AP Elections Political Latest Updates Telugu..
08:50 PM, Feb 19th, 2024
టీడీపీకి ఓటు వేసి వృథా చేసుకోవద్దు: ఎంపీ కేశినేని నాని
- బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారంటీ అని టీడీపీ వాళ్లు వచ్చే ఉంటారు:
- గ్యారంటీ అని టీడీపీ వాళ్లు వచ్చే ఉంటారు
- టీడీపీలో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఉన్నారు.. మీ ఓటు వృథా చేసుకోవద్దు
- చంద్రబాబు అంటేనే పచ్చి మోసం
- పనికిమాలిన కొడుకును సీఎం చేయడమే చంద్రబాబు ఎత్తుగడ
- పాపం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ కూడా మోస పోతున్నాడు
- టీడీపీ ఎలాగూ గెలవదు.. ఎలక్షన్ అనంతరం ప్రక్కనే ఉన్న తెలంగాణకు బాబు, కొడుకులు వెళ్లిపోతారు
- టిడిపి ఎలాగూ గెలవదు.. ఎలక్షన్ అనంతరం ప్రక్కనే ఉన్న తెలంగాణకు బాబు,కొడుకులు వెళ్ళిపోతారు
08:30 PM, Feb 19th, 2024
ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే ఉంటాం: తిరువూరు వైఎస్సార్సీపీ ఇంచార్జ్ స్వామిదాస్
- నేను పక్కా లోకల్ .. ముప్పై ఏళ్లుగా ప్రజల తోనే ఉన్నా
- ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే ఉంటాం
- రోజుకొక వేషం వేసుకుని నియోజకవర్గంలోకి కొందరు వస్తున్నారు
- ఇప్పటికే నన్ను,తర్వాత ఇంకొకరు,ఆ తర్వాత మరొకరు ఇలా టీడీపీలో ఎందర్ని ఎందుకోసం మారుస్తున్నారో ప్రజలకు తెలుసు
- టక్కుటమార విద్యలలో మన ముందుకు ఐదేళ్లకోసారి జాతర కోసమన్నట్లు వస్తూనే ఉన్నారు
07:15 PM, Feb 19th, 2024
చంద్రబాబు, ఎల్లోమీడియా పై మాజీమంత్రి కొడాలి నాని ఫైర్
- వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లైతే...చెప్పేవాడు చంద్రబాబు
- ఇప్పటి వరకూ అభ్యర్ధుల్ని ,ఇంఛార్జ్ లను ఏడు విడతల్లో జగన్మోహన్రెడ్డి ప్రకటించారు
- అభ్యర్ధుల్ని మార్చేచోటే మార్పులు చేర్పులు చేస్తున్నారు
- వైఎస్సార్సీపీలో సీట్ల మార్పులు జగన్మోహన్రెడ్డి చేస్తారు.. ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు, మహాటీవీ వంశీ కాదు
- నరేంద్రమోదీకి కూడా గుడివాడలో ఏబీఎన్ రాధాకృష్ణ టికెట్ ఇవ్వగలడు
- నన్ను ఓడించాలంటే చంద్రబాబును తెచ్చి గుడివాడలో పోటీచేయమనండి
- గుడివాడలో నేను పోటీచేయాలో లేదో జగన్మోహన్రెడ్డి చెబుతారు.. టీవీ5, ఏబీఎన్, మహాన్యూస్పకోడీగాళ్లు కాదు
- ఏబీఎన్ రాధాకష్ణ,బీఆర్ నాయుడు పోటీచేస్తారని నేను కూడా ఫ్లెక్సీలు పెట్టిస్తా ... నిజమైపోతుందా
- గన్నవరంలో వంశీని,గుడివాడలో నన్ను మారుస్తామని జగన్మోహన్రెడ్డి చెప్పారా
- మా సీట్లు ఇవ్వడానికి ఈ ఏబీఎన్..టివి5,మహాటీవీ బఫూన్ గాళ్లు ఎవరు
- పక్కలేస్తే సీట్లివ్వడం...డబ్బులకు అమ్ముకోవడం వైఎస్సార్సీపీలో ఉండదు
- వంద కోట్లుంటే చంద్రబాబు టీడీపీలో టిక్కెట్లిస్తాడు
- మా మైలవరం అభ్యర్ధికి ఎకరం పొలం తప్ప ఏమీ లేదు
- వైఎస్సార్సీపీలో ఒకడు ట్రైచేస్తేనో...బ్రోకర్ గాడు చెబితేనే టిక్కెట్లు రావు
- సామాజిక సమీకరణాల ప్రకారమే ఎస్సీ,బీసీ,ఎస్టీ ,మైనార్టీలకు జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు
- చంద్రబాబుకు దమ్ముంటే..మగాడైతే బీసీలకు ఎక్కువ సీట్లివ్వాలి
- సీట్లు మారుస్తాడా లేదా..అనేది మాకు జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం
- మధ్యలో తెలుగుదేశం బ్రోకర్లకు పనేంటి
- ఏబీఎన్ రాధాకృష్ణ బ్రోకర్ పనులు టీడీపీలో చేసుకోమనండి
- జగన్ మోహన్ రెడ్డిని ఎదుక్కోలేక పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి
- ఎందరు కలిసొచ్చినా జగన్మోహన్రెడ్డిని ఎదిరించలేరు
- జగన్ సింగిల్ గా వస్తానని చెబుతున్నాడు ...మీరెందుకు ఒకరి సంక మరొకరు ఎక్కుతున్నారు
- చంద్రబాబు పర్మినెంట్ గా మాజీగానే ఉంటాడు
- ఈ రాష్ట్రానికి పర్మినెంట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
- పదిలక్షల మంది జనం వచ్చిన చోట ఆంధ్రజ్యోతి పేపర్ ఫోటో గ్రాఫర్ కు పనేంటి
- ఏబీఎన్ ను , వాళ్ల పేపర్ ను మేం బ్యాన్ చేశాం..ఎవరు రమ్మన్నారు
- రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ,బీఆర్ నాయుడు మా సభలకు మీ లోగోలు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా
- మీరు మా సభలకు వస్తే మా కార్యకర్తలు మీ కాలుకు కాలు విరిచేస్తారు
06:53 PM, Feb 19th, 2024
నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ, జనసేనకి భారీ షాక్
- జనసేన, టీడీపీకి చెందిన 500 మంది యువకులు వైఎస్సార్సీపీలో చేరిక
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి
- యువతలో సీఎం జగన్‌కు మంచి క్రేజ్ ఉందని, వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా
05:17 PM, Feb 19th, 2024
14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు?: సజ్జల
- గత ఐదేళ్లలో ఏ అభివృద్ధీ చేయని చంద్రబాబు ఇప్పుడు మాకు సవాల్ చేయటం కరెక్టు కాదు
- చంద్రబాబుకు సత్తా ఉంటే గతంలో ఏం చేశారో చెప్పాలి
- చంద్రబాబు పాలన చెత్తపాలన అని పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు
- మద్యం విషయంలో దశలవారీగా చేస్తున్నాం
- సీఎం జగన్‌కు సవాల్ విసిరే అర్హత చంద్రబాబుకు లేదు
- చంద్రబాబు సవాల్‌కి మేము సిద్ధమే
- మా తరపున ఎవరో ఒకరు చర్చకు వస్తారు
- అంతకంటే ముందు గత పాలనలో ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలి
- జగన్ పాలనలో చెప్పి, చేయనవి ఏంటో చంద్రబాబు చెప్పాలి
- కౌంట్ డౌన్ మొదలైంది
- ఇంకో యాభై రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు
- మా వాలంటీర్ల వ్యవస్థ మంచిది కాదు, మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తానని డైరెక్ట్‌గా చెప్పాలి
- సిద్ధం సభలను ప్రజలు చూస్తూనే ఉన్నారు
- ఏ సభలోనూ జగన్ పరుషంగా ఎప్పుడూ మాట్లాడలేదు
- కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాటలు ఎలా ఉన్నాయో కూడా జనం చూస్తున్నారు
- ఊరూరా జరిగిన అభివృద్ధిని ఎవరూ కాదనలేదు
- ఎల్లోమీడియా రోజూ తప్పుడు వార్తలు రాస్తున్నారు
- చేసిన అభివృద్ధి, సంక్షేమం వారికి కనపడదా?
- 87% మంది ప్రజలు నేరుగా ప్రభుత్వ లబ్ది పొందారు
- ఆ కృతజ్ఞతలు చూపిస్తున్నారు
- జగన్ మీద వ్యతిరేకత ఉంటే మరి చంద్రబాబుకు పొత్తులు ఎందుకు?
- రెండు ఎకరాల నుండి లక్షల కోట్ల ఆస్థులు చంద్రబాబు ఎలా సంపాదించారు?
- జగన్ ఆస్తులు ప్రజలకు పంచాలన్న లోకేష్ ప్రకటన హాస్యాస్పదం
- చేతిలో పచ్చమీడియా ఉన్నందున ఏది మాట్లాడినా వార్తలు వేస్తారని చంద్రబాబు, లోకేష్ అనుకుంటున్నారు
- చంద్రబాబు నిజం చెప్తే తల వెయ్యి ముక్కలు అవుతుందని ముని శాపం ఉందని గతంలో వైఎస్సార్ అనేవారు
- ఆ సంగతి తెలీక లోకేష్ ఆ సామెతని జగన్‌కి చుడుతున్నాడు
- జైల్లో ఉన్నప్పుడు సర్వరోగాలు ఉన్నాయని చెప్పుకుని బెయిల్ పై బయటకు వచ్చారు
- ఆ రోగాలన్నీ ఇప్పుడు ఏం అయ్యాయో చంద్రబాబు చెప్పాలి
- కేసులపై కోర్టులు తీర్పులు ఇస్తాయి
- త్వరలోనే మ్యానిఫెస్టోని ప్రకటిస్తాం.. చేయగలిగినదే చెప్తాం
05:15 PM, Feb 19th, 2024
చంద్రబాబు సవాల్‌పై కొట్టు సత్యనారాయణ ధ్వజం
- చంద్రబాబు నాయుడుకి మతి భ్రమించింది
- చంద్రబాబు అభివృద్ధి మీద చర్చిద్దాం అనడం హాస్యాస్పదం
- ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన వ్యక్తి చంద్రబాబు
- సీఎం జగన్‌తో సవాల్ చేసే స్థాయి చంద్రబాబుకి లేదు
- మర్రిచెట్టుకి వచ్చినట్లు ఏళ్ళు వస్తే సరిపోదు బుద్ధి జ్ఞానం ఉండాలి
- నా పరిపాలన చూసి ఓటెయ్యమని అడిగే దమ్ము దైర్యం చంద్రబాబుకి ఉంటే చెప్పాలి
04:40 PM, Feb 19th, 2024
చంద్రబాబు సవాల్‌కు జగన్‌కు రావాల్సిన అవసరం లేదు.. మేమే సరిపోతాం: పోతుల సునీత
- చంద్రబాబు సవాల్‌కు సీఎం జగన్ రావాల్సిన అవసరం లేదు.. మేమే చంద్రబాబుకు సమాధానం ఇస్తాం
- రాబోయే రోజుల్లో ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధం గా ఉన్నారు.
- రెండు బటన్లు నొక్కేందుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారు..
- చంద్రబాబు అంటే భయపడాల్సిన అవసరం జగన్‌కు లేదు
- చంద్రబాబు తన హయాంలోనే సారాను ఏరులై పారించారు
- ఇసుక అక్రమ రవాణా చేసి కోట్ల గడించారు
- సిద్ధం సభలు భారీ సక్సెస్ అవుతున్నాయి
- విద్య, వైద్య రంగాల్లో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు చేశారు
- అంబేద్కర్ స్ఫూర్తితో జగన్ పరిపాలన సాగిస్తున్నారు
- అందుకే సిద్ధం సభలకు భారీగా జనం తరలివస్తున్నారు
04:20 PM, Feb 19th, 2024
చంద్రబాబుతో చర్చకు జగన్ అవసరం లేదు : కేశినేని నాని
- వైఎస్సార్సీపీ చేసిన అభివృద్ధిపై మేం చర్చకు సిద్ధం
- తాత్కాలిక సచివాలయం కటడం అభివృద్ధా?
- ఏపీలో 10 వేలకు పైగా గ్రామ సచివాలయాలు అభివృద్ధి కాదా?
- సంపదను చంద్రబాబు దోచుకున్నారా?
04:15 PM, Feb 19th, 2024
మమ్మల్ని విమర్శించే స్థాయి లోకేష్‌కు లేదు : ధర్మాన కృష్ణదాస్
- లోకేష్ అవివేకి, ఆయన మాటలకు విలువలేదు
- రెడ్ బుక్ చూపిస్తే ఎవరూ భయపడరు
- దమ్ముంటే లోకేష్ నాపై పోటీ చేయాలి
04:10 PM, Feb 19th, 2024
బుద్ధా వెంకన్న కిడ్నీలు దానం చేసినా ప్రయోజనం లేదు: వెల్లంపల్లి
- బుద్ధా వెంకన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు
- బుద్ధా వెంకన్న విచిత్ర వేషాలు కామెడీగా ఉన్నాయి
- బోండా ఉమా, బుద్ధా వెంకన్నను పిచ్చాస్పత్రికి పంపాలి
02:45 PM, Feb 19th, 2024
కాకినాడ
రాజకీయ స్వార్థం తో నాపై విమర్శలు చేస్తున్నారు: ఎమ్మెల్యే ద్వారంపూడి
- మత్స్యకార జాతిని గౌరవిస్తాను, ఆరాధిస్తాను
- జాతి అంటే కొండ బాబు కుటుంబం అని ఆ రోజే చెప్పాను
- మత్స్యకారులుకి ఎమ్మెల్సీ ఇప్పించడం లో నేను కృషి చేశాను
- కొండ బాబు మత్స్యకారులుకి ఏమి చేశాడు?
- మత్స్యకార జాతి లో నేను పుట్టకపోవచ్చు..వారి కోసం నేను తప్పిస్తాను
02:40 PM, Feb 19th, 2024
చంద్రబాబు సవాల్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పేర్నినాని
- చంద్రబాబు పిట్టల దొరలా ఊరూరా తిరిగి హామీలిచ్చాడు
- బందరులో ఓట్లు అడుక్కోవడానికి వచ్చి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు
- బందరు పోర్టును పూర్తిచేశావా చంద్రబాబు
- మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నావ్...మూడు గజాలైనా ఇచ్చావా?
- ఆక్వా హబ్ ను చేస్తానన్నావ్ చేశావా?
- హైదరాబాద్ నుంచి బందరుకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానన్నాడు చేశాడా
- గురివింద గింజకు ఒక్కచోటే మచ్చ ఉంటుంది
- చంద్రబాబుకు నిలువెల్లా మచ్చలే
- ఎన్నికల ముందు మాటిచ్చి ఓటేసిన తర్వాత మోసం చేసే గుణం ఉన్నోడే చంద్రబాబు
- ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట
- 99 శాతం హామీలు నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్రెడ్డి
- జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు
- 14 ఏళ్లలో చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్కపథకమైనా ఉందా?
- జగన్మోహన్రెడ్డికి సవాల్ విసిరే అర్హత చంద్రబాబుకు లేదు
02:20 PM, Feb 19th, 2024
టీడీపీ కుట్ర బట్టబయలు
- సోషల్ మీడియాలో ఫేక్ పోస్టుల ద్వారా వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం
- షర్మిలపై ఐటీడీపీ అసభ్య పోస్టింగ్‌లు
- వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సభ్యుడి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టి
- సోషల్ మీడియా ముసుగులో వైఎస్సార్సీపీపై విషం జిమ్మిన టీడీపీ
- టీడీపీ సానుభూతిపరుడు పినపాల ఉదయ్ భూషణ్ పేస్‌బుక్‌లో షర్మిల, నర్రెడ్డి సునీతపై జుగుప్సాకరంగా పోస్టింగ్‌లు
- ఫేక్ పోస్టులతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచేందుకు చంద్రబాబు ఎత్తుగడ
- ప్రజలు ఎప్పుడో మరిచిపోయిన కాంగ్రెస్‌ను జాకీలెత్తి లేపే ప్రయత్నం
01:42 PM, Feb 19th, 2024
అభివృద్ది పై చంద్రబాబుతోనైనా చర్చిస్తాం: దేవినేని అవినాష్
- రాష్ట్రంలో నిజమైన అభివృద్ది జగన్ హయాంలోనే జరిగింది
- తూర్పు నియోజకర్గంలోనే 650 కోట్ల అభివృద్ది జరిగింది
- కొండ ప్రాంతాలు..కరకట్ట ప్రాంతం ఏంతో అభివృద్ది చేశాం
- రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి ప్రజలకు అండగా నిలిచాం
- టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏ అభివృద్ధీ చేయలేదు
- గద్దె దిగజారుడు వ్యాఖ్యలు చేసి తన అక్కసు వెళ్లగక్కుతున్నారు
- ప్రభుత్వంపై, దేవినేని నెహ్రూపై గద్దె రామ్మెహన్ దిగజారి విమర్శలు చేస్తున్నారు
- దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి సంక్షేమం పై గద్దె రామ్మోహన్ చర్చకు రావాలి
- గద్దె తూర్పులో ఏం అభివృద్ది చేశాడో చెప్పాలి
- సెటిల్మెంట్ వారసుడు అని నా పై నోరుపారేసుకోవడం మానుకోవాలి
- మేము చేసిన అభివృద్ది పై చంద్రబాబుతోనైనా చర్చిస్తాం
- 70 ఏళ్ల గద్దె రామ్మోహన్ 35 ఏళ్ల నన్ను చూసి వణికిపోతున్నారు
- జీరో ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ చరిత్రలో నిలిచిపోతారు
- హెరిటేజ్ వ్యానులో గంజాయి తీసుకెళ్లింది టీడీపీ నేతలే
- కాల్ మనీ సెక్స్ రాకెట్, కాల్ నాగ్ అంటే గుర్తొచ్చేది గద్దె రామ్మోహన్
- గద్దె భండారం త్వరలోనే బయటపెడతాం
- సిద్ధం సభలు చూసి టీడీపి శ్రేణులు, దాని మిత్ర పక్షాలుకి మైండ్ బ్లాక్ అయింది
- నారా లోకేష్ అతనికి ఉన్న ఆస్తుల పై వివరణ ఇవ్వాలి
- చంద్రబాబు అక్రమ ఆస్తులు పేదలకు పంచాలి
తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ వ్యాఖ్యలు
01:09 PM, Feb 19th, 2024
అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా: అలీ
- వైఎస్సార్సీపీ ఆదేశిస్తే.. ఎన్నికల్లో పోటీ చేస్తా
- అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటా
- గుంటూరు, రాజమండ్రి, నంద్యాల ఏ స్థానం నుంచైనా పోటీకి సిద్ధం
- రాప్తాడు సభ చూశాక వైఎస్సార్సీపీ విజయం ఖాయమని అర్థమైపోయింది
సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ
12:40 PM, Feb 19th, 2024
బ్రాహ్మణి.. మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: గంజి చిరంజీవి
- లోకేష్ భార్య బ్రాహ్మణి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు
- 2014 నుంచి 2019 వరకు మీ మామ చంద్రబాబు నాయుడు చేనేతలకు ఏం చేశాడో చెప్పండి
- చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చేనేత పరిశ్రమంలో నాశనం చేశాడు
- ఇప్పుడొచ్చి మాయ మాటలు చెప్తే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు
వైఎస్సార్సీపీ మంగళగిరి ఇన్‌ఛార్జి గంజి చిరంజీవి కామెంట్స్
12:34 PM, Feb 19th, 2024
చంద్రబాబు ఛాలెంజ్.. కేశినేని నాని సూటి ప్రశ్నలు
- చంద్రబాబు ఛాలెంజ్‌కు.. కేశినేని నాని ప్రతి ఛాలెంజ్
- చంద్రబాబు స్టేట్మెంట్ చూశా
- ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాల్లో అభివృద్ధి పై చర్చకు సిద్ధమా? అన్నాడు
- అభివృద్ధి పై జగన్ వరకు ఎందుకు చంద్రబాబుతో చర్చించేందుకు నేను సిద్దం
- తాత్కాలిక సచివాయలం ఒకటి కట్టడం అభివృద్ధా?
- రాష్ట్రంలో సీఎం జగన్ కట్టిన 10వేలకు పైగా సచివాలయాలు అభివృద్ధా?
- చంద్రబాబు కుటుంబం, వారి అనుయాయులు ప్రభుత్వం సంపదను దోచుకోవడం అభివృద్ధా...?
- మానవ అభివృద్ధి కోసం చదువులు, ఆరోగ్యం,సంక్షేమం ఇలా చేయడం అభివృద్ధా..?
- చంద్రబాబు 45 ఏళ్ల ఇండ్రస్ట్రీ అంటాడు...అందులో స్వామిదాస్ 35 ఏళ్ల ఇండస్ట్రీ, నాది పదేళ్లు
- మేము చెబుతాం ప్రజలకు చంద్రబాబు నీది కాదు అభివృద్ధి.. సీఎం జగన్ దే అభివృద్ధి అని
- టీడీపీ పార్టీ ఈనాడు పేపర్ చేతుల్లో ఉంది
- రామోజీరావు 2 వేల ఎకరాల కోటలో నుంచి ఆంధ్రాను చూస్తాడు
- పేదలను బెదిరించి, ముఖ్యమంత్రు లను లొంగ తీసుకున్న రామోజీరావుకు ఆయన టాయిలెట్ అంత ఉండదు మన అభివృద్ధి
- 2వేల ఎకరాల కోట అందులోనే ఎయిర్ డ్రోమ్ ,ఫిల్మ్ సిటీ ఇవన్నీ రామోజీరావు అభివృద్ధి
- చంద్రబాబు చేసేవి మాత్రమే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5,సోషల్ మీడియా, అమెరికాలో ఉండే కుహనా మేధావులకు అభివృద్ధిలా కనిపిస్తాయి
- తిరువూరు నియోజకవర్గానికి 2,200 కోట్లు సంక్షేమం, అభివృద్ధి పథకాల పేరుతో ప్రజలకు అందాయి ఇది కాదా చంద్రబాబు అభివృద్ధి
12:02 PM, Feb 19th, 2024
విశాఖలో పవన్ రెండో రోజు పర్యటన
- సీట్ల సర్దుబాటు పై కసరత్తు చేస్తున్న జనసేనాని
- అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పవన్
- నిన్న కొణతాలతో ప్రత్యేకంగా సమావేశమైన పవన్
- ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం నేతలతో భేటీ
- పోటీకి సిద్ధపడుతున్న పలువురు జనసేన నేతలు
- విశాఖ దక్షిణం నుంచి ఎమ్మెల్సీ వంశీకృష్ణ
- పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు
- గాజువాక నుంచి సుందరపు సతీష్ కుమార్
- అనకాపల్లి ఎంపీగా పోటీకి నాగబాబు ఆసక్తి.. పోటీకి దిగుతానంటున్న కొణతాల రామకృష్ణ
11:31 AM, Feb 19th, 2024
మరోసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విచారణ
- మధ్యాహ్నం గంటలకు హాజరుకావాలంటూ స్పీకర్ నోటీసులు
- నోటీసుల్లో తుది విచారణగా పేర్కొన్న స్పీకర్ తమ్మినేని సీతారాం
- రాకపోతే.. ఇప్పటివరకు జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టీకరణ
- వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన కోటంరెడ్డి, ఆనం, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవి
- ఫిరాయింపు ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణలకు సైతం నోటీసులు
- విచారణకు హాజరవుతారా ? లేదా ? అనే దానిపై సందిగ్థత
11:02 AM, Feb 19th, 2024
బాబును నమ్ముదామా? వద్దా?.. బీజేపీ నిర్ణయంపై ఆసక్తి
- ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్టానం తేల్చే అవకాశం
- ఒకట్రెండు రోజుల్లో రానున్న స్పష్టత
- రాష్ట్ర నాయకత్వానికి క్లారిటీ ఇవ్వనున్న హైకమాండ్
- చంద్రబాబును నమ్మాలా? వద్దా? అనే అనుమానంలో బీజేపీ
- పవన్ కల్యాణ్ కూడా విశ్వసనీయమైన మిత్రుడు కాదన్నయోచనలో కమలనాథులు
- అయినా సరే, పొత్తు పెట్టుకుందామంటోన్న బాబు, పవన్
- విశాఖ టూర్ తర్వాత ఢిల్లీకి వెళ్లే యోచనలో పవన్
- పిలిస్తే క్షణంలో ఢిల్లీకి వస్తానంటున్న బాబు
- ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న బీజేపీ నేతలు
- ఏపీలో పార్టీ పరిస్థితిపై అధిష్టానానికి వివరించిన బీజేపీ నేతలు
- హైకమాండ్ నిర్ణయం పై ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ బీజేపీ నేతలు
10:42 AM, Feb 19th, 2024
అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు: లక్ష్మీపార్వతి
- మహిళకు సాధికారత అందిస్తేనే సమాజం వృద్ధి చెందుతుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మారు
- రామ్ మనోహర్ లోహియా మహిళా పక్షపాతి
- జగన్ మోహన్ రెడ్డి మహిళా సంస్కర్త
- ఇందిరాగాంధీ మహిళల స్థితి గతులు తెలుసుకునేందుకు రామచంద్రగుహ కమిటీ వేశారు
- రామచంద్రగుహ కమిటీ ఓ నివేదిక ఇచ్చినా మహిళల ఇబ్బందులు మారలేదు
- 16 ఏళ్ల ఇందిరాగాంధీ పాలనలో కూడా మహిళల స్థితిగతులు మారలేదు
- ఇందిరాగాంధీ చేయలేని పనిని జగన్ మోహన్ రెడ్డి చేసి చూపించారు
- మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కింది
- మహిళల కోసం తొలిసారిగా పద్మావతి యూనివర్శిటీని ఎన్టీఆర్ స్థాపించారు
- మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు
- ఎన్టీఆర్ తర్వాత మహిళల సాధికారితకు కృషి చేసింది నాడు వైఎస్సార్.. నేడు వైఎస్ జగన్
- మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేసిన సీఎం భారతదేశంలో జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే
- ప్రజలు మంచి మనసుతో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి
- రాబోయే 15 ఏళ్లపాటు ఇదే ప్రభుత్వం ఉంటే ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలుస్తుంది
- భారతదేశ చరిత్రలో విద్యకు ఇంత ప్రాధాన్యం ఇచ్చిన ఒకే ఒక్కరు జగన్
- వయసులో చిన్నవాడే అయినా జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు చాలా గొప్పవి
- జగన్ మోహన్ రెడ్డి ఒక వ్యవస్థ
- అణగారిన వర్గాలకు గుర్తింపునిచ్చిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి
- పేదలు.. మహిళల అభ్యున్నతికి ఒక మహర్షిలా జగన్ పాటు పడుతున్నారు
- జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మంచి పనులను మనమంతా అందరికీ చెప్పాలి
- గత ఐదేళ్లలో రూ. 6 లక్షల కోట్లు లూటీ జరిగింది
- అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు
- చంద్రబాబు బాధితుల్లో నేను,నాభర్త ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాం
- ఆడవారంటే చంద్రబాబుకి అసహ్యం
- జగన్ మోహన్ రెడ్డిని తిట్టడానికే చంద్రబాబు మీటింగ్ లు పెడుతున్నాడు
- మంచి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి కావాలో ప్రజలు ఆలోచించాలి
- చంద్రబాబు ముసలోడైపోయాడు.. మూడుకాళ్లొచ్చేశాయి
- తన కొడుకుని సీఎం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు
- పొరబాటున ప్రభుత్వం మారితే ఏపీ పూర్తిగా దోపిడీకి గురవుతుంది
:::తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు
09:58 AM, Feb 19th, 2024
మైలవరం టీడీపీలో ముసలం
- ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మళ్లీ వేడెక్కిన రాజకీయం
- వసంత వర్సెస్ దేవినేని ఉమాగా మారిన పరిణామాలు
- టికెట్ విషయంలో ఎవరికీ క్లారిటీ ఇవ్వని టీడీపీ అధిష్టానం
- సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేవినేని ఉమా వర్గం
- మైలవరంలో ఎన్నికల ప్రచారానిని ఉమా నిర్ణయం
- 21 నుంచి అన్నరావుపేట నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ప్లాన్
09:28 AM, Feb 19th, 2024
‘నాగబాబుకి ఇవ్వడమేంటండి!’
- ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన లో రేగుతున్న చిచ్చు
- నాగబాబు పవన్ పర్యటనకు కొణతాల రామకృష్ణ డుమ్మా
- నాగబాబు విశాఖ అనకాపల్లి పర్యటనలకు కొణతాల దూరం
- నిన్న విశాఖ వచ్చిన పవన్ ను కలవని కొణతాల
- అనకాపల్లి ఎంపీ సీటు నాగబాబుకి ఇవ్వడం పై కొణతాల అసంతృప్తి
- జిల్లాలో తనకు తెలియకుండా పర్యటించడంపైన ఆగ్రహం
- కొణతాల ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్
08:55 AM, Feb 19th, 2024
వన్స్ మోర్ జగన్
- రాప్తాడు సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్
- రాయలసీమ వ్యాప్తంగా తరలివచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు
- వన్స్ మోర్ జగన్ అంటూ నినదించిన వైఎస్సార్ సీపీ క్యాడర్
- భీమిలి, దెందులూరు, రాప్తాడు సభలు విజయవంతం కావటంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్త కూ అండగా ఉంటానన్న సీఎం జగన్
- ప్రత్యర్థులపై పంచులు గుప్పించిన సీఎం జగన్.. సర్వత్రా చర్చ
08:25 AM, Feb 19th, 2024
పవన్.. మళ్లీ భీమవరమేనా?
- ఉమ్మడి తూర్పు గోదావరిలో నేడు పవన్ కల్యాణ్ పర్యటన
- పార్టీ కీలక నేతలతో సమావేశం
- రేపు భీమవరానికి పవన్
- రెండు రోజులపాటు భీమవరంలోనే పవన్ మకాం
- భీమవరం నుంచే పవన్ పోటీ చేస్తాడనే ప్రచారం
08:12 AM, Feb 19th, 2024
జగన్ పంచులు.. వర్మ మాస్ ట్రోలింగ్
- ఏపీ పొత్తు రాజకీయాలపై తనదైన శైలిలో ఆర్జీవీ సెటైర్లు
- టీ గ్లాస్ సింక్‌లో పడేసిన వీడియో పోస్ట్ చేసిన వర్మ
- రాప్తాడు సిద్ధం సభలో ప్రతిపక్షాలపై సీఎం జగన్ పంచులు
- ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి.. గ్లాస్ సింక్ లో ఉండాలన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ
- జనసేనపై సీఎం జగన్ పంచ్‌ను ఇలా చూపించిన వర్మ
— Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2024
07:43 AM, Feb 19th, 2024
ఫుల్ జోష్‌తో వైఎస్సార్సీపీ సిద్ధం
- భారీ సభలతో దూసుకువెళ్తున్న వైఎస్సార్సీపీ
- చరిత్ర సృష్టించిన నిన్నటి రాప్తాడు సిధ్దం సభ
- ఇప్పటికే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో సిద్ధం సభలు పూర్తి
- త్వరలోనే పల్నాడు జిల్లాలో మరో సిద్ధం సభ ఉండే అవకాశం
- ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా సాగుతున్న సభలు
- పార్టీ నేతలు, క్యాడర్ లో ఫుల్ జోష్
07:02 AM, Feb 19th, 2024
మారణాయుధాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి
- పల్నాడు జిల్లా మంచికల్లు గ్రామంలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
- పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు
- మేకపోతుల ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి విషమం
- ప్రశాంతంగా ఉన్న పల్నాడులో గొడవలను రెచ్చగొడుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఫైర్
06:58 AM, Feb 19th, 2024
రాప్తాడు సిద్ధం సభపై ఆర్జీవీ ట్వీట్
- సముద్రాన్ని తలపించిన రాప్తాడు సిద్ధం సభ
- వైఎస్సార్సీపీ బహిరంగ సభపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందన
- సీఎం జగన్ సిద్ధం సభను చూసి ఆశ్చర్యపోయానంటూ ట్వీట్
- పది లక్షల మందికిపైగా హాజరై ఉంటారని వర్మ అంచనా
- దేశంలోనే అతిపెద్ద సభ కాబోలు అంటూ ఆశ్చర్యం
In the DRY region of Rayalaseema suddenly a OCEAN emerged and this is a ocean of nearly 10 LAKH people who came to attend a meeting of @ysjagan and this is the BIGGEST gathering ever in the political HISTORY of india https://t.co/woJ5M9t3wQ
— Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2024
06:41 AM, Feb 19th, 2024
సోషల్ మీడియాలోనూ సిద్ధమా?: సీఎం జగన్
- ఎన్నికల వేళ.. కపట వాగ్ధానాలు చేస్తున్న చంద్రబాబు
- ఎల్లో మీడియా తప్పుడు కథనాలు
- అంతటిని ఎండగట్టడానికి సోషల్ మీడియా సైన్యమంతా సిద్ధమా? అంటూ సీఎం జగన్ పిలుపు
- సోషల్ మీడియాలో ప్రభుత్వంపై పచ్చమంద చేస్తున్న దుష్ప్రచారాన్ని మీ సెల్‌ఫోన్ ద్వారా తిప్పికొట్టాలని పార్టీ కేడర్‌ను పిలుపు
చంద్రబాబు కపట వాగ్ధానాలు, ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ఎండగట్టడానికి మన సోషల్ మీడియా సైన్యమంతా సిద్ధమా?
సోషల్ మీడియాలో మన ప్రభుత్వంపై పచ్చమంద చేస్తున్న దుష్ప్రచారాన్ని మీ సెల్‌ఫోన్ ద్వారా తిప్పికొట్టండి! #Siddham pic.twitter.com/p9d0j2lCv8— YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2024
06:36 AM, Feb 19th, 2024
పవన్ బుజ్జగింపు పర్వం
- మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇంటికి పవన్ కల్యాణ్
- అభ్యర్ధుల ఎంపికపై కొణతాలతో సమావేశమైన పవన్ కల్యాణ్
- ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా కొణతాల నివాసానికి పవన్
- అనకాపల్లిలో నాగబాబు టూర్ కు దూరంగా ఉన్న కొణతాల
- నిన్న కొణతాల ఇంటికి వెళ్లిన నాగబాబు
- ఆసక్తిగా మారిన కొణతాల, పవన్ సమావేశం
- అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా నాగబాబు పేరు ప్రచారం కావడంతో పవన్-కొణతాల భేటీకి ప్రాధాన్యత
06:30 AM, Feb 19th, 2024
ఎవరు పోటీలో ఉన్నా.. మనకే ప్రజల బ్రహ్మరథం: సీఎం జగన్
- పార్టీ క్యాడర్ని ఉద్దేశించి వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి
- మన పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటా
- అలానే ప్రజాసేవలో ఉన్న వారికి మరో రెండు మెట్లు పైకి ఎక్కే అవకాశం కల్పిస్తా
- ఈ ఐదేళ్లు ప్రజలకు మంచి పాలన అందించాం
- కాబట్టి, మనలో ఎవరు పోటీలో ఉన్నా ప్రజలు బ్రహ్మరథం పడతారు
మన @YSRCParty కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటా…
అలానే ప్రజాసేవలో ఉన్న వారికి మరో రెండు మెట్లు పైకి ఎక్కే అవకాశం కల్పిస్తా…
ఈ ఐదేళ్లు ప్రజలకు మంచి పాలన అందించాం. కాబట్టి, మనలో ఎవరు పోటీలో ఉన్నా ప్రజలు బ్రహ్మరథం పడతారు!#Siddham pic.twitter.com/wny9gwiYnj— YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2024