June 2nd AP Elections 2024 News Political Updates..
08:27 PM, June 2nd, 2024
ఏలూరు జిల్లా:
దెందులూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నాం: కొఠారి అబ్బయ్య చౌదరి
- నాలుగో తారీఖు జరిగే కౌంటింగ్ ప్రక్రియలో ఏలూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేయబోతుంది
- నిన్న వివిధ సంస్థలు ఇచ్చిన ఏ ఎగ్జిట్ పోల్స్ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభంజనం సృష్టించబోతుందని స్పష్టం చేశారు.
- నేషనల్ మీడియా సంస్థలన్నీ కేంద్రానికి భయపడి తల తోక లేని ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇచ్చారు.
- గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి మంచి చేశారనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ వైఎస్సార్సీపీకి అధికారం కట్టబెట్టనున్నారు.
- రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు అందరూ పడిన కష్టం ఈనెల 4వ తారీఖున వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడడంతో ఫలితం దక్కబోతోంది.
- గతం కంటే కూడా ఈసారి ఎక్కువ మెజార్టీ స్థానాలు రాబోతున్నాయి.
- ఈ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో వరుసగా రెండవసారి జగన్మోహన్రెడ్డి ఈనెల 9వ తేదీన వైజాగ్‌లో ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనది
05:57 PM, June 2nd, 2024
నెల్లూరు:
ఏపీలో మళ్లీ వైఎస్సార్ సీపీదే అధికారం: విజయసాయిరెడ్డి
- నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లతో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సమావేశం
- ఏపీలో మళ్లీ వైఎస్సార్ సీపీదే అధికారం, నెల్లూరు పార్లమెంటుతో. పాటు ఏడు అసెంబ్లీ స్ధానాలు గెలుస్తున్నాం
- కౌంటింగ్ మొదలైనప్పటి నుండి చివరి వరకు ప్రతీది ఏజెంట్లు క్షుణ్ణంగా పరిశీలించాలి..
- పేదలు, బడుగు బలహిన వర్గాలు, మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లశారు..
- జిల్లాలో కీలక నియోజకవర్గాలుగా ఉన్న నెల్లూరు సిటీ కోవూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవబోతోంది
04:52 PM, June 2nd, 2024
విశాఖ
ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు: వైవీ సుబ్బారెడ్డి
- వైఎస్సార్సీపీ గెలవడం ఖాయం
- పోలింగ్ సమయంలోనే తుఫాన్ వస్తుందని కూటమి దుష్ప్రచారం చేసింది
- ఇప్పుడు కౌంటింగ్ తర్వాత కూడా అలాగే చెబుతున్నారు
- ప్రజలు చాలా కూల్‌గా ఓటింగ్‌లో పాల్గొన్నారు
- కౌంటింగ్ సమయంలో కూడా అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏజెంట్లు కౌంటింగ్ లో చురుకుగా పాల్గొనండి
- పెద్ద రాష్ట్రాలు ఒడిస్సా.. ఏపీ మినహా దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి
- స్థానిక సర్వేలు బట్టి ఏ ప్రభుత్వం వస్తుందో స్పష్టంగా తెలుస్తోంది
- ప్రజలు ఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు రావాలన్న అంశంపై స్పష్టంగా ఉన్నారు
03:45 AM, June 2nd, 2024
ఢిల్లీ:
పోస్టల్ బ్యాలెట్ పై సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ న్యాయపోరాటం
- ఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన వైఎస్సార్సీపీ
- అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్ తో పోస్టల్ బ్యాలెట్ ను ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్ఆర్సిపి
- రేపు త్వరగా విచారణ చేపట్టాలని మెన్షన్ చేయనున్న వైఎస్ఆర్సీపీ తరఫు న్యాయవాది
- ఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్సీపీ
- పోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్
- కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ
11:45 AM, June 2nd, 2024
సీఎం జగన్ ప్రజలు ఆశీర్వదించారు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
- తిరుమల
- శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
- అనంతరం నారాయణ స్వామి కామెంట్స్..
- సీఎం జగన్‌ను ప్రజలందరూ ఆశీర్వదించారు
- వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో ఎన్నికల విజయం సాధించబోతోంది.
- వైఎస్ జగన్ సీఎం అయితేనే రాష్ట్రంలో పేదరికం పోతుంది
11:15 AM, June 2nd, 2024
కూటమికి మంత్రి రోజా కౌంటర్
- తిరుమల
- శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా
- అనంతంర రోజా మాట్లాడుతూ..
- ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండోసారి సీఎం అవ్వడం ఖాయం
- ఏపీ ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టారు
- మహిళలు, వృద్ధులు రాత్రి వరకు క్యూలో నిలబడి ఓటు వేశారు
- 2014లో ఉన్న ఇదే ఎన్డీఏ కూటమి రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయలేదు
- ఇప్పుడు ఆ కూటమికి ఎలాంటి క్రేజ్ లేదని అందరికీ తెలుసు
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లను టీడీపీ అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది
- చంద్రబాబు ఎన్ని దొంగాటలు ఆడినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరు
- చంద్రబాబును పుట్టించిన ఖర్జూర నాయుడు వచ్చినా ప్రజల మనస్సుల్లో నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చెరిపేయలేరు
8:15 AM, June 2nd, 2024
ఫ్యాన్‌దే హవా..
- ఏపీలో వైఎస్సార్సీపీ దెబ్బకు చేతులెత్తేసిన కూటమి
- వైఎస్సార్సీపీ భారీ విజయమని తేల్చిన ఎగ్జిట్‌పోల్స్
- వైఎస్సార్సీపీ గెలుపు లోడింగ్.. విజయం లాంఛనమే
ఏపీలో వైయస్ఆర్సీపీకి మళ్లీ తిరుగులేదని తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్🔥
జగనన్న దెబ్బకి చేతులెత్తేసిన కూటమి
జూన్ 4న వైయస్ఆర్సీపీ గెలుపు ఇక లాంఛనమే#YSRCPWinningBig#YSJaganAgain#ExitPoll pic.twitter.com/coTiCq7yz9— YSR Congress Party (@YSRCParty) June 1, 2024
Times Now- @ETG_Research #ExitPoll Predictions
Andhra Pradesh (Total Seats: 25) | Here are seat share projections:
- YSRCP: 14
- BJP+: 11
- Congress+: 0
- Others: 0@padmajajoshi further takes us through vote share predictions. pic.twitter.com/6R9hAcNQiA— TIMES NOW (@TimesNow) June 1, 2024
8:00 AM, June 2nd, 2024
వైఎస్సార్సీపీదే ఏపీ.. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ
-
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ
-
94–104 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని తేల్చి చెప్పిన ‘ఆరా’ మస్తాన్
-
50% ఓట్లతో 110–120 స్థానాల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుందని చాణక్య పార్థదాస్ వెల్లడి
-
వైఎస్సార్సీపీ విజయం తథ్యమని తేల్చిన ఆత్మసాక్షి, జన్మత్, ఆపరేషన్ చాణక్య, అగ్నివీర్, పోల్ స్ట్రాటజీ గ్రూప్, రేస్ తదితర సంస్థలు
-
లోక్‌సభ స్థానాలపై దేశవ్యాప్తంగా బీజేపీ వాణి విన్పించిన జాతీయ మీడియా సంస్థలు
-
వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఫలితాలు ప్రకటించవద్దని స్థానిక సెఫాలజిస్ట్‌లపై టీడీపీ ఒత్తిళ్లు
-
ఒత్తిడి తట్టుకోలేక ఫలితాలు మార్చి ప్రకటించిన ఒక సంస్థ


7:30 AM, June 2nd, 2024
పోస్టల్ బ్యాలెట్లపై భద్రం
- ఏజెంట్లూ.. అవి అత్యంత కీలకం.. లెక్కింపులో జాగ్రత్తలు తప్పనిసరి
- ఉదయం 6 గంటలలోపే కౌంటింగ్ కేంద్రాలకు రావాలి
- ఆర్వో టేబుల్ మీద లెక్కింపు చెల్లుతుందో లేదో నిర్ధారించాకే లెక్కింపు చేపట్టాలి
- 13ఏ డిక్లరేషన్‌పై ఓటరు సంతకం, అటెస్టింగ్ సంతకం తప్పనిసరి
- అనుమానం వస్తే వెంటనే ఆర్వోకి ఫిర్యాదు చేయాలి
7:00 AM, June 2nd, 2024
ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్సార్సీపీకి సానుకూలత : సజ్జల
-
సీఎం జగన్ పాజిటివ్ ప్రచారం ఎన్నికల్లో బాగా పనిచేసింది: సజ్జల
-
మహిళా ఓటర్లు మా వైపే నిలబడ్డారని స్పష్టమైంది
-
ఐదేళ్లలో సంక్షేమాభివృద్ధి పథకాలతో పెద్దపీట
-
4న కౌంటింగ్‌లో మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి
-
సొంతంగా పోటీ చేసే శక్తి లేకనే చంద్రబాబు పొత్తులు
-
పోస్టల్ బ్యాలెట్‌పై బాబు ఒత్తిడికి ఈసీ తలొగ్గడం సిగ్గుచేటు
-
దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తాం
6:30 AM, June 2nd, 2024
మళ్లీ వైఎస్సార్సీపీదే విజయం
- వైఎస్ జగన్ పాలన వైపు మహిళలు, గ్రామీణులు, బలహీన వర్గాల మొగ్గు
- వైఎస్సార్సీపీ తన ఓటు శాతాన్ని ఐదేళ్ల తర్వాత కూడా కాపాడుకుంది
- 94 –104 సీట్లు వైఎస్సార్సీపీకి.. 71 – 81 సీట్లు టీడీపీ కూటమికి
- వైఎస్సార్సీపీకి 13–15 ఎంపీ స్థానాలు.. టీడీపీ కూటమికి 10–12 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం
- తెలంగాణలో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు
- బీజేపీ 8–9 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్ 7–8 ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం
- ప్రలోభాలు, ఒత్తిళ్లకు లోనుకాకుండా సర్వే రిపోర్టు ఇచ్చానన్న ఆరా మస్తాన్.