న్యూఢిల్లీ: విమాన చార్జీల నియంత్రణకు రూపొందించిన నిబంధనల వివరాలను రెండు వారాల్లోగా అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. ఆ నిబంధనలను ఇప్పటికే పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటికీ, సీల్డు కవర్లోనే తమకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థలు విమాన టికెట్ల ధరలు, ఇతర అదనపు రుసుములను అనూహ్యంగా పెంచేయకుండా నియంత్రించేందుకు మార్గదర్శకాలను రూపొందించాలంటూ సామాజిక కార్యకర్త లక్ష్మీనారాయణన్ వేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణను ఆగస్ట్ 3వ తేదీకి వాయిదావేసింది.
కేంద్రానికి సుప్రీం నోటీస్
ADVERTISEMENT
ADVERTISEMENT