Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. 8వ వేతన కమిషన్‌కు ఆమోదం
ADVERTISEMENT 

8వ వేతన కమిషన్‌కు ఆమోదం

National Sakshi User Sakshi Sakshi Time Oct 29, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
8TH-PAY-COMMISSION.jpg

కమిషన్‌ చైర్‌పర్సన్‌గా మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనాప్రకాశ్‌ దేశాయ్‌ 

కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు

18 నెలల్లోగా సిఫార్సులను సమర్పించనున్న కమిషన్‌  

వేతన కమిషన్‌తో 1.19 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి  

2025–26 రబీ సీజన్‌లో ఎరువులపై రూ. 37,952 కోట్ల సబ్సిడీ

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 8వ కేంద్ర వేతన కమిషన్‌ (సీపీసీ)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. కేంద్ర కేబినెట్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, 69 లక్షల మంది పెన్షనర్లకు పింఛన్లు పెరగనున్నాయి. కేంద్ర మంత్రివర్గం మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశయ్యింది. 8వ కేంద్ర వేతన కమిషన్‌కు ఆమోద ముద్ర వేసింది. ఈ ఏడాది జనవరిలో 8వ సీపీసీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్, తాత్కాలిక సభ్యుడు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు.

కమిషన్‌ను ఏర్పాటు చేసిన తేదీ నుంచి 18 నెలల్లోగా తన సిఫారసులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. సిఫార్సులను రూపొందించే సమయంలో పలు కీలక అంశాలను కమిషన్‌ దృష్టిలో పెట్టుకోనుంది. ఇందులో భాగంగా దేశంలోని ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి వ్యయం, సంక్షేమ పథకాలకు తగిన వనరులు అందుబాటులో ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించుకోవాలి. సహకారేతర పెన్షన్‌ పథకాలకు నిధులు, ఖర్చు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలపై సిఫార్సుల ప్రభావం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్‌ రంగ ఉద్యోగుల ప్రస్తుత జీతాల నిర్మాణం, ప్రయోజనాలు, పని పరిస్థితులను పరిశీలించాల్సి ఉంటుంది. తుది సిఫార్సులను సూచించిన తర్వాత కూడా 8వ సీపీసీ తమ పరిధిలోని అంశాలపై మధ్యంతర నివేదికలను సమర్పించే వెసులుబాటు ఉంది.

కమిషన్‌ సిఫార్సులు వచ్చే ఏడాది అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు వేతన కమిషన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపడం గమనార్హం.  ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఇతర ప్రయోజనాలను కమిషన్‌ సమగ్రంగా పరిశీలిస్తుంది, తగిన మార్పులను సూచిస్తుంది. ఈ కమిషన్‌లో ఐఐఎం(బెంగళూరు) ప్రొఫెసర్‌ పులక్‌ ఘోష్‌ తాత్కాలిక సభ్యుడిగా, పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్‌ జైన్‌ సభ్యకార్యదర్శిగా వ్యవహరించబోతున్నారు.  జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌గా పనిచేస్తున్నారు.

ఆమె గతంలో పలు ప్రభుత్వ కమిటీలకు సారథ్యం వహించారు. కేంద్ర పాలిత జమ్మూకశ్మీర్‌ పునర్విభజన కమిషన్‌ చైర్మన్‌గా సేవలందించారు. ఉత్తరాఖండ్‌ యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌(యూసీసీ) ముసాయిదా కమిటీలోనూ పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆమెకు అప్పగించిన నాలుగో అతిపెద్ద బాధ్యత వేతన కమిషన్‌ చైర్‌పర్సన్‌గానే. 7వ వేతన కమిషన్‌ను 2014 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి.    

రబీ సీజన్‌లో ఎరువులకు రాయితీ  
మరో కీలకమైన నిర్ణయానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2025–26 రబీ సీజన్‌లో ఎరువులకు సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించింది. ఫాస్ఫరస్, పొటాíÙయం ఎరువులపై పోషక ఆధారిత సబ్సిడీ ఇవ్వనుంది. ఎరువుల రాయితీ కోసం రూ.37,952 కోట్లు ఖర్చు చేయనుంది. ఇది 2025 ఖరీఫ్‌ సీజన్‌ బడ్జెట్‌ కంటే రూ.736 కోట్లు ఎక్కువ అని కేంద్రం స్పష్టంచేసింది. ఫాస్ఫేట్‌పై సబ్సిడీని కిలోకు రూ.43.60 నుంచి రూ.47.96కు, సల్ఫర్‌పై సబ్సిడీని కిలోకు రూ.1.77 నుంచి రూ.2.87కు పెంచారు. రైతులకు సరసమైన, సహేతుకమైన ధరలకు ఎరువులు లభించేలా ఈ సబ్సిడీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్రం పేర్కొంది. అయితే, నైట్రోజన్, పొటాష్‌ ఎరువులపై రాయితీలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. నైట్రోజన్‌పై రాయితీ కిలోకు రూ.43.02, పొటాషిపై రాయితీ కిలోకు రూ.2.38 చొప్పున లభిస్తుంది.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Cabinet
Pay Commission
center governament
employees
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఈట్‌ ఫాస్ట్‌, ఒక్కో నిమిషానికి గంట ఎక్కువ : షాకింగ్‌ కంపెనీ నోటీసు

ఈట్‌ ఫాస్ట్‌, ఒక్కో నిమిషానికి గంట ఎక్కువ : షాకింగ్‌ కంపెనీ నోటీసు

కంపెనీని అమ్మేసి ఉద్యోగులను కోటీశ్వరులను చేశాడు!

కంపెనీని అమ్మేసి ఉద్యోగులను కోటీశ్వరులను చేశాడు!

ఉద్యోగులకు కేంద్రం గిఫ్ట్.. క్షణాల్లో PF డబ్బులు విత్ డ్రా

ఉద్యోగులకు కేంద్రం గిఫ్ట్.. క్షణాల్లో PF డబ్బులు విత్ డ్రా

ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా.. EPFOనుంచి కీలక అప్‌డేట్‌ వచ్చేసింది

ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా.. EPFOనుంచి కీలక అప్‌డేట్‌ వచ్చేసింది

ప్రభుత్వ సంక్షేమం బంద్ ఉద్యోగులపై పనిభారం

ప్రభుత్వ సంక్షేమం బంద్ ఉద్యోగులపై పనిభారం

తొలి క్యాబినేట్‌ భేటీలోనే దుమ్మురేగొట్టిన విజయ్‌

తొలి క్యాబినేట్‌ భేటీలోనే దుమ్మురేగొట్టిన విజయ్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.