Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ‘బాబువి గాలి కబుర్లు.. ఈయన్ని చూసి తెలుసుకోండి’
ADVERTISEMENT 

‘బాబువి గాలి కబుర్లు.. ఈయన్ని చూసి తెలుసుకోండి’

Politics Sakshi User Sakshi Sakshi Time Jul 25, 2023 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
CM-Jagan-CBN-Over-CRDA-Houses-Issue.jpg

సంపద సృష్టి అనే మాటను తరచూ వింటుంటాం. ప్రత్యేకించి ఏపీలో  ఒక నాయకుడు తనకే సంపద సృష్టించడం తెలుసు అని ఏదేదో చెబుతుంటారు. కానీ, మరో నాయకుడు సంపద సృష్టించి చూపించారు. తనకు మళ్లీ అధికారం ఇస్తే పేదలను ధనికులను చేస్తానని పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు  చెబుతుంటే, ముఖ్యమంత్రి జగన్  తాను అధికారంలో ఉన్న సమయంలోనే పేదలకు లక్షల విలువైన ఆస్తి సమకూర్చి ‘ఇదీ.. పేదలను ఆదుకోవడం’’ అని రుజువు చేసుకుంటున్నారు.



అమరావతి రాజధాని గ్రామాలలో ఇరవైఐదు లే అవుట్లలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారంచుట్టిన సందర్భంగా జగన్ చేసిన ప్రసంగం చూస్తే కొన్ని స్పష్టమైన నినాదాలు, విధానాలతో ఆయన ముందుకు వెళుతున్నట్లు అర్ధం అవుతుంది. తొలుత ఒక లబ్దిదారు మాట్లాడుతూ తనకు కేటాయించిన సెంటు భూమి విలువ ఇప్పుడు పది లక్షలకు పైనే ఉంటుందని  ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దానికి తోడు ఇప్పుడు ఇంటి నిర్మాణానికి మరో మూడు లక్షలు, అక్కడ మౌలిక వసతులకు ఖర్చు పెట్టబోయే నిదులను లెక్క వేసుకుంటే  మొత్తం పదిహేను లక్షల వరకు ఆమెకు సమకూరినట్లవుతుంది. నిజంగానే  సంపదను సృష్టించడం అంటే ఇది కదా అని అనిపిస్తుంది.





✍️ గతంలో అమరావతి గ్రామాలలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రాజధాని అని ప్రకటించినప్పుడు భూములు కలిగిన ఆసాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అమెరికా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐలు లబ్ది పొందితే.. ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నిరుపేదలకు ఆ ప్రాంతంలో లబ్ది పొందడం గమనించదగిన అంశమే అవుతుంది. అందుకే ఆయన పెత్తందారులే అక్కడ పాగ వేయాలని అనుకున్నారని, కాని తాము పేదలకు అవకాశం ఇచ్చామని, దీనిని సామాజిక అమరావతిగా. మనందరి అమరావతిగా మార్చామని జగన్ ప్రకటించారు. అంతేకాదు.. ఉపన్యాసం ఆరంభంలోనే ఈ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం జరగకుండా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు అడ్డుపడ్డారంటూ ధ్వజమెత్తారు.

✍️ అయినప్పటికీ మీ బిడ్డ మీ తరపున మూడేళ్లపాటు న్యాయపోరాటం చేసి,  పేదలకు ఇళ్లు కట్టించడం వరకు తెచ్చామని, ఇది చరిత్రాత్మకమైన రోజు అని జగన్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్లు  కట్టవద్దంటూ ఏపీలోనే ప్రతిపక్షం అడ్డుపడిందని ఆయన మండిపడ్డారు. హైకోర్టులో 18 కేసులు, సుప్రీం కోర్టులో ఐదు కేసులు వేసి అడ్డుకునే యత్నంచేశారని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా కేంద్ర మంత్రులను, అధికారులను కలిసి పేదలకు ఇళ్లు రాకుండా చేయాలని, నిధులు రాకుండా  అడ్డుపడాలని చూశారని ఆయన తెలిపారు. ఊరుపేరులేని సంఘాలను కూడా ఇందుకోసం ఏర్పాటు చేశారని ఆయన  చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

✍️ ఒకప్పుడు అమరావతి రాజధానిలోకి  జగన్ రాకూడదని కొందరు పసుపు నీళ్లు చల్లి అవమానించే యత్నం చేస్తే.. ఇప్పుడు అదే ప్రాంతంలో జగన్ యాభై నాలుగువేల మందికి ఇళ్లు కట్టిస్తుండడం విశేషం. చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన , అలాగే ఈనాడు తదితర ఎల్లో మీడియా పేదలకు ఎలా వ్యతిరేకంగా ఉన్నారో ఆయన ఆధారసహితంగా వివరించడం ద్వారా రాష్ట్రం అంతటికి ఒక మెస్సేజ్ పంపించారు. తాను పేదల ప్రతినిధినని.. చంద్రబాబు, పవన్ లు పెత్తందార్ల ప్రతినిధులని, పేదల కోసం తాను పలు స్కీములు అమలు చేస్తుంటే, చంద్రబాబు తదితరులు వాటిని అడ్డుకుంటున్నారని..   తాను చేస్తున్న వాదనకు ఆయా ఉదాహరణలను కూడా జగన్ ఇచ్చారు. ప్రత్యేకించి పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం వద్దంటున్నారని ఆయన గుర్తు చేశారు.అదే టైమ్ లో ఆ పెత్తందార్లంతా తమ పిల్లలను ఇంగ్లీష్ బడులలో చదివిస్తున్నారని ఎద్దేవ చేశారు.

✍️ పేదవారికి తాను మేలు చేస్తుంటే వీరు ఓర్వలేకపోతున్నారని చెప్పడానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. వలంటీర్ల వ్యవస్థ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కాకపోతే వెంకటగిరిలో చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ఆయన మాట్లాడలేదు. మొత్తం స్పీచ్ లో పెత్తందార్లు, పేదల మధ్య పోరాటం గురించే ఆయన చెప్పే యత్నం చేశారు కాని, ఇతరత్రా రాజకీయ అంశాల జోలికి వెళ్లలేదు.

✍️ అమరావతి ప్రాంతంలో గజం విలువపదిహేను వేల వరకు ఉన్న విషయాన్ని ప్రస్తావించి , ఆ స్థలాలతో పాటు,రోడ్లు, నీరు, పార్కులు, తదితర సదుపాయాలు సమకూర్చుతున్న సంగతిని ఆయన వివరించి 12 లక్షల నుంచి  పదిహేను లక్షల రూపాయల మేర ఆస్తిని సమకూర్చినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి పేదలకు సంబంధించి ఇంత భారీ కార్యక్రమం చేపట్టలేకపోయారు. సంపద సృష్టి అంటే ఆయన ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్నే చూస్తారన్న భావన ఉంది. అదికూడా బాగా డబ్బున్నవారికే అదనంగా వచ్చే ఆదాయవనరుగా మార్చడం మినహాయించి పేదల పక్షాన ఆయన ఉండేవారు కాదన్న విమర్శ ఎప్పటినుంచో ఉంది. అమరావతిని ఒక వర్గం రాజధానిగా, ధనికుల రాజధానిగా మార్చడానికి చంద్రబాబు ప్రయత్నించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నిరసనకు గురయ్యారు. అందుకే అమరావతిని జగన్ పేదలు కూడా నివసించే రాజధానిగా మార్చినట్లయింది. ఇక్కడ కొందరు ఒక విషయం ప్రస్తావిస్తున్నారు.

✍️ జగన్ ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది వాస్తవమేకాని, ఇతరత్రా అభివృద్ది ఎందుకు చేయడం లేదని అడుగుతున్నారు. దానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టమైన జవాబు ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో ఏ పని చేద్దామన్నా కేసులు వేసి అడ్డుకుంటున్నవారే ఈ ప్రశ్నలు వేస్తున్నారని , తమకు అన్ని ప్రాంతాలు సమానమేనని, కేసుల గొడవ లేకపోతే అమరావతిని కూడా అభివృద్ది చేసి చూపిస్తామని ఆయన అన్నారు. రాజధాని గ్రామాలలో కొంతమంది తెలుగుదేశం, తదితర కొన్ని రాజకీయ పక్షాల ట్రాప్ లో పడి , అక్కడ అభివృద్ది కన్నా, ఆందోళనలకే ప్రాధాన్యం ఇచ్చారు. అది వాస్తవం.  

✍️ చంద్రబాబు నాయుడు పరాజయం చెందినా, ఆయన మాట ప్రకారమే నడుచుకుని వాళ్లు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అదే జగన్ ముఖ్యమంత్రి కాగానే అనవసర నిరసనలకు పోకుండా, వారంతా ఒక కమిటీగా ఏర్పడి, జగన్ ను కలిసి తమకు కావల్సిన అభివృద్ది పనులను చేయించుకుని ఉంటే బాగుండేది!. పైగా ఒకేసారి 55 వేల ఎకరాల భూమిని అభివృద్ది చేయడం ఎవరి వల్లా కాదు. చంద్రబాబు నాయుడు ప్రచారం కోసం అలివికాని పనిని భుజాన వేసుకుని చతికిలపడ్డారు. పైగా ఆయన టైమ్ లో రాజధాని ప్రాంతంలో పేదలకు ప్రాతినిధ్యమే లేదన్నట్లుగా వ్యవహారాలు సాగాయి. చివరికి అస్సైన్డ్ భూములను కూడా తమ అధీనం చేసుకున్నారు. దానికి ఆనాటి ప్రభుత్వం సహకరించి అప్రతిష్టపాలైంది. ఏది ఏమైనా జగన్ ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కొత్త టౌన్ షిప్ లు నిర్మించడం కూడా అభివృద్దిలో భాగమే అవుతుంది. ఇదే మాదిరి ఇతరత్రా అభివృద్ది పనులు కూడా జరిగేలా అందరు సహకరిస్తే మంచిది. లేకుంటే ఎప్పటిమాదిరి పెత్తందారి పోకడలతోనే,కుట్రలలోనే భాగస్వాములవుతామని ప్రతిపక్షం అనుకుంటే అది వారికే నష్టం అని వారు తెలుసుకోవాలి.



::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
YS Jagan Mohan Reddy
kommineni Srinivasa Rao
Chandrababu Naidu
CRDA
poor people
Amaravati
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.