Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. March 13th : ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్
ADVERTISEMENT 

March 13th : ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Politics Sakshi User Sakshi Sakshi Time Mar 13, 2024 Sakshi Read Time Read Time: 13 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
AP-politics.jpg

AP Elections Political Latest Updates Telugu

8:47 PM, Mar 13th, 2024

సమన్వయకర్తలు, నేతలతో సీఎం జగన్ సమావేశం

  • తాడేపల్లి: వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, నేతలతో సీఎం జగన్ సమావేశం
  • నగరి, నరసరావుపేట, సత్తెనపల్లి సమన్వయకర్తలు, స్థానిక నేతలతో సమావేశం
  • పార్టీ గెలుపునకు ఉమ్మడిగా కృషి చేయాలన్న సీఎం జగన్
  • గతం కంటే ఎక్కువ మెజారిటీలు వచ్చేలా చూడాలన్న సీఎం
  • సీఎం సూచనలతో ఆ దిశగా పని చేస్తామన్న నేతలు

8:38 PM, Mar 13th, 2024

ఏలూరు జిల్లా: వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు

  • పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు
  • టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల నుంచి వెయ్యి మంది కార్యకర్తలు చేరిక
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి 
  • డ్వాక్రా, రైతుల రుణాలు, మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశాడు: ఎంపీ మిథున్ రెడ్డి
  • నిరుద్యోగ భృతి అంటూ వారిని మోసం చేశాడు
  • జన్మభూమి కమిటీల పేరుతో పేదలను దోచుకున్నారు
  • గతంలోనూ చంద్రబాబు ఉన్నప్పుడు ఇదే బడ్జెట్
  • సీఎం జగన్ లేకపోతే రానున్న రోజుల్లో పథకాలు ఆగిపోతాయి
  • సచివాలయాలు, జన్మభూమి కమిటీలకు అడ్డాగా మారిపోతాయి
  • వాలంటీర్లు వ్యవస్థను తొలగిస్తారు
  • టీడీపీ, జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో 11మంది టీడీపీ అభ్యర్థులే
  • బీజేపీ పేరుతో పోటీ చేసేవారు కూడా టీడీపీ అభ్యర్థులే
  • కాంగ్రెస్ కూడా తెలుగుదేశం పార్టీకి కోవర్ట్‌గా పనిచేస్తుంది
  • చంద్రబాబు మనుషులే అన్ని పార్టీల్లో ఉంటారని గమనించాలి
  • అన్ని పార్టీలు ఏకమై సీఎం జగన్‌పై కుట్రలు చేస్తున్నాయి
  • సీఎం జగన్‌ పొత్తు ప్రజలతోనే.. ఏ పార్టీని నమ్ముకో లేదు

7:42 PM, Mar 13th, 2024

సంక్షేమ సారధి.. అభివృద్ధి వారధి మన జగనన్న: పోలవరం సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి

  • సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచారు
  • సంక్షేమ అభివృద్ధి రెండు కళ్లుగా 58 నెలల పాలన సాగించారు
  • వివక్షత.. అవినీతికి తావు లేకుండా పాలన సాగించారు
  • రాష్ట్రంలో అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదు
  • మొద్దు నిద్రలో ఉన్న ప్రతిపక్షానికి అభివృద్ధి కళ్లకు కనపడదు
  • జగనన్న మీద బురద జల్లుతూ ఎత్తులు, పొత్తులు.. జిత్తులతో గుంటనక్కల్లా వస్తున్నారు
  • జగనన్న ఎదుర్కోలేక నాలుగైదు జండాలు కట్టుకొని వస్తున్నారు
  • పోలవరం గడ్డ జగనన్న అడ్డా
  • పోలవరం నియోజకవర్గాన్ని గెలిచి జగనన్నకు గిఫ్ట్‌గా ఇస్తాం

7:03 PM, Mar 13th, 2024

పల్నాడు జిల్లా: వినుకొండలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్

  • మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్లిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
  • అనుమతి లేకుండా ర్యాలీగా ఒక్కసారిగా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వైపు దూసుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు
  • అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం
  • పోలీసులను నెట్టేసి వారి చేతిలో ఉన్న లాఠీలను లాక్కోడానికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు 
  • పోలీసులపైన దౌర్జన్యం

5:16 PM, Mar 13th, 2024

టీడీపీ, జనసేన మధ్య వింత డ్రామా

  • జనసేన సీట్లు కూడా టీడీపీ నేతలకే
  • టీడీపీ నుండి నేతలను పంపిస్తున్న చంద్రబాబు
  • వారినే పార్టీలో చేర్చుకుని సీట్లు ఇస్తున్న పవన్ కల్యాణ్‌
  • నిన్న భీమవరం, నేడు తిరుపతి 
  • జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే అంజిబాబు
  • అంజిబాబుకి భీమవరం ఎమ్మెల్యే సీటు ఖరారు చేసిన పవన్ కల్యాణ్‌
  • ఈ రోజు జనసేనలో చేరిన టీడీపీ నేత గంటా నరహరి
  • తిరుపతి అసెంబ్లీ సీటు గంట నరహరి కి ఖరారు చేసిన పవన్ కల్యాణ్‌
  • నరసాపురంలోనూ ఇదే పంథా
  • టీడీపీ నుంచి జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడికి సీటు ఖరారు
  • ఇదేం పొత్తు అంటూ పవన్‌పై జనసేన నాయకుల ఆగ్రహం

4:48 PM, Mar 13th, 2024

ఈ నెల 18 నుంచి సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం

  • ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం ప్రారంభించే అవకాశం
  • తొలిరోజు ఇచ్చాపురం, విజయవాడ వెస్ట్‌, నెల్లూరు రూరల్‌లో సీఎం జగన్ ప్రచారం
  • రోడ్ షో కూడా ఉండే అవకాశం
  • రోజూ రెండు మూడు బహిరంగ సభలు, రోడ్ షోలు ఉండేలా ప్లాన్
  • ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలను కవర్ చేసేలా రూట్ మ్యాప్

4:35 PM, Mar 13th, 2024

బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి పరాభవం

  • చంద్రబాబు నివాసానికి వచ్చిన బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి
  • చంద్రబాబుని కలిసేందుకు అనుమతి లేదంటూ గేటు వద్ద నిలిపేసిన పోలీసులు
  • బీజేపీ నుంచి జమ్మలమడుగు టికెట్ ఆశిస్తున్నా ఆదినారాయణరెడ్డి
  • టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వొద్దని చెపుతున్న బీజేపీ సీనియర్ నేతలు
  • ఈ రోజు బీజేపీ కార్యాలయంలో ఇదే అంశంపై భేటీ అయినా బీజేపీ పెద్దలు
  • చంద్రబాబు ద్వారా టిక్కెట్ కోసం మంతనాలు చేయాలని వచ్చిన ఆదినారాయణరెడ్డి

3:59 PM, Mar 13th, 2024

ఏపీ బీజేపీలో ముసలం

  • పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతపై బీజేపీ సీనియర్లలో అసంతృప్తి
  • అనకాపల్లి, ఏలూరు ఎంపీ రేసులో టీడీపీ నుంచి వచ్చిన సీఎం రమేష్, సుజనా చౌదరి పేర్లపై ఆగ్రహం
  • నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా రఘురామకృష్ణంరాజుని ప్రచారం చేస్తుండటంపైనా తీవ్ర అసంతృప్తి
  • అరకుకి కొత్తపల్లి గీత,రాజమండ్రికి పురందేశ్వరి అంటూ ఎల్లో మీడియా లీకులు
  • ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతల రహస్య సమావేశం
  • కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవడం సీనియర్లు మండిపాటు
  • జీవీఎల్, సోము వీర్రాజు లాంటి సీనియర్ల పేర్లు లేకుండా టీడీపీ కుట్రలపై చర్చిస్తున్న సీనియర్లు
  • చంద్రబాబు కోసం పనిచేసే నేతలకి సీట్ల ప్రాధాన్యతపై చర్చ
  • పార్టీలో మొదటి నుంచి పనిచేసేవారికి ప్రాధాన్యతనివ్వాలంటున్న సీనియర్లు

3:55 PM, Mar 13th, 2024

పశ్చిమగోదావరి: ఉండి టీడీపీలో ముసలం

  • సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వివాదం
  • టీడీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు
  • 20 ఏళ్ల నుంచి టీడీపీకి నిబద్ధతతో పనిచేశా: శివరామరాజు
  • నా అభిప్రాయం తీసుకోకుండా అభ్యర్థిని ప్రకటించారు
  • త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తా

     

3:22 PM, Mar 13th, 2024

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత గండి రవికుమార్‌

  • సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్‌
  • రవికుమార్‌తో పాటు వైఎస్సార్‌సీపీలోకి చేరిన స్ధానిక టీడీపీ నేత డెడ్డెం ప్రసాదరావు
  • పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, వైఎస్సార్‌సీపీ స్టేట్‌ జాయింట్‌ సెక్రటరీ భగవాన్‌ జయరామ్‌.

2:55 PM, Mar 13th, 2024

2014లో పొత్తులతో గెలిచిన చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేశారు?: ఎంపీ మార్గాని భరత్‌

  • యువత చదువుకోవడానికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని చంద్రబాబు అంటున్నారు
  • అంటే.. అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి పథకాలన్నీ రద్దు చేస్తారా?
  • మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు ఎలా చదువుకోవాలి?
  • పిల్లల చదువులతో ప్రభుత్వానికి పనిలేదా?
  • బాబు వస్తేనే జాబు వస్తుందన అప్పట్లో ప్రచారం చేసి, చివరికి ఆయన కొడుక్కి మాత్రమే పదవులు ఇచ్చుకున్నారు 
  • నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిలువునా మోసం చేశారు
  • ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ప్రమాణస్వీకారం చేయనని చెప్పుకున్నారు
  • మరి ప్రత్యేకహీదా ఇస్తేనే ప్రమాణస్వీకారం చేస్తానని ఎందుకు అనలేదు?
  • చంద్రబాబు చేసిన ధర్మపోరాటాల దీక్షలు ఏం అయ్యాయి?
  • టీటీడీ డబ్బులతో ఢిల్లీలో సభలు పెట్టి ఏం సాధించారు?
  • పాచిపోయిన లడ్డూలు అన్న పవన్ ఇప్పుడు ఏ ముకం పెట్టుకుని బీజేపీ తో కలిశారో కూడా చెప్పాలి
  • అసలు బ్యాంకు లోన్ అనే పదం చంద్రబాబు నోట ఎందుకు వచ్చింది?
  • రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అని మోసం చేశారు
  • చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం మోసానికి గురవ్వని వర్గం లేదు
  • 2014లో పొత్తులతో గెలిచిన చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేశారు?
  • నిలువునా రాష్ట్రాన్ని మోసం చేశారా లేదా?
  • జగన్ కేంద్రంతో పొత్తు లేకపోయినా ఏపీకి జగన్ ఎన్ని అభివృద్ధి పనులు చేశారో కనపడటం లేదా? 
  • జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలు కనపడటం లేదా?

2:42 PM, Mar 13th, 2024

జరిగిన మేలు చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా:  కమ్యూనిస్ట్‌ నేత కత్తి పద్మ

  • కమ్యూనిస్టు నేతలుగా మేమంతా పోరాటం చేసేది పేద ప్రజల మేలుకోసమే..
  • ఈ ప్రభుత్వంలో పేద ప్రజలకు మేలు జరుగుతుంది..
  • ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి..
  • ఇల్లు లేని వారికి జగన్ ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది..
  • ఇల్లు తీసుకున్న లబ్ధిదారుల్లో గీతాంజలి ఒకరు..
  • ఆమెకు జరిగిన మేలు చెప్పినందుకు ఈ సోషల్ మీడియా మూకలు ఆమెపై మానసికంగా దాడి చేసి ఆమెను హత్య చేశాయి..
  • గీతాంజలిని ట్రోల్‌ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
  • చట్ట ప్రకారం వారిపై తగు చర్యలు తీసుకోవాలి
  • ట్రోల్ చేయమని పార్టీలు డబ్బులు ఇచ్చి వారిని ప్రేరేపిస్తున్నాయి
  • అందుకే ఇంతటి ఘోరం జరిగింది
  • గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయం ప్రకటించడం మంచి పరిణామం
  • ఎవరు అవునన్నా కాదన్నా ఈ ప్రభుత్వంలో పేదలకు మంచి జరుగుతుంది.

2:25 PM, Mar 13th, 2024

టీడీపీలో గుర్తింపు లేదు: మాజీ ఎమ్మెల్యే శివ రామరాజు

  • ఉండి టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివ రామరాజు ఆవేదన 
  • టీడీపీ కోసం కష్టపడి పని చేసినా పార్టీలో తగిన గుర్తింపు లేదు
  • 2024 ఎన్నికల్లో టికెట్ ఇస్తారని ఆశించాను. 
  • టికెట్ అడిగినా కనీసం చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన లేదు.
  • టీడీపీ కోసం నిబద్ధతతో పనిచేసినా కనీసం గౌరవ ఇవ్వలేదు.
  • గతంలో దేశంలోనే ఉత్తమ ఎమ్మెల్యేగా నాకు అవార్డు వచ్చింది.
  • సర్వేల్లో సైతం భారీ మెజారిటీతో గెలుస్తానని అధిష్టానానికి తెలుసు
  • ఈ 15 రోజుల్లో అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
  • ఉండి నియోజకవర్గంలో ప్రజాఅభీష్టం మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను
  • ఏ ప్లాట్‌ఫామ్‌ మీద పోటీ చేయనున్నానో రెండు రోజుల్లో ప్రకటిస్తాను. 

     

2:10 PM, Mar 13th, 2024

టీడీపీ, జనసేన ఆత్మగౌవరం లేని పార్టీలు: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ 

  • మోదీకి రాష్ట్రాన్ని దారాదత్తం చేయడానికి చంద్రబాబు, పవన్ సిద్ధమయ్యారు.
  • మోదీని పల్లకిలో ఇద్దరు నేతలు మోస్తున్నారు.
  • పదేళ్లలో రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమిటో చెప్పాలి.
  • రాష్ట్రానికి అన్యాయం చేశారని బయటకు వచ్చామని చంద్రబాబు చెప్పారు.
  • చంద్రబాబుకు నీతి నిజాయితీ లేవు.
  • టీడీపీ-జనసేన కార్యకర్తల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు.
  • చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కలుస్తున్నారు.
  • టీడీపీ-జనసేన కార్యకర్తలు కోపంతో రగిలిపోతున్నారు.
  •  స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం ఎందుకు చంద్రబాబు, పవన్ మాట్లాడడం లేదు.
  • రైల్వే జోన్ కూడా ఇవ్వలేదు, పోలవరానికి నిధులు ఇవ్వలేదు.
  • టీడీపీ-బీజేపీ-జనసేనది విద్రోహ కూటమి.
  • రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో చంద్రబాబు ఎలా కలిశారు.
  • వీరి పొత్తు రాష్ట్రాన్ని ముంచేస్తుంది.
  • 21 సీట్లు తీసుకోవడాన్ని చూసి జనసేన నేతలు సిగ్గు పడుతున్నారు.
  • ఆత్మ గౌరవంలేని పార్టీలు టీడీపీ-జనసేన.
  • ఆత్మ గౌరవంలేని పార్టీలు ఉంటే ఎంత? లేకుంటే ఎంత?. 

     

1:50 PM, Mar 13th, 2024

లోక్‌సభ బరిలో కేఏ పాల్‌

  • ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ
  • విశాఖ నుంచి బరిలో కేఏ పాల్‌
  • కేఏ పాల్‌ పోటీపై స్పష్టతనిచ్చిన బాబూ మోహన్‌
  • కేఏ పాల్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్న బాబూ మోహన్‌

1:20 PM, Mar 13th, 2024

టీడీపీ మహిళా నేతల ఆందోళన..

  • కడప ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ మహిళా నేతల ఆందోళన.
  • కడప టీడీపీ ఇంచార్జ్ మాధవి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు.
  • మాధవికి కడప టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్ కార్యకర్తలు.
  • తమను పట్టించుకోని నాయకులు తమకు వద్దంటూ ఒంటి కాలిపై నిలబడి, కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన.
  • నాన్ లోకల్ లీడర్లు వద్దని, లోకల్ లీడర్ల నాయకత్వం కావాలని మహిళల నిరసనలు. 

     

1:00 PM, Mar 13th, 2024

పవన్‌కు మంత్రి జోగి రమేష్‌ స్ట్రాంగ్ కౌంటర్

  • పవన్ రాజకీయ అజ్ఞాని 
  • పార్టీ పెట్టాడు ముఖ్యమంత్రిని అవుతానన్నాడు
  • పొత్తన్నాడు 60 సీట్ల మనవే అన్నాడు
  • 60 నుంచి 24 సీట్లకు వచ్చాడు
  • ఇప్పుడు 24 నుంచి 21 సీట్లకు వచ్చాడు
  • ఆ 21 సీట్లలోనైనా పోటీచేయడానికి అభ్యర్ధులున్నారా?.
  • రేపు జరిగే ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం
  • మంచితనానికి దుర్మార్గులైన చంద్రబాబు, పవన్, బీజేపీకి మధ్య జరిగే యుద్ధం
  • ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీలను ప్రజలు కృష్ణానదిలో కలిపేయడం ఖాయం 
  • 2014లో ముగ్గురూ కలిసొచ్చారు.. విడిపోయారు 
  • మళ్లీ ఇప్పుడు ముగ్గురూ కలిసి వస్తున్నారు 
  • చంద్రబాబు, పవన్, బీజేపీలకు విలువలు, విశ్వసనీయత లేవు
  • లెక్కాలేదు .. తిక్కా లేదు
  • చంద్రబాబు కుప్పంలో, లోకేష్ మంగళగిరిలో ఓడిపోతారు
  • ఎక్కడ పోటీచేస్తాడో తెలియని పవన్ అసెంబ్లీ గేటు కూడా దాటలేడు 
  • చంద్రబాబు, పవన్ పనికిరాని వ్యక్తులు. 
  • యుద్ధంలో పోటీచేయమంటే అస్త్ర సన్యాసం చేసిన వ్యక్తి పవన్ 
  • 175 చోట్లా పోటీచేయమంటే చంద్రబాబు పారిపోయాడు 
  • కనీసం 50 చోట్లైనా అభ్యర్థులను పెట్టమంటే పవన్ పారిపోయాడు
  • టీడీపీ, జనసేన, బీజేపీలకు అడ్రస్ లేకుండా చేస్తాం ఇది రాసిపెట్టుకోండి 
  • 175 స్థానాల్లో 175 వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తాం 
  • చంద్రబాబు, పవన్ హైదరాబాద్ పారిపోతారు
  • బీజేపీ ఢిల్లీ పారిపోతుంది
  • ఏపీలో ఉండే ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ.. ఏకైక నాయకుడు సీఎం జగన్‌. 

     

12:45 PM, Mar 13th, 2024

అభిమానులకు ముద్రగడ మరో లేఖ

  • తన అభిమానులకు ముద్రగడ లేఖ
  • ఈనెల 14న సీఎం జగన్ సమక్షంలో చేరిక వాయిదా
  • ఈనెల 15, లేదా 16 వ తేదిన ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో  పార్టీలో చేరిక.
  • సెక్యూరిటీ ఇబ్బందుల దృష్ట్యా తనతో ఎవరూ రావొద్దని అభిమానులకు మనవి చేసిన ముద్రగడ

12:30 PM, Mar 13th, 2024

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన

  • ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం వైఎస్ జగన్
  • ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించే అవకాశం
  • ఇప్పటికే  అభ్యర్థుల లిస్టు దాదాపు ఖరారు
  • ఒకటి, రెండు మార్పులతో ఫైనల్ లిస్టు
  • వైఎస్సార్ ఘాట్ వద్ద అధికారికంగా ప్రకటించనున్న పార్టీ అధినేత జగన్
  • అనంతరం ఎన్నికల ప్రచారంలోకి దిగనున్న వైఎస్ జగన్

12:10 PM, Mar 13th, 2024

జేసీ ప్రభాకర్‌కు భయం పట్టుకుంది: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 

  • నేను ఓడినా .. గెలిచినా తాడిపత్రిలోనే ఉంటా
  • టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఓడిపోతే దేశం వదిలిపెట్టిపోతాడు 
  • మహిళను మోసం చేసిన టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జునకు జేసీ మద్దతు ఇస్తున్నారు 
  • జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంత వరకు కౌన్సిలర్ మల్లికార్జునను మంద లించలేదు 
  • తనకు అన్యాయం జరిగిందని జేసీ ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళితే బాధితురాలిపై జేసీ దురుసుగా ప్రవర్తించారు 
  • మహిళకు అన్యాయం జరుగుతే మహిళలు వెంట ఎవరైనా ఉంటారు, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి వారి కౌన్సిలర్ వెంటా ఉన్నాడు 
  • కౌన్సిలర్ పోతే జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ పదవి పోతుందని భయపడుతున్నాడు

11:55 AM, Mar 13th, 2024

అందరూ ప్రజా సేవకులే: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

  • ముఖ్యమంత్రి దగ్గర్నుంచి వలంటీర్ల దాకా అంతా ప్రజా సేవకులే 
  • అవినీతి రహిత పాలనే ధ్యేయంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు
  • మా ప్రభుత్వంలో ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప రికార్డ్
  • సచివాలయాల వద్దనే ఎరువులు, విత్తనాల దుకాణం ఏర్పాటు  
  • ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపించేలా చేశాం

11:40 AM, Mar 13th, 2024

పవన్‌కు మంత్రి అమర్నాథ్‌ కౌంటర్‌

  • సీఎం జగన్ ఆదేశం మేరకు గాజువాకలో పోటీ చేస్తా
  • గాజువాక నేను పుట్టి, పెరిగిన సొంత నియోజకవర్గం
  • మా తాత, తండ్రి అక్కడ గెలిచారు
  • నేను కూడా సీఎం జగన్ ప్రజాదరణతో గెలుస్తాను. 
  • పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తారా లేదో తెలియదు
  • ప్రత్యర్థి ఎవరైనా మాకు నష్టం లేదు
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దొంగలు ఎవరో తేలింది
  • టీడీపీ, జనసేన స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి
  • ఇప్పుడు స్టీల్‌ప్లాంట్ కార్మికులు, విశాఖ ప్రజలు మూడు పార్టీలకు బుద్ధి చెప్తారు
  • పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని చంద్రబాబు నాశనం చేశాడు
  • పొత్తులో చంద్రబాబు తగ్గించుకోవాల్సిన సీట్లు పవన్ తగ్గించుకున్నారు
  • జనసేన నాయకులు, కార్యకర్తల జీవితాలను పవన్ నాశనం చేశారు
  • సీఎం జగన్‌ను ఓడించడం అన్నది పవన్ కాదు ఎవ్వరి వల్ల సాధ్యం కాదు

11:20 AM, Mar 13th, 2024

ఆడబిడ్డకు అన్యాయం చేస్తున్న జేసీ ప్రభాకర్‌

  • నేను ఓడినా .. గెలిచినా తాడిపత్రి లోనే ఉంటా
  • జేసీ ప్రభాకర్ రెడ్డి ఓడిపోతే దేశం వదిలిపెట్టి పోతాడు 
  • మహిళను మోసం చేసిన టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున కు జేసీ మద్దతు ఇస్తున్నారు 
  • జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంత వరకు కౌన్సిలర్ మల్లికార్జున ను మందలించలేదు 
  • తనకు అన్యాయం జరిగిందని జేసీ ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళితే బాధితురాలితోనూ జేసీ దురుసుగా ప్రవర్తించారు 
  • మహిళకు అన్యాయం జరుగుతే మహిళలు వెంట ఎవరైనా ఉంటారు.. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి వారి కౌన్సిలర్ వెంటా ఉన్నాడు 
  • కౌన్సిలర్ పోతే జేసీ  ప్రభాకర్ రెడ్డి చైర్మన్ పదవి పోతుందని భయపడుతున్నాడు

జేసీ ప్రభాకర్‌పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి మండిపాటు

11:05 AM, Mar 13th, 2024

పొమ్మనలేక పొగపెడుతున్న చంద్రబాబు..

  • వివాదాల మయంగా మారిన విశాఖ సౌత్ టీడీపీ పరిస్థితి.
  • గండి బాబ్జికి పొమ్మనలేక పొగ పెడుతున్న చంద్రబాబు.
  • సౌత్ నియోజకవర్గం నుంచి మారాలని బాబ్జిపై ఒత్తిడి.
  • మాడుగుల వెళ్లాలని బాబ్జికి ఆదేశం.
  • పొత్తులో భాగంగా సౌత్ సీటు జనసేనకు అంటున్న టీడీపీ.
  • ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటున్న గండి బాబ్జి.
  • మాడుగుల వెళ్ళేది లేదంటున్న బాబ్జి. 
  • సౌత్‌లో జనసేనకు బలమే లేదంటున్న బాబ్జి అనుచరులు.
  • బాబ్జికి మద్దతుగా అనుచరులు మీడియా సమావేశం.
  • సౌత్ నుంచి జనసేన సీటు ఆశిస్తున్న సీతంరాజు సుధాకర్, వంశీ, సాధిక్‌. 

     

10:54 AM, Mar 13th, 2024

ఏలూరు జిల్లా బీజేపీలో ముసలం

  • ఎంపీ సీటు పై బిజెపిలో రగులుతున్న అసంతృప్తి
  • టికెట్ పై ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి
  • చివరి నిమిషంలో తెరపైకి మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో అయోమయం
  • ఏలూరు పార్లమెంట్లో గత పదేళ్లుగా బిజెపిని బలోపేతం చేసిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి
  • ఈనెల 15న పార్టీలకతీతంగా ఆత్మీయ సమావేశం కు పిలుపునిచ్చిన గారపాటి చౌదరి
  • నేడు  బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం 
  • ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి చౌదరి పేరు లేకుంటే రెబల్ గా పోటీ చేయాలంటూ క్యాడర్ డిమాండ్
  • ఈ నెల 15 న ఏలూరులో ఆత్మీయ సమావేశం లో కీలక ప్రకటన చేయనున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి

10:20 AM, Mar 13th, 2024

భీమవరం టికెట్‌ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి 

  • భీమవరంలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయం వద్ద టీడీపీ ఫ్లెక్సీలు తొలగింపు
  • టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ శివరామరాజు.
  • సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజును అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ అధిష్టానం
  • టీడీపీ అధిష్టానం తనను గుర్తించలేని శివరామరాజు ఆవేదన
  • శివరామరాజు కార్యాలయం వద్ద ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించిన అనుచరులు

9:40 AM, Mar 13th, 2024

పవన్‌కు గ్రంధి శ్రీనివాస్‌ కౌంటర్‌

  • పవన్‌ కల్యాణ్‌ను మానసిక వైద్యులకు చూపించాలి
  • పవన్‌ను ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేపించాలి
  • వ్యాధిని.. రోగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
  • పవన్ మాట్లాడే మాటలు సమాజానికే ప్రమాదకరం
  • పవన్ నన్ను గూండా అని భీమవరం నుండి తరిమి కొట్టాలని చేసిన వ్యాఖ్యలను  ఖండిస్తున్నాను. 
  • పవన్‌కు నామీదు ఎందుకంత అసూయ అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 
  • గత నెలలో భీమవరం వచ్చి నామీద ద్వేషం లేదన్నాడు. 
  • ఇప్పుడేమో రౌడీ అంటూ మాట్లాడుతున్నాడు. తాను స్థలం కొందామంటే నేను అడ్డుకున్నానని అంటున్నాడు. 
  • పవన్‌ మానసిక స్థితి చూస్తే ఆశ్చర్యంగా ఉంది. 
  • ప్రపంచ కుబేరులు భీమవరంలో ఎక్కడ ఉన్నారు?. 
  • చంద్రబాబు కాళ్లు, చేతులు పట్టుకుని 24 సీట్లు తీసుకున్నావ్‌. 
  • జనసైనికుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావు. 
  • నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జనసైనికులకు.. పార్టీ లేదు.. తొక్కా లేదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నావు. 
  • జనసేన కార్యకర్తలు సలహాలు ఇవ్వదంటూ చులకనగా మాట్లాడుతున్నాడు. 
  • నువ్వు మాట్లాడే భాష ఏంటి?. 
  • నీకు ఎకరం స్థలం కావాలా?. 
  • నాకు ఉన్న తొమ్మిది ఎకరాల్లో ఎక్కడ కావాలో చెప్పు నేను ఇస్తాను. 
  • మిమ్మల్ని కావాలనుకునే వ్యక్తులకు కనీసం సెల్ఫీ దిగే అవకాశం కూడా లేదు. 
  • మీ నిజ స్వరూపం తెలియక పవన్ సీఎం పవన్ సీఎం అంటూ వారు అరుస్తున్నారు. 
  • ఇప్పటికే 24 సీట్లకు పరిమితమై చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నావు. 
  • పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులిలా తిరుగబడుతుంది. 
  • నువ్వు ఎలా ఉన్నావో ఇప్పటికైనా తెలుసుకో. 
  • పవన్‌ కల్యాణ్‌కు దమ్ముంటే పులివెందులో పోటీ చేయాలి. 

8:50AM, Mar 13th, 2024

కూటమిలో కొత్త చిచ్చు..!

  • సీట్ల సర్దుబాటుపై అసలు బీజేపీ నేతలలో తీవ్ర అసంతృప్తి
  • అధికారంలో లేనప్పుడు 2014 పొత్తులలోనే నాలుగు ఎంపీ, 13 అసెంబ్లీ సీట్లలో పోటీ చేశామని గుర్తు చేస్తున్న బీజేపీ నేతలు
  • కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవడంపై మండిపాటు
  • ఎనిమిది ఎంపీ, 25 అసెంబ్లీ సీట్లు తీసుకోవాల్సిదంటున్న అసలు నేతలు
  • అరకు, నరసాపురం స్ధానాలు కోరకపోయినా ఇచ్చినట్లుగా పచ్చ మీడియా ద్వారా టీడీపీ లీకులపై బీజేపీలో ఆందోళన
  • జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి పేర్లే జాబితాలో లేకుండా టీడీపీ కుట్రలు
  • చంద్రబాబు కోసం పనిచేసే సీఎం రమేష్, సుజనాచౌదరి, కొత్తపల్లి గీత, పురందేశ్వరి పేర్లపై అసంతృప్తి
  • మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్లకే టిక్కెట్లు కేటాయించాలంటున్న బీజేపీ నేతలు
  • ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని‌ కలిపి ఫిర్యాదు చేసే యోచనలో అసలు బీజేపీ అగ్రనేతలు

8:15AM, Mar 13th, 2024

పయ్యావుల కేశవ్‌ ప్రలోభాలు..

  • టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఓటర్లకు ప్రలోభాలు
  • ఉరవకొండ నియోజకవర్గంలో చీరల పంపిణీ చేపట్టిన టీడీపీ నేతలు
  • ఇంటింటికీ చీరలు, కరపత్రాలు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు
  • చీరలు తీసుకోండి.. పయ్యావుల కేశవ్‌కు ఓటేయండి అంటున్న ఉరవకొండ టీడీపీ నేతలు 

7:50 AM, Mar 13th, 2024

మోదీకి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: లక్ష్మీపార్వతి 

  • ప్రధాని మోదీకి చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి 
  • గుజరాత్ నుంచి మోదీని అరెస్ట్ చేసి, బహిష్కరించాలని అప్పటి ప్రధాని వాజ్‌పాయ్‌కు బాబు ఫిర్యాదు చేశారు. 
  • ఇప్పుడు మళ్లీ బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. 
  • రాజకీయ స్వలాభం కోసం పొత్తులు, ఎంతటి నీచానికైన దిగజరుతాడు అనటానికి బీజేపీ పంచన చేరడమే నిదర్శనం
  • సిద్దం సభలకు వచ్చే ప్రజల్ని చూసి చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోంది
  • ప్రజలకు డీబీటీ ద్వారా 2.50 లక్షలు కోట్లు పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అందించిన ఏకైక వ్యక్తి సీఎం జగన్‌
  • అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందించారు
  • రాష్ట్రంలో టీడీపీ అండ్ కో పార్టీలను పాతాళానికి తొక్కే రోజులు ఆసన్నమయ్యాయి.

     

7:20 AM, Mar 13th, 2024

వైఎస్సార్‌సీపీ 12వ జాబితా విడుదల

  • అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితా విడుదల
  • చిలకలూరిపేట సమన్వయకర్తగా కావటి మనోహర్‌నాయుడు
  • గాజువాక సమన్వయకర్తగా గుడివాడ అమర్నాథ్‌. 

7:00 AM, Mar 13th, 2024

చంద్రబాబు పై ఒరిజినల్ బీజేపీ నేతల అసంతృప్తి

  • చంద్రబాబు, పురంధేశ్వరి కలిసి ఒరిజినల్ బీజేపీ నేతలకు అన్యాయం చేస్తున్నారని మండిపాటు
  • పొత్తుల పంచాయితీలో రెండుగా విడిపోయిన ఏపి బీజేపీ
  • పొత్తులపై మరోసారి పునర్ సమీక్షించాలంటూ జాతీయ నాయకత్వం అపాయింట్మెంట్  కోరిన ఏపి బీజేపీ సీనియర్లు
  • బీజేపీ కి వెన్నుపోటు పొడిచేలా సీట్ల పంపకాలు జరిగాయి అంటున్న జాతీయ ,రాష్ట్ర నేతలు
  • కేంద్ర పెద్దలను కలిసే యోచనలో సత్య కుమార్,విష్ణు వర్ధన్ రెడ్డి, జివియల్ , సోము వీర్రాజు తొ పాటు 30  మంది బీజేపి అగ్ర నేతలు
  • వలస నేతలకు టికెట్లు ఇచ్చి పార్టీ నేతలకు అన్యాయం చేయోద్దని  కోరుతున్న బీజేపీ నేతలు
  • ఓడిపోయిన నేతలకు మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని కోరుతున్న బీజేపీలో ఒక వర్గం నేతలు
  • సీట్ల ఎంపిక, అభ్యర్థుల ఎంపిక లో బీజేపీ ఒరిజినల్ నేతల అభిప్రాయాలు తీసుకోవాలని కోరనున్న నేతలు

6:50 AM, Mar 13th, 2024

పవన్ తీరుపై జనసేన నేతలు అసంతృప్తి

  • 24 నుంచి 21 సీట్లుకు తగ్గడంపై ఆగ్రహం
  • పవన్  స్వార్థం కోసం ఇంకా ఎంతమంది బలి కావాలని ఆవేదన
  • నాయకుడు అనే వాడు సీట్లు ఆదనంగా అడగాలి
  • ఉన్న సీట్లును వదులుకునే వాడిని నాయకుడు అనరు.
  • పవన్ తీరుతో 25 మంది సీట్లను కోల్పోవలసి వచ్చింది
  • చంద్రబాబును నాలుగైదు సీట్లు అదనంగా ఎందుకు అడగలేకపోతున్నారు
  • మొదట టీడీపీ, ఇప్పుడు బీజేపీ కోసం జనసేన సీట్లు కోత పెడతారా
  • పవన్ కళ్యాణ్ తీరుతో పార్టీ నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుంది

6:40 AM, Mar 13th, 2024

చంద్రబాబు, పవన్, షర్మిలపై కొడాలి నాని ఫైర్ 

  • నన్ను నమ్మి ఓటేయండని చెప్పిన పవన్.. చంద్రబాబును వదిలేసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు
  • మోదీని నానా బూతులు తిట్టింది చంద్రబాబు కాదా?
  • ఈ దేశాన్ని దోచుకున్నది మోదీ అని చెప్పింది చంద్రబాబు కాదా? 
  • పాచిపోయిన లడ్డూలిచ్చారన్నది పవన్ కాదా? 
  • నా తల్లిని దూషించారు.. టీడీపీ అంతం చూస్తానని పవన్ ప్రగల్భాలు పలికాడు
  • రాష్ట్రం ఏం విధ్వంసం అయిపోయింది మీరంతా కలిశారు
  • ప్రజలకు సంక్షేమం అందిస్తున్నందుకు రాష్ట్రం నాశనమైపోయిందా?
  • పోర్టులు, జెట్టీలు, మెడికల్ కాలేజీలు నిర్మించినందుకు రాష్ట్రం నాశనమైపోయిందా? 
  • రైతులకు, మహిళలకు రుణమాఫీ ఇస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
  • ఒకరిని ఒకరు తిట్టుకుని సిగ్గులేకుండా ఇప్పుడు అంతా కలిసి వస్తున్నారు
  • సీఎం జగన్‌ను ఓడించడమే అన్ని పార్టీల ఆశయం
  • పవన్ సిగ్గులేకుండా 21 సీట్లకు వచ్చాడు 
  • పార్టీని పెట్టింది దేనికి అడుక్కోవడానికా 
  • ఈయన్ని నమ్ముకున్నవాళ్లందరికీ పవన్ ఏం చెప్తాడు 
  • జనసేన ఓట్లు చంద్రబాబుకు బదిలీ అయ్యే పరిస్థితి లేదు
  • బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అట్టర్ ప్లాప్ 
  • చంద్రబాబుకు ఈ సారి 23 సీట్లు కూడా రావు
  • షర్మిల ఎవరికోసం ప్రచారం చేస్తారు
  • ఎవరు గెలవాలని షర్మిల కోరుకుంటున్నారు
  • కాంగ్రెస్‌లో ఉండి బీజేపీలో ఉన్న చంద్రబాబును గెలిపించడానికి షర్మిల ప్రయత్నిస్తోంది
  • మణిపూర్ ఊచకోతకు ఏపీలో ఉన్న సీఎం జగన్‌కు ఏం సంబంధం 
  • తెలంగాణలో తిరిగినప్పుడు షర్మిలకు మణిపూర్ గుర్తుకురాలేదా? 
  • పాస్టర్ అని చెప్పుకునే బ్రదర్ అనీల్ మణిపూర్ వెళ్లాడా? 
  • రాహుల్, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మణిపూర్ వెళ్లారా? 
  • బీజేపీ క్రైస్తవులను ఊచకోత కోశారని మీరు చెబుతున్నారు
  • నరేంద్రమోదీని ఏపీలో కాలు పెట్టనివ్వనన్నది చంద్రబాబు కాదా? 
  • బీజేపీతో కలిసి తప్పుచేశానన్న చంద్రబాబు సిగ్గులేకుండా మోదీతో ఎలా కలిశాడు? 
  • తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఎన్టీఆర్ టీడీపీని పెట్టాడు
  • చంద్రబాబు తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టాడు 
  • ఏపీలో కాంగ్రెస్ జెండా పట్టుకునేవాడు కూడా లేడు 
  • ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణలో పార్టీ పెట్టింది
  • ఆ పార్టీని హుస్సేన్ సాగర్‌లో కలిపేసి ఏపీకి వచ్చి సీఎం జగన్‌ని సాధించాలని చూస్తోంది
  • కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు
  • ఏపీలో కాంగ్రెస్ పార్టీ డిస్పోజబుల్ పార్టీ 
  • డిపాజిట్లు కూడా రానోళ్లు 5 వేలు మహిళలకు ఇస్తారంటే నమ్మడానికి జనం పిచ్చోళ్లా..

6:30 AM, Mar 13th, 2024

నిడదవోలులో జనసేనకు సహకరించం: టీడీపీ కార్యకర్తలు

  • నిడదవోలు నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య  రాజుకున్న చిచ్చు
  • పొత్తులో భాగంగా జనసేన కందుల దుర్గేష్‌కు టికెట్‌ కేటాయింపు
  • సోమవారం ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
  • దుర్గేష్ నిడదవోలు టికెట్ కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే శేషా రావు వర్గం ఆగ్రహం
  • టికెట్‌ శేషారావుకే ఇవ్వాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్‌ 
  • జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు సహకరించేది లేదని ప్రకటనలు 
  • ఉమ్మడి అభ్యర్థిగా నేడు నిడదవోలు వెళ్తున్న కందుల దుర్గేష్
  • ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనే రాజకీయ వర్గాల చర్చ
ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
AP Political Updates
AP Politics
Chandrababu Naidu
Pawan Kalyan
TDP - BJP alliance
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు

ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు

తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన

తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.