Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. మెటా గ్లాస్‌.. మొబైల్‌కి లాస్‌?
ADVERTISEMENT 

మెటా గ్లాస్‌.. మొబైల్‌కి లాస్‌?

National Sakshi User Sakshi Sakshi Time May 11, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
smart.jpg

ఒక్క మాటతో ఫొటోలు, వీడియోలు తీసిపెట్టే స్మార్ట్‌ గ్లాసెస్‌

ఫోన్‌ అవసరం లేకుండానే కాల్స్‌ మాట్లాడే అవకాశం 

సంగీతం, పాడ్‌కాస్ట్‌లు వినేందుకు హెడ్‌ఫోన్లతో పనేలేదు

ఇటీవల సంయుక్తంగా ఆవిష్కరించిన మెటా– రేబాన్‌  

అదే బాటలో మరికొన్ని దిగ్గజ మొబైల్‌ కంపెనీలు

ఇవి ఇప్పటికిప్పుడు స్మార్ట్‌ఫోన్‌కుప్రత్యామ్నాయం కాబోవంటున్న నిపుణులు

ఒక్క మాట చెబితే ఫొటో క్లిక్‌మనిపిస్తుంది.. వాయిస్‌ కమాండ్‌ వినగానే వీడియో రికార్డ్‌ అయిపోతుంది. ఏ భాషలోని అక్షరాలైనా క్షణాల్లో మన భాషలోకి మారిపోయి కనిపిస్తాయి. చేతిలో ఫోన్‌ లేకుండానే ఎవరితోనైనా ఫోన్‌ మాట్లాడేయొచ్చు.. త్వరలో అందుబాటులోకి రానున్న స్మార్ట్‌ కళ్లజోళ్లు చేసే పనులివన్నీ. స్టైలిష్‌ కళ్లజోళ్లకు పేరు గాంచిన రే–బాన్‌ కంపెనీ.. మార్క్‌ జుకర్‌బర్గ్‌కు చెందిన మెటా సంయుక్తంగా అత్యాధునిక స్మార్ట్‌ గ్లాసె స్‌ను విడుదల చేశాయి. ఇవి త్వరలోనే భారత్‌లోనూ విడుదల కానున్నాయి. 

అత్యాధునిక స్మార్ట్‌ ఫోన్లు చేసే పనులన్నీ ఈ స్మార్ట్‌ కళ్లద్దాలు చేసిపెడతాయి. కంటెంట్‌ క్రియేటర్లు, వ్యాపారవేత్తలు, వేగవంతమైన కమ్యూనికేషన్‌పై ఆధారపడే వారికి ఈ గ్లాసెస్‌ గేమ్‌–ఛేంజర్‌గా నిలుస్తాయని టెక్‌ నిపుణులు అంటున్నారు. 2024 నాటికి ప్రపంచ స్మార్ట్‌ గ్లాసెస్‌ మార్కెట్‌ విలువ 18.6 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరింది. 2033 నాటికి అది 53.6 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఐఎమ్‌ఏఆర్‌సీ గ్రూప్‌ అంచనా వేస్తోంది. మెటా, ఆపిల్, గూగుల్, షావోమీ, సోనీ, అమెజాన్, లెన్స్‌కార్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి.      – సాక్షి, హైదరాబాద్‌

ఏమిటీ గ్లాసెస్‌ ప్రత్యేకత?
వాయిస్‌ అసిస్టెంట్‌: మెటా ఏఐతో సంభాషించి రియల్‌ టైమ్‌ సమాధానాలు పొందవచ్చు. 
ఫొటో, వీడియో క్యాప్చర్‌: వాయిస్‌ కమాండ్‌తో ఫొటోలు తీయవచ్చు. వీడియోలు కూడా రికార్డ్‌ చేయవచ్చు.
లైవ్‌ స్ట్రీమింగ్‌: ఏదైనా కార్యక్రమానికి ఇన్‌స్ట్రాగామ్‌ లేదా ఫేస్‌బుక్‌లో నేరుగా ప్రసారం చేయవచ్చు.
సంగీతం, పాడ్‌కాస్ట్‌లు: ఇయర్‌బడ్స్‌ లేకుండానే సంగీతం లేదా పాడ్‌కాస్ట్‌లు వినవచ్చు. 
ఫోన్‌ కాల్స్‌: బిల్ట్‌–ఇన్‌ మైక్రోఫోన్లు, స్పీకర్లు ఈ అద్దాల్లో ఉంటాయి కాబట్టి ఫోన్‌ కాల్స్‌ చేయవచ్చు. కాల్స్‌ స్వీకరించవచ్చు. 
లైవ్‌ ట్రాన్స్‌లేషన్‌: విదేశీ భాషల సైన్‌బోర్డ్‌లను తక్షణం మనకు తెలిసిన భాషలోకి అనువదించగలవు.
ఆబ్జెక్ట్‌ రికగ్నిషన్‌: మనం చూసే వస్తువులను గుర్తించి, వాటికి సంబంధించిన సమాచారాన్ని అ అద్దాలు అందిస్తాయి. ఈ కళ్లజోళ్లకు రోజువారీ ఫోన్‌ ఉపయోగాన్ని పూర్తిగా భర్తీ చేసే ఫీచర్లను జోడించే దిశగా మెటా పనిచేస్తోంది. వీటి ద్వారా యాప్‌లు, సేవలను నోటి మాటతో నియంత్రించవచ్చు. 
స్క్రీన్‌ లేని అనుభవం: ఫోన్, ఇతర ఏ రకమైన డిజిటల్‌ తెర అవస­రం లేకుండానే సమాచారం మన దృష్టి క్షేత్రంలో నేరుగా కనిపిస్తుంది.

స్మార్ట్‌ గ్లాసెస్‌ ప్రయోజనాలు..
సహజ కదలిక: స్క్రీన్‌ వైపు చూడాల్సిన అవసరం లేదు. 
మల్టీ టాస్కింగ్‌: నడుస్తూ, వంట చేస్తూ లేదా ప్రయాణిస్తూనే స్మార్ట్‌ఫోన్‌ ద్వారా చేసే అన్ని పనులు వీటితో చేసుకోవచ్చు.  
తక్కువ స్క్రీన్‌ టైమ్‌: నిరంతర ఫోన్‌ను చూస్తూ స్క్రోలింగ్‌ చేయాల్సిన అవసరం లేదు.

ఎదురయ్యే సవాళ్లు..
బ్యాటరీ లైఫ్‌: రోజంతా గ్లాసెస్‌ను చార్జ్‌లో ఉంచడం కష్టం. 
వ్యక్తిగత గోప్యత: ఎదుటివారికి తెలియకుండానే మనం వారి ఫొటోలు, వీడియోలను ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌తో తీయొచ్చు. దీంతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉంది.  
ధర: ఈ హై–టెక్‌ కళ్లద్దాల ధర సామాన్య ఫోన్ల కంటే చాలా ఎక్కువ.

అయితే, ఇవి ఇప్పటికిప్పుడు స్మార్ట్‌ఫోన్లకు పూర్తిగా ప్రత్యామ్నాయంగా మారే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. స్మార్ట్‌ వాచ్‌ల మాదిరిగా మొదట ఫోన్లకు సహాయక పరికరాలుగా ఉపయోగపడతాయి. పూర్తి స్థాయిలో ఫోన్‌ స్థానాన్ని దక్కించుకోవాలంటే మరో 10–20 ఏళ్లు పట్టే అవకాశముందని చెబుతున్నారు.  

స్మార్ట్‌ఫోన్‌ కంటే బెటర్‌.. 
త్వరలోనే ఈ గ్లాసెస్‌ స్మార్ట్‌ఫోన్లను భర్తీ చేయగలవు. కళ్ల ముందే డేటా కనిపించడం, వాయిస్‌ ఆధారంగా నడిచే విధానం వల్ల ఫోన్‌ అవసరం తగ్గుతుందనేది నా అంచనా. స్మార్ట్‌ఫోన్లతో మనం చేసే అన్ని పనులు ఇవి చేయగలవు. ఫోన్‌ను పట్టుకోవడం కంటే ముఖంపై గ్లాసెస్‌ ధరించడం సహజంగా అనిపిస్తుంది. టచ్, స్క్రోల్‌కు బదులుగా వాయిస్‌ కమాండ్స్, విజువల్స్‌తో టెక్నాలజీని ఉపయోగించే రోజు దగ్గరలోనే ఉంది.’ 
– మార్క్‌ జుకర్‌బర్గ్, మెటా సీఈఓ   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
mark zuckerberg
Smart glasses
India
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.