Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ‘మైనార్టీ హోదా’పై కొత్త బెంచ్‌
ADVERTISEMENT 

‘మైనార్టీ హోదా’పై కొత్త బెంచ్‌

National Sakshi User Sakshi Sakshi Time Nov 9, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
alig.jpg

అలీగఢ్‌ ముస్లిం వర్సిటీపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ 

4–3 మెజార్టీతో తీర్పు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రఖ్యాత అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)కి మైనార్టీ విద్యాసంస్థ హోదా ఉందో లేదో తేల్చే అంశంపై ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారాన్ని నూతన ధర్మాసనానికి(బెంచ్‌)కు అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 4–3 మెజార్టీతో శుక్రవారం 118 పేజీల తీర్పు ఇచ్చింది. 

విద్యా సంస్థ నియంత్రణ, పరిపాలన విషయంలో పార్లమెంట్‌లో చట్టం చేసినప్పటికీ ఆ సంస్థకు ఉన్న మైనార్టీ హోదాను రద్దు చేయరని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ చట్ట ప్రకారం అలీగఢ్‌ ముస్లిం వర్సిటీని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. పరిపాలనా విభాగంలో మైనార్టీలు లేనంత మాత్రాన మైనార్టీ విద్యాసంస్థ కాకుండాపోదని తేల్చిచెప్పింది. 

మతపరంగా లేదా భాషపరంగా మైనార్టీలైన వ్యక్తులు విద్యాసంస్థలు స్థాపించడం లేదా నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ, వివక్ష చూపుతూ తీసుకొచ్చిన చట్టం లేదా కార్యనిర్వాహక చర్య రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 30(1)కు విరుద్ధమని తేల్చిచెప్పింది. ఈ ఆర్టికల్‌ ప్రకారం విద్యాసంస్థలను స్థాపించే, నిర్వహించే హక్కు మత, భాషాపరమైన మైనార్టీలకు ఉంది.

 ‘‘ఏఎంయూను మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేం.. అది సెంట్రల్‌ యూనివర్సిటీ అంటూ ఎస్‌.అజీజ్‌ బాషా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో 1967లోఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతున్నాం. తాము స్థాపించిన విద్యా సంస్థ మైనార్టీల ప్రయోజనాల కోసమేనని దానిని ఏర్పాటు చేసినవారు నిరూపించుకోవాలి. రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఏర్పాటైన యూనివర్సిటీలకు సైతం ఆర్టికల్‌ 30(1) కింద ఇచ్చిన హక్కు వర్తిస్తుంది’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. అయితే, ఇదే ధర్మాసనంలోని జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ మూడు వేర్వేరు భిన్నమైన తీర్పులు ఇచ్చారు. ఏఎంయూ మైనార్టీ విద్యాసంస్థ కాదని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా తన తీర్పులో స్పష్టంచేశారు. 

ఏమిటీ కేసు? 
స్వాతంత్య్రానికి పూర్వమే 1875లో మహ్మదన్‌ ఆంగ్లో ఓరియంటల్‌గా కాలేజీగా ప్రారంభమైన ఈ విద్యాసంస్థను 1920లో యూనివర్సిటీగా మార్చారు. ఏఎంయూ అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్న సెంట్రల్‌ యూనివర్సిటీ అని, దాన్ని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమని 1967లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో 1981లో పార్లమెంట్‌లో ఏఎంయూ(సవరణ) చట్టాన్ని తీసుకురావడంతో ఏఎంయూకు మళ్లీ మైనార్టీ విద్యాసంస్థ హోదా లభించింది. ఈ చట్ట సవరణను సవాలు చేస్తూ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

 దాంతో ఏఎంయూ(సవరణ) చట్టం–1981ను కొట్టివేస్తూ హైకోర్టు 2006లో తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసింది. మరికొందరు సైతం పిటిషన్లు దాఖలుచేశారు. యూపీఏ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు 2016లో ఎన్డీయే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మిగిలిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ అంశాన్ని 2019 ఫిబ్రవరి 12న ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. పిటిషన్లపై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఏఎంయూకు మైనార్టీ సంస్థ హోదా ఉందో లేదో నూతన బెంచ్‌ నిర్ణయిస్తుందని తేల్చిచెప్పింది. 
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Uttar Pradesh
aligarh muslim university
Supreme court of India
DY Chandrachud
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

నడకదారి ఇక పౌరుల హక్కు

నడకదారి ఇక పౌరుల హక్కు

ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే!

ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే!

‘మోగ్లీ గర్ల్‌’ పూజ ఇక లేదు

‘మోగ్లీ గర్ల్‌’ పూజ ఇక లేదు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.