Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ‘ఎంత నరకం అనుభవించాడో..’! పోస్టుమార్టం నివేదికలో షాకింగ్‌ విషయాలు
ADVERTISEMENT 

‘ఎంత నరకం అనుభవించాడో..’! పోస్టుమార్టం నివేదికలో షాకింగ్‌ విషయాలు

National Sakshi User Sakshi Sakshi Time Jul 4, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Tamil_20Nadu_20Ajith_20Kumar_20Case.jpg

తమిళనాడులో సంచలనం రేపిన అజిత్‌ కుమార్‌ (29) కస్టడీ డెత్‌(Custodial Death) కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. అందులో విచారణ పేరుతో అజిత్‌ను పోలీసులు ఎంతగా చిత్రహింసలకు గురి చేసి చావుకి కారణం అయ్యారో తేటతెల్లమైంది.

తమిళనాట సంచలనం సృష్టించిన అజిత్‌ కుమార్‌ కేసు పోస్టుమార్టం నివేదికలో షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి. భౌతికంగా అతనిపై పదే పదే అత్యంత పాశవికంగా పోలీసులు దాడి చేయడం వల్ల ముఖ్య అవయవాలు దెబ్బతిన్నాయి. ఆ దెబ్బల ధాటికి అంతర్గతంగా రక్తస్రావం జరిగి అజిత్‌ మరణించినట్లు పోస్టుమార్టం నివేదికను బట్టి అర్థమవుతోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఇండియాటుడే కథనం ప్రకారం.. అజిత్‌ కుమార్‌ మృతదేహంపై 44 గాయాలు ఉన్నాయి. అందులో 30 చోట్ల కండరాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. గుండె, కాలేయంలో పెటెచియల్ హీమరేజ్‌లు (చిన్న రక్తస్రావ మచ్చలు) కనిపించాయి. ఇవి సాధారణంగా యాక్సిడెంట్‌లలో, ఉద్దేశపూర్వకంగా కొట్టిన సందర్భాల్లోనూ కనిపించవట. అలాంటిది.. అజిత్‌ ఒంట్లో ఈ మచ్చలు కనిపిస్తున్నాయంటే పోలీసులు ఎంతంగా హింసించారో అర్థవుతోంది.

అలాగే బాటన్లు, రాడ్లు, కర్రలతో తల, ఇతర భాాగాలపై పదే పదే కొట్టడం వల్ల అజిత్‌కు బలంగా గాయాలయ్యాయి. మెదడుతో పాటు అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తల చర్మం కింద గాయాలు (సబ్‌స్కాల్ప్ కంట్యూషన్స్), పుర్రెపై నీలిమచ్చలు (ఎక్కైమోసిస్), అలాగే రెండు సెరిబ్రల్ లోబుల్లో రక్తస్రావం (హీమరేజ్) అయ్యింది. కళ్లు, ముక్కు, నోరు, చెవులు, ప్రైవేట్‌ భాగాల్లో కారం చల్లినట్లు ఆనవాలు లభించాయి. ఈ పోస్టుమార్టం నివేదికను బట్టి అజిత్‌ కుమార్‌ను పోలీసులు ఉద్దేశపూర్వకంగా.. అత్యంత క్రూరంగా హింసించారో స్పష్టమవుతోందని నివేదిక పేర్కొంది. 

ఏం జరిగిందంటే.. 
తమిళనాడు శివగంగై జిల్లా తిరుప్పువనం సమీపం మడపురంలోని ప్రసిద్ధ భద్రకాళియమ్మన్‌ ఆలయానికి జూన్‌ 27న వచ్చిన ఇద్దరు మహిళా భక్తులు.. కారులో ఉంచిన తమ నగలు, డబ్బు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆలయంలో వెళ్లే ముందు కారు తాళాలను ఆలయ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న అజిత్‌కుమార్‌(27)కి ఇచ్చామని, అతని మీదే అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో.. పోలీసులు విచారణ పేరుతో అతన్ని పిలిపించుకుని ప్రశ్నించి వదిలేశారు. ఆ మరుసటిరోజు కూడా రమ్మని చెప్పి.. పీఎస్‌కు కాకుండా రహస్య ప్రాంతానికి తరలించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ క్రమంలో తానే దొంగించానని అజిత్‌ అబద్ధం చెప్పాడు. నగలు ఎక్కడ దాచానో చూపించానని ఆలయానికి తీసుకెళ్లి.. అక్కడ పోలీసుల కాళ్ల మీద పడి తాను తప్పు చేయలేదని, వదిలేయాలని వేడుకున్నాడు. కానీ, పోలీసులు అతన్ని మళ్లీ టార్చర్‌ చేశారు. అజిత్‌ అపస్మారక స్థితిలోకి జారుకోగా.. చెన్నై ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.

బాధిత కుటుంబాన్ని ఓదార్చిన విజయ్‌
ఈ ఘటన ప్రజాగ్రహానికి కారణమైంది. ఘటనకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావడం కలకలం రేపింది. నెట్టింట ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అజిత్ కుమార్ కస్టడీ మృతి కేసు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపింది. ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు కూడా ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి: “ఇది స్టాలిన్ పాలనలో పోలీసు అరాచకానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్.. ఈ కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్.. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని స్వయంగా వెళ్లి  ఓదార్చారాయన. మరోవైపు శివగంగై ఉదంతంపై నిరసనకు టీవీకే పార్టీకి పోలీసులు అనుమతించలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించింది ఆ పార్టీ. 


ఈ ఘటన ఇటు తమిళనాడుతో పాటు అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేసు తీవ్రత దృష్ట్యా CB-CID నుంచి CBIకి బదిలీ చేశారు. పోలీసుల చర్య క్షమించరానిదని పేర్కొన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ (MK Stalin).. దర్యాప్తులో ఎటువంటి సందేహాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే సీబీఐకి అప్పగించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. అజిత్ కుటుంబానికి ₹50 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, భూమి మంజూరు చేశారు. ఈ ఘటనపై జులై 8వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రమే తన పౌరుడిని చంపింది అని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. 

నాకు భద్రత ఇవ్వండి
అజిత్‌ కుమార్‌ను ఆలయానికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులు జరిపిన దాడిని అక్కడి ఉద్యోగి శక్తీశ్వరన్‌ రహస్యంగా చిత్రీకరించాడు. ఆ వీడియోనే విపరీతంగా వైరల్‌ అయ్యింది. అంతేకాదు ఈ కేసులో ఉన్న ఏకైక ప్రత్యక్ష సాక్షి కూడా ఆ ఉద్యోగినే. దీంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని.. తనకు భద్రత కల్పించాలని కోరుతున్నారాయన. అరెస్టైన పోలీసుల్లో ఒకరు గుండాలతో, రౌడీ షీటర్లతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నాడని, అతని నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ శక్తీశ్వరన్‌ డీజీపీకి లేఖ రాశారు.

#Shocking A video has surfaced showing police attacking Ajith Kumar, a youth from Sivaganga. The police's First Information Report (FIR) claimed that Ajith died due to epilepsy and injuries sustained from a fall. #AjithkumarMysteryDeath #CustodyDeath @TheFederal_News pic.twitter.com/otW1AicDGZ

— Mahalingam Ponnusamy (@mahajournalist) July 1, 2025

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ajith Kumar
tamil nadu
Custodial Death
Madras High Court
CM Stalin
Vijay
postmortem report
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వివాదాల నేపథ్యంలో.. విజయ్‌ సంచలన నిర్ణయం

వివాదాల నేపథ్యంలో.. విజయ్‌ సంచలన నిర్ణయం

విజయ్‌ ఆకస్మిక తనిఖీ.. ఉలిక్కిపడ్డ అధికారులు!

విజయ్‌ ఆకస్మిక తనిఖీ.. ఉలిక్కిపడ్డ అధికారులు!

సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష

సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష

కాపు యువకుని లాకప్‌డెత్‌ కేసు సీబీఐకి అప్పగించండి

కాపు యువకుని లాకప్‌డెత్‌ కేసు సీబీఐకి అప్పగించండి

విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)

విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.