Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ఎక్కడ తప్పు జరిగిందో నిరూపించండి: సీఎం రేవంత్‌
ADVERTISEMENT 

ఎక్కడ తప్పు జరిగిందో నిరూపించండి: సీఎం రేవంత్‌

Politics Sakshi User Sakshi Sakshi Time Feb 23, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
PRAJA-BHAVAN_BC-MEETING-3.jpg

సమగ్ర సర్వేపై కేసీఆర్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు సీఎం సవాల్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నూటికినూరు శాతం పక్కాగా నిర్వహించినట్లు ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వే చేపట్టిందని, ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక శాఖకు అప్పగించి పకడ్బందీగా నిర్వహించినట్లు వివరించారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సాహసం చేయలేదని, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

వ్యవస్థను కుప్పకూల్చే కుట్రలో భాగంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం ప్రజాభవన్‌లో బీసీ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. సర్వే చేపట్టిన విధానం, ఫలితా­లు, బీసీల జనాభాకు సంబంధించిన అంశాలను ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్, ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌తోపాటు పలువురు బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సమగ్ర సర్వే, బీసీ జనాభా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.   

కేసీఆర్‌ ఎన్నికల కోసం వాడుకున్నారు 
‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి సర్వే చేపట్టాం. అన్ని రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన చేయాల్సిందే. కేసీఆర్‌ చేసిన సకలజనుల సర్వే తప్పుల తడకగా ఉన్నందునే ఆ లెక్కలను బయటపెట్టలేదుం. వాటిని ఆయన ఎన్నికల కోసం వాడుకున్నారు.. ప్రజల కోసం వాడలేదు. ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వే ప్రక్రియ చేపట్టింది. 

ఇంటింటికి ఎన్యుమరేటర్లు వెళ్లి సమాచారం సేకరించారు. ఆ సమాచారాన్ని తప్పులు దొర్లకుండా ఎన్యుమరేటర్‌ సమక్షంలో కంప్యూటరీకరించారు. తప్పులు జరిగాయని మాట్లాడుతున్న వారు ఎక్కడ తప్పు జరిగిందో నిరూపించాలి. అర్థంలేని ఆరోపణలు పట్టించుకోవాల్సిన పనిలేదు. కేసీఆర్‌ చేసిన సర్వే ప్రకారం బీసీలు 51 శాతం ఉంటే.. సమగ్ర ఇంటింటి సర్వే ప్రకారం బీసీ జనాభా 56.33 శాతం ఉంది. బీసీల లెక్క తగ్గిందా? పెరిగిందా? అనే విషయాన్ని బీసీలు గమనించాలి’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. 

ఒకట్రెండు ఆధిపత్యవర్గాల కోసం... 
జనగణనలో కులగణన చేపట్టాలనే డిమాండ్‌ ఎప్పట్నుంచో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘స్వతంత్ర భారత దేశంలో ఇప్పటివరకు కులగణన చేపట్టలేదు. ఒక్కసారి బీసీల లెక్క తెలిస్తే వాటా అడుగుతారనే ఆందోళనతో కొందరు కుట్ర చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీలోని ఒకట్రెండు ఆధిపత్యకులాల కుట్రల వల్లే ఈ ప్రక్రియ జరగడంలేదు. ఎంతోకాలంగా ఉన్న డిమాండ్‌ను మనం విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. 

దేశంలో కులగణన చేపట్టడం ఇష్టంలేకనే బీజేపీ కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీకి నేను విసిరే సవాల్‌ ఒక్కటే. జనగణనలో కులగణన చేర్చాలి. అప్పుడే ఎవరి లెక్క ఏంటో తేలుతుంది. జనగణనలో కులగణన చేర్చాలని ఈ సమావేశం వేదికగా తీర్మానం చేస్తున్నాంం. సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి మార్చి 10లోగా తీర్మానాలు చేయండి. 

బీసీలు ఐకమత్యాన్ని చాటాలి. అప్పుడే రాజకీయంగా, విద్య, ఉద్యోగాల పరంగా ప్రయోజనం ఉంటుంది. బలహీన వర్గాలకు కులగణన నివేదికనే బైబిల్, భగవద్గీత, ఖురాన్‌. భవిష్యత్‌లో దేశంలో బీసీ రిజర్వేషన్ల గురించి చర్చించాలంటే తెలంగాణ గురించి, రేవంత్‌ రెడ్డి గురించి చర్చించుకునే పరిస్థితి ఉంటుంది. మోదీ రాజకీయంగా వ్యతిరేకత ఎదుర్కొనాల్సి వస్తుందనే ఈ ప్రక్రియను తప్పుబడుతున్నారు. 

కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఉద్యోగాలు పోతాయనే భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సర్వే ప్రక్రియ పూర్తి చేయడంతో నా బాధ్యత పూర్తయింది. దీన్ని పట్టాలెక్కించి గమ్యం చేర్చే వరకు ముందుకు తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదే. తప్పుడు మాటలు మాట్లాడటం కాదు.. ఏ బ్లాక్‌లో, ఏ ఇంట్లో తప్పు జరిగిందో నిరూపించాలని కేసీఆర్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి సవాల్‌ విసురుతున్నా’ అని రేవంత్‌ పేర్కొన్నారు. 

2011 జనగణనలో ఎస్సీ, ఎస్టీ వివరాలే వెల్లడించారు: భట్టి 
చివరగా జరిగిన 2011 జనగణనలో కేవలం ఎస్సీ, ఎస్టీల వివరాలు మాత్రమే బయటపెట్టారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వివరించారు. దేశంలో తెలంగాణ ప్రభుత్వం మినహా ఇప్పటివరకు బీసీ జనగణనను శాస్త్రీయంగా తేల్చలేదు. కేసీఆర్‌ చేసిన సకలజనుల సర్వే అధికారికం కాదని, దానిని కేబినెట్లో పెట్టలేదని, శాసనసభలో చర్చ జరపలేదని, అందుకే అది చెల్లుబాటు కాదన్నారు. 

దేశంలో మొదటిసారి బీసీ జనాభాను అధికారికంగా లెక్క తేల్చి ముద్ర వేశామని, దీనిని ఆయా వర్గాల ప్రయోజనం కోసం ఎలా ముందుకు తీసుకెళ్లాలో బీసీ ప్రజా ప్రతినిధులు, సంఘాలు ఆలోచన చేయాలన్నారు. బీసీ సర్వే అధికారికంగా జరగడంతో బీఆర్‌ఎస్‌కు నష్టం కలుగుతుందని, అందుకే సర్వే బాగాలేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

తెలంగాణలో బీసీ సర్వే విజయవంతమైతే దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుందని, అందుకే బీజేపీ నేతలు నేతలు దు్రష్పచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. బీసీ కులగణనతో తెలంగాణలో సరికొత్త అధ్యాయం మొదలైందన్నారు. కులగణన సర్వేతో తెలంగాణ దేశానికి రోల్‌ మోడల్‌గా మారిందని చెప్పారు. బీసీలకు సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Revanth Reddy
Telangana Government
Comprehensive survey
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.