సాక్షి, విజయవాడ: నామినేటెడ్ పోస్టుల భర్తీలో జనసే, బీజేపీకి చంద్రబాబు షాక్ ఇచ్చారు. 20 పదవుల్లో 3 జనసేనకి, బీజేపీకి ఒక్కటి మాత్రమే దక్కింది. బీజేపీ నుంచి మాజీ టీడీపీ నేత లంక దినకర్‌కి 20 సూత్రాల ఛైర్మన్ పదవి కేటాయించగా, ఒరిజినల్ బీజేపీ నేతలకు నామినేటెడ్ పదవులు దక్కలేదు. జనసేనకు పవర్ లేని డమ్మీ కార్పొరేషన్లను చంద్రబాబు అంటగట్టారు.
కార్పొరేషన్ ఛైర్మన్ల వివరాలు
-
వక్ఫ్‌బోర్డు- అబ్దుల్ అజీజ్ (టీడీపీ)
-
శాప్- ఏ. రవి నాయుడు (టీడీపీ)
-
గృహనిర్మాణ సంస్థ- బత్తుల తాతయ్యబాబు (టీడీపీ)
-
ఏపీ ట్రైకార్- బొరగం శ్రీనివాసులు (టీడీపీ)
-
ఏపీ మారిటైం బోర్డు- దామచర్ల సత్య (టీడీపీ)
-
సీడాప్- దీపక్‌రెడ్డి (టీడీపీ)
-
20 సూత్రాల అమలు కమిటీ- లంకా దినకర్ (బీజేపీ)
-
మార్క్‌ఫెడ్- కర్రోతు బంగార్రాజు (టీడీపీ)
-
సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్- మన్నె సుబ్బారెడ్డి (టీడీపీ)
-
ఏపీఐఐసీ- మంతెన రామరాజు (టీడీపీ)
-
పద్మశాలి కార్పొరేషన్- నందం అబద్ధయ్య (టీడీపీ)
-
ఏపీటీడీసీ- నూకసాని బాలాజీ (టీడీపీ)
-
ఏపీఎస్ ఆర్టీసీ- కొనకళ్ల నారాయణ, వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం (టీడీపీ)
-
పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కార్పొరేషన్- పీలా గోవింద సత్యనారాయణ (టీడీపీ)
-
లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్- పిల్లి మాణిక్యాల రావు (టీడీపీ)
-
వినియోగదారుల రక్షణ కౌన్సిల్- పీతల సుజాత (టీడీపీ)
-
ఎంఎస్ఎంఈ- తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన)
-
పౌరసరఫరాల కార్పొరేషన్- తోట మెహర్ సీతారామ సుధీర్ (జనసేన)
-
ఏపీటీపీసీ- వజ్జ బాబూరావు (టీడీపీ)
-
ఏపీ టిడ్కో- వేములపాటి అజయ్‌కుమార్ (జనసేన)