Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. CM Yogi Adityanath Birthday: యోగి ఆదిత్యనాథ్‌కు ఆ పేరెలా వచ్చిందంటే..
ADVERTISEMENT 

CM Yogi Adityanath Birthday: యోగి ఆదిత్యనాథ్‌కు ఆ పేరెలా వచ్చిందంటే..

Politics Sakshi User Sakshi Sakshi Time Jun 5, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
yogi.jpg

జూన్ 5.. అంటే ఈరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు. నేటితో ఆయనకు 52 ఏళ్లు నిండాయి. దేశంలో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా యోగి ఆదిత్యనాథ్‌కు పేరుంది. అభిమానులు ఆయనను యోగి బాబా, బుల్డోజర్ బాబా అని కూడా పిలుస్తారు. యోగి ఆదిత్యనాథ్ రెండుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దీంతో పాటు ఐదు సార్లు లోక్‌సభ ఎంపీగా కూడా ఉన్నారు.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 1972 జూన్ 5న ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లా పంచూర్ గ్రామంలో జన్మించారు. యోగి అసలు పేరు అజయ్ సింగ్ బిష్త్. యోగి తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ ఫారెస్ట్ రేంజర్. సీఎం యోగి గణితంలో బీఎస్సీ పట్టా పొందారు. 1990లో ఏబీవీపీలో చేరారు. 1993లో గోరఖ్‌నాథ్ పీఠానికి చెందిన మహంత్ అద్వైత్‌నాథ్‌తో పరిచయం ఏర్పడింది. 1994లో అజయ్ సింగ్ బిష్త్ సన్యాసం స్వీకరించారు. నాథ్ శాఖకు చెందిన సాధువుగా మారారు. ఆ తర్వాత ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్‌గా మారింది. 1994లో అద్వైత నాథ్ తన వారసునిగా యోగి ఆదిత్యనాథ్‌ను ప్రకటించారు.

యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా 1998లో గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ టికెట్‌పై తన 26 ఏళ్ల వయసులో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1999, 2004, 2009, 2014లలో గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. మహంత్ అద్వైత్‌నాథ్ 2014లో కన్నుమూశారు.  అనంతరం యోగి గోరఖ్‌నాథ్ పీఠానికి అధ్యక్షులయ్యారు.

2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఫలితాలు వెలువడే సమయంలో యోగి ఆదిత్యనాథ్ విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. అయితే బీజేపీ నేతలు ఎన్నికల ఫలితాల విడుదల వరకూ ఆగాలని ఆయనను కోరారు. ఆ సమయంలో మనోజ్ సిన్హా, కేశవ్ మౌర్య సహా పలువురు బీజేపీ నేతలు సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. అయితే బీజేపీ అధిష్టానం యోగి ఆదిత్యనాథ్‌ను ఢిల్లీకి పిలిపించి, యూపీలో అధికారం చేపట్టాలని కోరింది.

యోగి సీఎం పదవి చేపట్టగానే ఎదుర్కొన్న మొట్టమొదటి సమస్య రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న శాంతిభద్రతలు. దీనికి పరిష్కారం దిశగా ముందడుగు వేసిన ఆయన పోలీసు అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. యోగి నాయకత్వంలో 2022లో కూడా యూపీలో బీజేపీ విజయం సాధించింది. సీఎం యోగి బుల్డోజర్లతో నేరస్తుల ఇళ్లపై దండెత్తాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. అందుకే ఆయనకు బుల్డోజర్ బాబా అనే పేరు వచ్చిందంటారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Yogi Adityanath
birth day
uttarpradesh
bulldozer
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘అయోధ్య’ విరాళాల్లో గోల్‌మాల్‌: ‘సిట్’కు షాకిచ్చిన ఫుటేజ్!

‘అయోధ్య’ విరాళాల్లో గోల్‌మాల్‌: ‘సిట్’కు షాకిచ్చిన ఫుటేజ్!

యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం

యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం

కల నిజమాయెగా..!

కల నిజమాయెగా..!

పెన్నులు కొనుగోలు చేస్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త!

పెన్నులు కొనుగోలు చేస్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త!

అఖిలేష్‌ కుమార్తెకు న్యాయం చేస్తా : సీఎం యోగి

అఖిలేష్‌ కుమార్తెకు న్యాయం చేస్తా : సీఎం యోగి

కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.