ఢిల్లీ: వరుస భూకంపాలతో రాజస్థాన్ రాజధాని, పింక్ సిటీ జైపూర్ ఉలిక్కిపడింది. పొద్దుపొద్దున్నే కేవలం అరగంట గ్యాప్లోనే మూడు భూకంపాలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది.
శుక్రవారం వేకువ ఝామున జైపూర్ కేంద్రంగా.. 4.09ని ప్రాంతంలో పదికిలోమీటర్ల లోతున ఒకటి, . 4.22ని. ప్రాంతంలో 3.1 తీవ్రతతో ఐదు కిలోమీటర్ల లోతున ఇంకొకటి, 4.25 ప్రాంతంలో 3.4 తీవ్రతతో 10 కిలోమీటర్ల లోతున మరొకటి.. మొత్తం మూడుసార్లు భూమి కంపించింది.
స్వల్ప ప్రకంపనలే అయినా.. ప్రజలు వణికిపోయారు. కొందరు నిద్ర నుంచి మేల్కొని భయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. ఇక ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకంపనల విషయాన్ని రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సైతం ట్విటర్ ద్వారా ధృవీకరించారు. ఇక భూకంపానికి సంబంధించిన వీడియోలు ట్విటర్లో పోస్ట్ అవుతున్నాయి. మరోవైపు మణిపూర్లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది.
What a scary day to witness such high magnitude #earthquake in #Jaipur.
Please be safe! pic.twitter.com/hGDgfCHYtL— Jahnvi Sharma (@JahnviSharma01) July 20, 2023
#earthquake See the dogs on the street in deep sleep suddenly waking up #jaipur #भूकंप pic.twitter.com/oGYz942g9i
— Rameshwar Singh (@RSingh6969a) July 20, 2023
जयपुर में तेज़ भूकंप के झटके महसूस किए गए हैं।
I hope you all are safe!
#Jaipur #earthquake pic.twitter.com/FWAEvBTw7A— Dr.Kirodi Lal Meena (@DrKirodilalBJP) July 20, 2023