నష్టాలొస్తే ఏం చేయాలి? లాభ నష్టాలతో సంబంధం లేకుండా టిక్కెట్ రేట్ పెంచిన వెంటనే అందులో 20 శాతం వేరుచేసి కార్మికులకు కేటాయించాలని ప్రభుత్వం ఏమైనా చెప్పగలుగుతుందా?అందుకు నిర్మాతల సంఘాలు ఒప్పుకుంటాయా? ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని తన ఆలోచనపై నిర్మాతలతో చర్చించి ఆ తరువాత ఒక ప్రకటన చేసి ఉంటే బాగుండేది.

కొంతకాలం క్రితం పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సినిమా హాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఒక బాలుడు గాయపడి, ఇప్పటికీ కోలుకోలేకపోవడం తెలిసిన సంగతే. హీరో అల్లు అర్జున్‌ జైలు పాలయ్యారు కూడా. తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ తెలంగాణలో బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వమని అసెంబ్లీలోనే ప్రకటించారు. కానీ ఆ తరువాత షరా మామూలే. యధావిధిగా బెనిఫిట్‌ షోలకు అనుమతులు వచ్చేస్తున్నాయి. బీజేపీ కూటమి భాగస్వామి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తాజా సినిమా బెనిఫిట్‌ షోతోపాటు టిక్కెట్‌ రేట్ల పెంపునకూ ఓకే అన్నారు. గురువు.. టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారేమో మరి!. 

రేవంత్‌కు కర్ణుడి పాత్ర నిజంగానే అంత ఇష్టమైతే ఇలా మాట తప్పవచ్చా అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఇంకో సంగతి చెప్పాలి. దానగుణంలో గొప్పవాడైన కర్ణుడు కౌరవుల పక్షాన ఉన్న సంగతి మర్చిపోరాదు. కౌరవాగ్రజుడు దుర్యోధనుడికి అనుయాయిగా కర్ణుడు కూడా అపకీర్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది మరి. 

సినీ కార్మికుల పిల్లల కోసం స్కూల్ పెడతానని అన్నారు.ఆలోచన బాగానే ఉంది కాని అందుకు అవసరమైన మూడు నాలుగెకరాల స్థలం ఈ మహానగరంలో ఎక్కడి నుంచి తెస్తారు? దాన్ని ప్రభుత్వ అధికారులు చూడగలుగుతారు. కాని,కార్మిక సంఘాలు ఎలా వెదుకుతాయో చెప్పలేము. హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకు వచ్చే బాధ్యత తమదని, ప్రపంచ సినిమా వేదికగా హైదరాబాద్ కావాలన్న ఆకాంక్ష కూడా మెచ్చుకోతగ్గదే. అయితే.. 

చంద్రబాబుతోపాటు రేవంత్‌ రెడ్డితోనూ సత్సంబంధాలు నెరుపుతున్న మీడియా సంస్థకు సొంతంగా ఒక స్టూడియో ఇప్పటికే ఉంది. దీనికి పోటీగా మరిన్ని వస్తాయంటే వారు ఊరకుంటారా? అయితే రామోజీ ఫిలిం సిటీకే హాలీవుడ్‌ను రప్పిద్దామని ఆయన అనడం ద్వారా వారిని సంతృప్తిపరిచారని అనుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ లో సినీ పరిశ్రమకు చోటు ఇస్తామని చెప్పడం బాగానే ఉంది. అందులో  పరిశ్రమ అభివృద్దికి వ్యూహారచన ఉండవచ్చు. కాగా ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కిపోనని రేవంత్ గంభీరంగా ప్రకటించినా, ఇంతకుముందు అలా మాటకు కట్టుబడి ఉండలేకపోయారని అనుభవం చెబుతోంది. పైగా.. 

గతంలో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి హామీలు ఇస్తారు?ప్రజలను ఏ విధంగా మాయ చేస్తారో తన అభిప్రాయాలను చెప్పిన వీడియోలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ పక్షాన గత ఎన్నికలలో ఆయన ఇచ్చిన హామీలు,వాటి అమలు తీరు మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుంటే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రేవంత్ ఈ ప్రసంగం చేశారా అన్న భావన కలుగుతుంది. కొసమెరుపు ఏమిటంటే సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డితో సంబంధం లేకుండా ఈ సభ జరగడం!.


:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Telangana
Revanth Reddy
Telangana Politics
promises
Chandrababu Naidu
kommineni Srinivasa Rao
Sakshi Guest Column
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.