Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. రెండో దశ ఎస్‌ఐఆర్‌ ఆరంభం
ADVERTISEMENT 

రెండో దశ ఎస్‌ఐఆర్‌ ఆరంభం

National Sakshi User Sakshi Sakshi Time Nov 5, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
SIR-survey.jpg

తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రక్రియ  

డిసెంబర్‌ 9న ముసాయిదా ఓటర్ల జాబితాలు   

వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది జాబితాలు

న్యూఢిల్లీ/కోల్‌కతా: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) సర్వే మంగళవారం ప్రారంభమైంది. బూత్‌ స్థాయి అధికారులు(బీఎల్‌ఓ)లు విధులు నిర్వర్తిస్తున్నారని, ఓటర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారని ఎన్నికల సంఘం తెలియజేసింది. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 4 దాకా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. డిసెంబర్‌ 9న ముసాయిదా ఓటర్ల జాబితాలు విడుదల చేశారు. వీటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్పులు చేర్పుల అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితాలు ప్రచురిస్తారు.

మొత్తం 321 జిల్లాల్లో 1,843 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎస్‌ఐఆర్‌కు ఈసీ శ్రీకారం చుట్టింది. దాదాపు 51 కోట్ల మంది ఓటర్ల అర్హతను నిగ్గుతేల్చబోతున్నారు. ఈ క్రతువులో 5.3 లక్షల మందికి పైగా బూత్‌ స్థాయి అధికారులు(బీఎల్‌వో), 10,448 మంది ఎలక్టోరల్‌ రిజి్రస్టేషన్‌ అధికారులు, 321 మంది జిల్లా ఎన్నికల అధికారులు పాల్గొంటున్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 7.64 లక్షల మంది బూత్‌ స్థాయి ఏజెంట్లు(బీఎల్‌ఏ) బీఎల్‌వోలకు సహకరిస్తారు. తొలి దశలో భాగంగా బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ ఇటీవలే పూర్తయిన సంగతి తెలిసిందే.

రెండో దశలో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్, గోవా, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఎస్‌ఐఆర్‌ను ప్రారంభించినట్లు ఈసీ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. అయితే, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే అస్సాంలో ఎస్‌ఐఆర్‌ షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. అస్సాంలో ప్రజల పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రక్రియ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కొనసాగుతోంది. అక్కడ ఎస్‌ఐఆర్‌ షెడ్యూల్‌ను ప్రత్యేకంగా ప్రకటించబోతున్నారు.  

కేరళలో నేడు అఖిలపక్ష భేటీ  
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యతిరేకించారు. ఓట్లు మాయం చేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై చర్చించడానికి బుధవారం అఖిలపక్ష భేటీ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. కేరళలో బీజేపీ మినహా అన్ని పార్టీలూ ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు రాజ్యాంగబద్ధత లేదని తమిళనాడులో అధికార డీఎంకే తేల్చిచెప్పింది. ఎస్‌ఐఆర్‌ విషయంలో అక్టోబర్‌ 27న ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్‌ దాఖలు చేసింది. మరోవైపు తమిళనాడులో బీజేపీ మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే ఎస్‌ఐఆర్‌ను స్వాగతించింది. ఉత్తరప్రదేశ్‌లో ‘శుద్ధ్‌ నిర్వాచక్‌ నామావళి–మజ్‌బూత్‌ లోక్‌తంత్ర’ థీమ్‌తో ఎస్‌ఐఆర్‌ ఆరంభమైంది.      

పశ్చిమ బెంగాల్‌లో రగడ 
ఎస్‌ఐఆర్‌ పట్ల పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలు మంగళవారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ పేరిట నిశ్శబ్దంగా ఓట్ల రిగ్గింగ్‌ జరుగుతోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందే ఓటర్ల జాబితాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఏమిటని మండిపడ్డారు. ఎన్నికల సంఘం అధికార బీజేపీకి తొత్తుగా మారిందని విమర్శించారు. కోల్‌కతాలో జరిగిన ఎస్‌ఐఆర్‌ వ్యతిరేక ర్యాలీలో ముఖ్యమంత్రి సైతం పాల్గొన్నారు. ఈ ప్రక్రియను ఆపాలంటూ నినదించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఎస్‌ఐఆర్‌ ప్రారంభించారని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారు. ఒక్క ఓటరుకు అన్యాయం జరిగినా సహించే ప్రసక్తే లేదన్నారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
voter list
sir
voters
details
Election Commission of India
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కొత్త ఓటర్లకు ఈసీ కొత్త రూల్‌

కొత్త ఓటర్లకు ఈసీ కొత్త రూల్‌

‘రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు’

‘రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు’

ఇందులో ఏ ఒక్కటి లేకున్నా ఓటు పోతుంది జాగ్రత్త!

ఇందులో ఏ ఒక్కటి లేకున్నా ఓటు పోతుంది జాగ్రత్త!

ఓటర్లకు అలర్ట్‌!

ఓటర్లకు అలర్ట్‌!

ఓటర్ల జాబితా సవరణ..

ఓటర్ల జాబితా సవరణ..

ఒత్తిడిలోనే ఓటర్ల సర్వే

ఒత్తిడిలోనే ఓటర్ల సర్వే

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.