Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఉగ్రవాద విష సర్పాన్ని  నలిపేస్తాం 
ADVERTISEMENT 

ఉగ్రవాద విష సర్పాన్ని  నలిపేస్తాం 

National Sakshi User Sakshi Sakshi Time May 31, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
modi-bihar11.jpg

మన అమ్ములపొదిలో ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం ఒక బాణం   

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఉగ్రవాదులను శిక్షించాం: ప్రధాని మోదీ

కారాకాట్‌/కాన్పూర్‌: ఉగ్రవాదం ఒక విష సర్పమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అది మరోసారి మనవైపు తల ఎత్తిచూస్తే, కలుగులోంచి బయటకు లాగి, కాలితో నలిపి చంపేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పహల్గాం ఉగ్రవాద దాడి వెనుక ఉన్న కుట్రదారుల స్థావరాలను మన సైనిక దళాలు శిథిలాలుగా మార్చేశాయని చెప్పారు. మన అమ్ములపొదిలో ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం ఒక బాణం అని తెలిపారు.

 ఉగ్రవాదంపై పోరాటం ఆగదని, ఆపే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. శుక్రవారం బిహార్‌లోని కరాకాట్‌ పట్టణంలో రూ.48,520 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రూ.47,600 కోట్ల విలువైన 15 మెగా అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబి్ధదారులకు సరి్టఫికెట్లు, చెక్కులు అందజేశారు. 

ఈ సందర్భంగా రెండుచోట్లా బహిరంగ సభల్లో ప్రసంగించారు. గత నెలలో పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే బిహార్‌లోని మధుబని జిల్లాలో పర్యటించానని, ముష్కరులను కలలో కూడా ఊహించలేని రీతిలో శిక్షిస్తానంటూ ప్రజలకు మాట ఇచ్చానని గుర్తుచేశారు. ఆ మాట నిలబెట్టుకొని, మళ్లీ బిహార్‌లో అడుగు పెట్టానని పేర్కొన్నారు. మన ఆడబిడ్డలు ధరించే సిందూరం శక్తి ఏమిటో పాకిస్తాన్‌తోపాటు మొత్తం ప్రపంచం చూíసిందన్నారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే...   

అణు బాంబులకు భయపడం  
‘‘పాకిస్తాన్‌ సైన్యం రక్షణలో భద్రంగా ఉన్నట్లు ఉగ్రవాదులు భావించేవారు. కానీ, వారిపై దాడిచేసి మోకాళ్లపై నిలబెట్టాం. పాకిస్తాన్‌ వైమానిక స్థావరాలు, సైనిక కేంద్రాలను ధ్వంసం చేశాం. ఇది నవ భారతం. మన శక్తి ఏమిటో అందరికీ తెలుస్తోంది. ఉగ్రవాదులకు మరింత బాగా అర్థమవుతోంది. దేశ రక్షణ కోసం సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. 

బిహార్‌లోని సరన్‌ జిల్లాకు చెందిన బీఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ మొహమ్మద్‌ ఇంతియాజ్‌ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై పోరాడుతూ అమరుడయ్యాడు. బీఎస్‌ఎఫ్‌ జవాన్లు దేశమాత సేవలో తరిస్తున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో స్వదేశీ ఆయుధ బలాన్ని, మేక్‌ ఇన్‌ ఇండియా శక్తిని ప్రదర్శించాం. బ్రహ్మోస్‌ క్షిపణులు పాకిస్తాన్‌ భూభాగంలోకి ప్రవేశించి, విధ్వంసం సృష్టించాయి. 

మనం కొడుతున్న దెబ్బలు తట్టుకోలేక యుద్ధం ఆపాలంటూ పాకిస్తాన్‌ వేడుకుంది. ఆపరేషన్‌ సిందూర్‌ ముగియలేదు. అణు బాంబులకు భారత్‌ భయపడదు. శత్రువుల వద్దనున్న అణ్వాయుధాలను బట్టి నిర్ణయాలు తీసుకొనే రోజులు పోయాయి. ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో మన సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ముష్కరులపై ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలో సైనికులే నిర్ణయించుకుంటారు. ఉగ్రవాదులను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాలను ఇకపై ఒక్కటిగానే పరిగణిస్తాం.  

మావోయిజం అంతమయ్యే రోజు దగ్గర్లోనే..  
దేశానికి శత్రువులైన వారందరిపైనా మన పోరాటం కొనసాగుతోంది. వారి సరిహద్దులో ఉండొచ్చు లేదా దేశం నడి»ొడ్డున ఉండొచ్చు. హింస, అశాంతిని ప్రేరేపించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గతంలో నక్సలైట్ల అరాచకాల వల్ల బిహార్‌ ప్రజలు భయంభయంగా బతికారు. నక్సలైట్ల కారణంగా అభివృద్ధి ఆగిపోయింది. పిల్లల చదువులు దెబ్బతిన్నాయి. రోడ్లు వేస్తున్న కారి్మకులను కూడా హత్య చేశారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం పట్ల నక్సలైట్లకు ఏమాత్రం విశ్వాసం లేదు. 

2014లో కేంద్రంలో అధికారంలోకి వచి్చన తీవ్రవాద నిర్మూలనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. మా కృషి ఫలితంగా దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 125 నుంచి 18కి పడిపోయింది. రోడ్లు నిర్మిస్తున్నాం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. మావోయిజం పూర్తిగా అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. శాంతి, సౌభాగ్యం, విద్య ప్రతి గ్రామానికీ చేరుకుంటాయి’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.    

‘పహల్గాం’ బాధిత కుటుంబానికి పరామర్శ  
పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన శుభం ద్వివేది కుటుంబ సభ్యులను ప్రధానమంత్రి పరామర్శించారు. కాన్పూర్‌లోని చాకేరి ఎయిర్‌పోర్టులో వారిని కలుసుకున్నారు. మోదీని చూసి వారంతా బోరున విలపించారు. ఈ సందర్భంగా మోదీ సైతం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆందోళన వద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని శుభం ద్వివేది కుటుంబానికి భరోసా కల్పించారు. 
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Terrorism
Narendra Modi
Pahalgam
Terror attack
Operation Sindoor
Bihar
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

పహల్గామ్‌ నరమేధం..  సూత్రధారి ఇతడే!

పహల్గామ్‌ నరమేధం.. సూత్రధారి ఇతడే!

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.