Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. సంగివలసలో సీఎం జగన్‌ సింహనాదం
ADVERTISEMENT 

సంగివలసలో సీఎం జగన్‌ సింహనాదం

Politics Sakshi User Sakshi Sakshi Time Feb 11, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
cmysjagan12.jpg

సాక్షి, విశాఖపట్నం: ఇక్కడ ఉన్నది అర్జునుడు.. ఇటు పక్క పాండవ సైన్యం ఉంది. అటు పక్క కౌరవ సైన్యం ఉంది. అక్కడ పద్మ వ్యూహం పొంచి ఉంది. ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు. ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. భీమిలి నియోజకవర్గం సంగివలస బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ యుద్ధంలో 175కి 175 సీట్లు గెలుపే మన లక్ష్యమన్నారు.

‘‘ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. మరో 25 ఏళ్ల పాటు మన జైత్ర యాత్రకు శ్రీకారం చుడుతున్నాం. మన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చాం చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే దత్త పుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు. గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు. చేసిన మంచిని నమ్ముకునే.. మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడు’’ అని సీఎం పేర్కొన్నారు.

‘‘మరో 75 రోజుల్లోనే ఎన్నికలు. అబద్దానికి, నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. గతంలో చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదు. మనం మేనిఫెస్టో లోని ప్రతి హామీని నెరవేర్చాం. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ప్రతి గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు. 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం. లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాం. రైతులకు తోడుగా ఆర్బీకే లను నిర్మించాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

‘‘ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. ప్రతి గ్రామానికి డిజిటల్ లైబ్రరీలు, బ్రాడ్ బాండ్ లు తీసుకొచ్చాం’’ అని సీఎం తెలిపారు.

‘‘14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదు. ఎందుకంటే చంద్రబాబు అండ్ కో పెత్తందార్లు కాబట్టి చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ గ్రామం బాగుపడదు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నిలువునా ముంచాడు. మీ జగన్.. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు

3,527 ప్రొసీజర్ల కు ఆరోగ్యశ్రీ ని విస్తరించాం. ఒక్క వైద్యరంగంలోనే 53 వేల కొత్త నియామకాలు చేపట్టాం. అందుకే ఎక్కడ చూసినా వైఎస్ జగన్ మార్కే కనిపిస్తోంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువును అందుబాటులోకి తెచ్చాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం . నామినేటెడ్ పదవుల్లో సగం పదవులు బలహీనవర్గాలకే ఇచ్చాం. స్థానిక సంస్థల పదవులు ఆన్నింటిలోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. లంచాలు, వివక్ష లేకుండా రూ. 2 లక్షల 53 వేల కోట్లు నేరుగా మీ ఖాతాలో వేశాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.

‘‘పేదల సొంతింటి కలను నెరవేర్చాం. అక్కచెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మాది. 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇచ్చాం. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారు. అన్నింటిలోనూ చంద్రబాబు మోసమే కనిపిస్తుంది. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు అన్నారు  బడుగుబలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమ లేదు. మీ జగన్ రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు.

సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. గత పదేళ్ల మీ బ్యాంకు అకౌంట్ల ను చెక్ చేసుకోండి. చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి అయినా పడిందా ?. మన పాలనలో మీ ఖాతాల్లో రూ. 2 లక్షల 53 వేల కోట్లు వేశాం. ఎన్ని కష్టాలు ఎదురైనా .. అన్ని వర్గాలకు మంచి చేశాం. మీ జగన్.. రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు. 56 నెలల కాలంలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం. కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి మనం చేసిన మంచిని చెప్పండి. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమల్ని మాత్రమే.

ప్రజలే .. నా స్టార్ క్యాంపెయినర్లు. పేదల భవిష్యత్ మారాలంటే .. జగనే గెలవాలని చెప్పండి. ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే .. జగన్ గెలవాలని చెప్పండి 

ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే .. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి. రైతు భరోసా, ఇన్ ఫుట్ సబ్సిడీ అందాలంటే .. మీ జగన్ సీఎం కావాలని చెప్పండి’’  అని సీఎం చెప్పారు.

మీరు వేసే ఓటు.. పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి. ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయి. మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం.. మోసాలు చేయడం తెలియదు. మీ బిడ్డ చెప్పాడంటే.. చేస్తాడంతే. ఈ యుద్దానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?. ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ?. దుష్టచతుష్టయాన్ని.. గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా?. వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే. ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి. దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ, 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే’’ అని సీఎం పేర్కొన్నారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
YSRCP
YS Jagan Mohan Reddy
AP Elections 2024
AP Politics
Bheemili
Visakhapatnam
Siddham
Siddham Sabha
AP Assembly Elections 2024
AP 175
Visakapatnam Elections
Visakapatnam Assembly Constituencies
Bheemili Assembly Constituency
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

బోటు ప్రమాదంపై ఫిషరీస్‌ కమిషనర్‌ సంచలన వ్యాఖ్యలు

బోటు ప్రమాదంపై ఫిషరీస్‌ కమిషనర్‌ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.