Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. పంజాబ్‌లో ముందస్తు ఎన్నికలు.. సీఎం అభ్యర్థి మాత్రం..!
ADVERTISEMENT 

పంజాబ్‌లో ముందస్తు ఎన్నికలు.. సీఎం అభ్యర్థి మాత్రం..!

Politics Sakshi User Sakshi Sakshi Time Jun 13, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Kejriwal.jpg

చండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్ణీత సమయం కంటే ముందే జరిగే అవకాశం ఉందని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సూచించారు. బఠిండాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కేజ్రీవాల్‌... 2027 ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలు 2026 నవంబర్‌లోనే జరిగే అవకాశం ఉందని చెప్పారు.

అయితే ముందస్తు ఎన్నికలకు కారణం ఏంటనే విషయాన్ని ఆయన వివరించలేదు. అయినప్పటికీ, ముందస్తు ఎన్నికలు వస్తే సిద్ధం కావడానికి కొన్ని నెలలే మిగులుతాయని చెబుతూ పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

భగవంత్‌ మానే ఆప్‌ సీఎం అభ్యర్థి
తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార‍్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్‌ మానేనని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మాన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించడంపైనే పార్టీ దృష్టి ఉండాలని చెప్పారు. గత నాలుగు ఏళ్లలో పంజాబ్‌ ప్రభుత్వం చూపిన పనితీరు ప్రజల విశ్వాసాన్ని, మద్దతును సంపాదించిందని కేజ్రీవాల్‌ అన్నారు. 

ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, సీనియర్‌ ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా, పంజాబ్‌ ఆప్‌ అధ్యక్షుడు అమన్‌ అరోరాతో కలిసి కేజ్రీవాల్‌ బఠిండాలో రోడ్‌షోలో పాల్గొన్నారు. ఇటీవలి మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీకి మద్దతు ఇచ్చిన ఓటర్లకు కేజ్రీవాల్‌ కృతజ్ఞతలు తెలిపారు. బర్నాలా, మోగా, బటాలా, బఠిండా మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఆప్‌ కౌన్సిలర్లు మేయర్లుగా ఎన్నికయ్యారని, ఇది పార్టీ పాలనపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు.

ప్రతిపక్షంపై కేజ్రీవాల్‌ విమర్శలు
ప్రత్యర్థి పార్టీల పేర్లు ప్రస్తావించకుండా కేజ్రీవాల్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఒక పార్టీని "చిట్టా పార్టీ", మరో పార్టీని "ఫైటింగ్‌ పార్టీ", ఇంకో పార్టీని "ఈడీ పార్టీ"గా పేర్కొంటూ, మాదకద్రవ్యాల సమస్యతో సంబంధం ఉండటం, అంతర్గత కలహాలు, ప్రత్యర్థులను భయపెట్టేందుకు కేంద్ర సంస్థలను వినియోగించడం వంటి పనులు చేస్తున్నాయని ఆరోపించారు.

దీనికి భిన్నంగా, ప్రజా సంక్షేమం, అభివృద్ధిపైనే దృష్టి పెట్టిన పార్టీగా ఆప్‌ను ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ పనితీరును సమర్థిస్తూ, పంజాబ్‌ ప్రజలు చూసిన అత్యంత నిజాయితీ నాయకుల్లో ఆయన ఒకరని అన్నారు. గత ప్రభుత్వాలపై అవినీతి, కుంభకోణాల ఆరోపణలు వచ్చేవని, అయితే మాన్‌ పదవీకాలంలో అలాంటి ఆరోపణలు ఏవీ రాలేదని కేజ్రీవాల్‌ చెప్పారు. ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలు చర్యలు తీసుకుని ఉండేవని ఆయన వాదించారు.

పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కేజ్రీవాల్‌ ప్రస్తావించారు. ఉచిత విద్యుత్‌, రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా రక్షణ అందిస్తున్నామని చెప్పారు. అలాగే జులై నుంచి మహిళలకు ఆర్థిక సాయం ప్రారంభమవుతుందని ప్రకటించారు. అర్హులైన మహిళలకు నెలకు రూ.1,000, షెడ్యూల్డ్‌ కులాల మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామని తెలిపారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Kejriwal
punjab
bhagwant mann
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

తల్లిదండ్రుల పరువు తీశారు.. మీకు రక్షణ ఇవ్వాలా?

తల్లిదండ్రుల పరువు తీశారు.. మీకు రక్షణ ఇవ్వాలా?

ఆర్టీఐ ముసుగులో వ్యాపారం!

ఆర్టీఐ ముసుగులో వ్యాపారం!

తప్పిన ఘోర  రైలు ప్రమాదం.. కుప్పకూలిన బోగీ

తప్పిన ఘోర రైలు ప్రమాదం.. కుప్పకూలిన బోగీ

ఊహించని మలుపు.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి

ఊహించని మలుపు.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి

ప్రేమలో గొడవ.. ప్రేయసిపై ఘాతుకం

ప్రేమలో గొడవ.. ప్రేయసిపై ఘాతుకం

భారత ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం!

భారత ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.