Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ఆ పార్టీలతో జాగ్రత్త
ADVERTISEMENT 

ఆ పార్టీలతో జాగ్రత్త

Politics Sakshi User Sakshi Sakshi Time Feb 20, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
CM-DELHI.jpg

పట్నంలో కమలం.. పల్లెలో గులాబీ

రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలను అప్రమత్తం చేసిన హైకమాండ్‌ 

కాంగ్రెస్‌ పటిష్టంగా ఉన్నా, బీఆర్‌ఎస్, బీజేపీ కూడా బలంగానే ఉన్నాయి 

మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 29%, బీజేపీ 16% ఓట్లు సాధించాయి 

జాతీయ, ప్రాంతీయ వాదాలతో జనంలోకి వెళ్లే అవకాశాలున్నాయి 

అభివృద్ధి మంత్రంతో ఐక్యంగా వాటిని అడ్డుకోవాలి 

యువత, మహిళలను మరింతగా కాంగ్రెస్‌కు చేరువ చేయాలి 

ఎంఐఎం ఎంత విస్తరిస్తే బీజేపీ అంత ఎదుగుతుందన్న రాహుల్‌! 

ఉత్తరాదిలో బీజేపీ ఎదుగుదలకు ఎంఐఎం పరోక్షంగా సహకరిస్తోందని వ్యాఖ్య 

సమ్మక్క, సారలమ్మ చరిత్రపై జాతీయ స్థాయి సినిమా తీయాలని సూచన 

రాష్ట్రంలో సామాజిక న్యాయం కొనసాగిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి 

ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ చీఫ్‌తో అధిష్టానం భేటీ.. విడివిడిగానూ చర్చలు 

మార్చి 15 నాటికి పదవుల పంపకాలు పూర్తి చేయాలని ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ..ఏమాత్రం ఏమరుపాటు తగదని, ప్రధాన పక్షాలైన బీజేపీ, బీఆర్‌ఎస్‌లు సైతం బలంగా ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు హైకమాండ్‌ స్పష్టం చేసింది. సామాజిక న్యాయం అంశంతో కాంగ్రెస్‌ పార్టీ ముందుకెళ్తున్నప్పటికీ..జాతీయవాదం, ప్రాంతీయ వాదం నినాదాలతో ప్రతిపక్షాలు జనంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది. రెండు పార్టీల ను ఎప్పటికప్పుడు ఐకమత్యంతో సమర్థంగా ఎదుర్కోవాల ని సూచించింది. 

గురువారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ సహా మంత్రులందరితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాందీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ భేటీ అయ్యారు. ఖర్గే నివాసంలో సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో భాగంగా.. ముఖ్యమంత్రి, మంత్రులందరితో కలిపి ఒకసారి, విడివిడిగా మరోసారి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీల బలాబలాలు, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో పాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకా లు, వాటి అమలుకు చేసిన ఖర్చు తదితరాలపై నేతలకు సీఎం రేవంత్‌ వివరణ ఇచ్చారు. అనంతరం పలు అంశాలపై రాష్ట్ర నేతలకు ఏఐసీసీ పెద్దలు దిశా నిర్దేశం చేశారు. 

బలం మరింత పెంచుకునేందుకు ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.. 
‘ఇటీవలి మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ప్రదర్శన కనబరిచింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్, పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉన్నాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 29 శాతం ఓట్లు సాధిస్తే, బీజేపీ 16 శాతం ఓట్లు రాబట్టుకుంది. సర్పంచ్‌ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌కు 30 శాతం సీట్లు వచ్చాయి. బలం మరింత పెంచుకునేందుకు రెండు పార్టీలు గట్టిగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం అప్రమత్తంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటేనే ఆ పార్టీలను నిలువరించగలం. దీనికి తోడు కొన్ని సామాజిక వర్గాల్లో ఈ రెండు పార్టీలు పట్టు సాధిస్తున్నాయి. దీనిని అభివృద్ధి మంత్రంతో అడ్డుకోవాలి. యువత, మహిళలను మరింతగా పార్టీకి చేరువ చేయాలి..’ అని కాంగ్రెస్‌ హైకమాండ్‌ చెప్పినట్లు తెలిసింది.  

ఎంఐఎంపై విస్తృతంగా చర్చిద్దాం 
బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలను నిలువరించడంతో పాటు ఎంఐఎంను కట్టడి చేసే అంశం రాహుల్‌గాంధీ ప్రస్తావించినట్లు తెలిసింది. ఎంఐఎం ఎంతగా విస్తరిస్తే అంతగా బీజేపీ ఎదుగుతుందని, ఇప్పటికే అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలకు ఎంఐఎం పరోక్షంగా సహకరిస్తోందని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఎంఐఎంను కాంగ్రెస్‌ భాగస్వామిగా ప్రజలు భావిస్తే గ్రామీణ ప్రాంతాల్లో హిందువుల ఓట్లలో చీలిక వచ్చే అవకాశాలపై అనుమానాలు లేవనెత్తినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరోమారు విస్తృతంగా చర్చిద్దామని ఖర్గే అన్నట్టు చెబుతున్నారు.  

బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామన్న సీఎం 
ముఖ్యమంత్రి మాట్లాడుతూ..‘ఇటీవలి ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటించాం. పార్టీ చెబుతున్నట్టుగానే బీసీలకు మున్సిపల్‌ చైర్మన్, వైఎస్‌ చైర్మన్‌ పోస్టుల్లో ప్రాధాన్యతనిచ్చాం. ఇకపైనా ఇదే విధానాన్ని కొనసాగిస్తాం..’ అని చెప్పినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర నేతల చిత్తశుద్ధిని ప్రశంసిచిన హైకమాండ్‌ పెద్దలు.. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా అడ్డుకున్న బీజేపీ తీరును మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం అవసరమని మీనాక్షి నటరాజన్‌ సూచించగా, దీనిపై పీసీసీ అధ్యక్షుడు దృష్టి సారించాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ నేతల భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. కాగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తమతమ శాఖల పరిధిలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. «రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేశామని ఉత్తమ్‌ చెప్పారు.

మార్చి 15 నాటికి పదవుల పంపకాలు
ఎన్నో నెలలుగా పెండింగ్‌లో ఉన్న పార్టీ, నామినేటెడ్‌ పదవుల భర్తీకి ఈ భేటీలో హైకమాండ్‌ పెద్దలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. సామాజిక సమతుల్యతను పాటిస్తూ, అన్ని వర్గాలకు, పార్టీ కోసం పనిచేసిన నిజమైన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని సూచించారు. మార్చి 15 నాటికి రాష్ట్ర స్థాయి పదవుల కేటాయింపు పూర్తిచేసి, ఆ తర్వాత మరో పది రోజుల్లో జిల్లా స్థాయి పదవులను భర్తీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేయాలని సూచించినట్లు తెలిసింది. వీటితో పాటు చీఫ్‌ విప్, రెండు విప్‌ పదవుల భర్తీపైనా చర్చ జరిగిందని సమాచారం. రెడ్డి లేదా వెలమ సామాజికవర్గ నేతకు చీఫ్‌ విప్‌ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు పార్టీ కార్యవర్గ కూర్పుపైనా చర్చించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లలో బీసీలు మినహా మిగతా అన్ని  సామాజిక వర్గ నేతలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.

పిలిస్తే మేడారం వచ్చే వాళ్లం కదా..
సమ్మక్క, సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను అగ్రనేతలు అభినందించారు. మేడారం జాతర చరిత్ర, ప్రాశస్త్యం గురించి మంత్రి వివరించగా..ఖర్గే, రాహుల్‌లు మరింత సమాచారం అడిగి తెలుసుకున్నారు. సమ్మక్క, సారలమ్మల చరిత్రను దేశవ్యాప్తంగా పరిచయం చేసేలా జాతీయ స్థాయి సినిమా రూపొందించాలని రాహుల్‌ సూచించినట్లు సమాచారం. మేడారం జాతరకు ఆహ్వానిస్తే తప్పకుండా హాజరయ్యేవారమని రాహుల్, ఖర్గే అనగా..సమయాభావంతో వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయినట్లు సీతక్క వివరణ ఇచ్చారు. ఈసారి తప్పకుండా అధికారిక ఆహా్వనం అందజేస్తామని చెప్పారు. ఆహ్వానం అందితే తప్పక వస్తామని రాహుల్, ఖర్గే అన్నారు. కాగా అందరితో కలిసి చర్చించిన పార్టీ అగ్రనేతలు, అనంతరం మంత్రుల కోరిక మేరకు విడివిడిగా ఒక్కో నేతతో 5–10 నిమిషాల పాటు మాట్లాడారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు, మీనాక్షి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సురేఖ పలు అంశాలపై వారితో చర్చించినట్లు తెలిసింది.   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Revanth Reddy
Congress Party
Municipal elections
Telangana
Rahul Gandhi
AICC
Sonia Gandhi
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.