Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. Delhi blast: అయోధ్యలో స్లీపర్‌ సెల్‌? వారణాసిలో..
ADVERTISEMENT 

Delhi blast: అయోధ్యలో స్లీపర్‌ సెల్‌? వారణాసిలో..

National Sakshi User Sakshi Sakshi Time Nov 12, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ayodhya.jpg

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ కారు పేలుళ్లతో సంబంధం కలిగిన ఉగ్రవాద ముఠా ఉత్తరప్రదేశ్‌లోని మతపరమైన ప్రదేశాలను, ముఖ్యంగా అయోధ్య, వారణాసిని లక్ష్యంగా చేసుకున్నదని నిఘా వర్గాలు కనుగొన్నాయి. ‘ఇండియా టీవీ’ తెలిపిన వివరాల ప్రకారం అయోధ్యలో భారీ పేలుడుకు ఈ బృందం ప్రణాళిక రచించిందని, ఢిల్లీ పేలుడు కేసులో అరెస్టయిన డాక్టర్ షాహీన్ షాహిద్.. స్లీపర్ సెల్‌ను ఇప్పటికే యాక్టివేట్ చేశాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రణాళిక అమలుకు ముందే యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్‌)తోపాటు స్థానిక పోలీసుల సాగించిన వరుస దాడులు, అరెస్టులు ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఛేదించడానికి దారితీశాయి.

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఉగ్రవాదుల ముఠా ప్రణాళికలో భాగం కాదని విచారణ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం పేలుడు పరికరంలో టైమర్ లేదా రిమోట్ ట్రిగ్గర్ లేదు. దీని ప్రకారం చూస్తే పేలుడు ప్రమాదవశాత్తు లేదా తొందరపాటులో జరిగి ఉండవచ్చని సూచిస్తున్నది.  అనుమానితులు పేలుడు పదార్థాలను రవాణా చేస్తుండగా, అది పేలిపోయిందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

అధికారుల విచారణలో ఉగ్రవాద నెట్‌వర్క్ ఆస్పత్రులు, ఇతర రద్దీగా ఉండే  ప్రాంతాలను కూడా టార్గెట్‌ చేసినట్లు తేలింది. నిందితులు  లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల్లో అధిక రద్దీతో ఉండే ఆస్పత్రులు, జనసమ్మర్థం ఉన్న ప్రదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో భద్రతా సంస్థలు తాజాగా కమ్యూనికేషన్ రికార్డులు, డిజిటల్ ట్రయల్స్, ఈ మాడ్యూల్, ఉత్తర భారతదేశంలో చురుగ్గా ఉన్న ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధాలను పరిశీలిస్తున్నాయి.

సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నిలిపివుంచిన హ్యుందాయ్ ఐ20 కారులో  చోటుచేసుకున్న పేలుడులో 13 మంది మృతిచెందారు. 20 మందికి పైగా జనం గాయపడ్డారు పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ పేలుడు కారణంగా మంటలు చెలరేగి, సమీపంలోని కార్లకు వ్యాపించాయి. స్టేషన్ గేట్ నంబర్ వన్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుల కుటుంబాలకు  ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)విచారణ చేస్తోంది.

ఇది కూడా చదవండి: Delhi blast: చెదిరిన టాటూలు, చిరిగిన టీ-షర్టులు..
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Delhi Blasts Case
ayodya
plan
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘నేషనల్ ఏఐ ప్లాన్‌’తో దూకుడు..

‘నేషనల్ ఏఐ ప్లాన్‌’తో దూకుడు..

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం.. యూనస్ కీలక నిర్ణయం

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం.. యూనస్ కీలక నిర్ణయం

ఢిల్లీ పేలుడు వెనుక జైషే మహమ్మద్ ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక

ఢిల్లీ పేలుడు వెనుక జైషే మహమ్మద్ ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక

అయోధ్యపై దాడికి ప్లాన్.. యూపీ జైలులో దారుణ హత్య!

అయోధ్యపై దాడికి ప్లాన్.. యూపీ జైలులో దారుణ హత్య!

ఢిల్లీ పేలుడు దర్యాప్తు: వణికించేలా ఉగ్ర ప్రణాళికలు?

ఢిల్లీ పేలుడు దర్యాప్తు: వణికించేలా ఉగ్ర ప్రణాళికలు?

ఢిల్లీ పేలుడు: ఉగ్ర డాక్టర్లకు పాక్ నుంచి కోడ్ సందేశాలు..!

ఢిల్లీ పేలుడు: ఉగ్ర డాక్టర్లకు పాక్ నుంచి కోడ్ సందేశాలు..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.