Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఉసురు తీసిన కంటైనర్‌ లారీ
ADVERTISEMENT 

ఉసురు తీసిన కంటైనర్‌ లారీ

National Sakshi User Sakshi Sakshi Time Dec 22, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
144.jpg

అదుపుతప్పి కారు మీదకు పల్టీ  

కారులోని ఆరుగురు కుటుంబీకుల మృతి  

బెంగళూరు నుంచి విజయపురకు ప్రయాణం..  

నెలమంగళ వద్ద హైవేలో విషాదం  

ఎక్కడో మహారాష్ట్ర సరిహద్దుల్లో పుట్టి పెరిగి, బెంగళూరుకు వచ్చారు. ఓ ఐటీ కంపెనీ నిర్వహిస్తూ ఎంతోమందికి ఉపాధినిస్తున్నారు. వీకెండ్, క్రిస్‌మస్‌ను సొంతూరిలో సంతోషంగా చేసుకుందామని కుటుంబంతో పయనమయ్యారు. కానీ అదే చివరి ప్రయాణమైంది. గంట దాటిందో లేదో.. మృత్యుఘంటికలు మోగాయి. కంటైనర్‌ లారీ యమ శకటంలా వచ్చి ఆ కారు మీద పడింది. అంతే.. కుటుంబ యజమానితో పాటు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు బంధువుల ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. రోడ్‌ టెర్రర్‌ విషాదానికి ఇది తాజా ఉదాహరణ.

దొడ్డబళ్లాపురం: రాజధాని సమీపంలో తుమకూరు– బెంగళూరు జాతీయ రహదారి మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కంటైనర్‌ లారీ.. కారు మీదకు పడడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 6మంది మృత్యువాత పడ్డారు. బెంగళూరులోని ఐఏఎస్‌టీ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ కంపెనీ యజమాని చంద్రం  యోగప్ప (48), సతీమణి గౌరాబాయి(42), పిల్లలు దీక్ష (12), ఆర్య (6), బంధువులు జాన్‌ (16), విజయలక్ష్మి (36)గా గుర్తించారు.  

కొంత సేపటికే..  
వివరాలు.. విజయపుర– మహారాష్ట్ర సరిహద్దులకు చెందిన చంద్రం యోగప్ప బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లో నివాసం ఉంటూ ఓ చిన్నస్థాయి ఐటీ కంపెనీని నిర్వహిస్తున్నారు. వీకెండ్‌తో పాటు క్రిస్‌మస్‌ పండుగకని సొంత ఓల్వో కారులో ఊరికి బయల్దేరారు. గత అక్టోబరులో కొత్త ఓల్వో కారును కొన్నట్లు తెలిసింది. శనివారం ఉదయం సుమారు 9:30 గంటలకు ఇంటి నుంచి బయల్దేరినట్లు తెలిసింది. 60 కిలోమీటర్లు ప్రయాణించారో లేదో... ఈ దారుణ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో చంద్రం కారును నడుపుతున్నారు.  

కంటైనర్‌ అతివేగం..  
⇒ బెంగళూరు– తుమకూరు ఎన్‌హెచ్‌ మార్గంలోని తిప్పగొండనహళ్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది.  
⇒ బెంగళూరు వైపు నుంచి అనేక వాహనాలు తుమకూరు వైపు వెళ్తున్నాయి. వీకెండ్‌ కావడంతో హైవే రద్దీగా ఉంది.  
⇒ కంటైనర్‌ లారీ, పక్క లేన్‌లో చంద్రం కుటుంబం ఓల్వో కారు వెళ్తోంది. కంటైనర్‌ ముందు వెళ్తున్న నందిని పాల వ్యాన్, కారును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో అదుపుతప్పి లేన్‌ దాటి వెళ్లింది, అలా చంద్రం ఓల్వో కారు మీద పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.  
⇒  ఈ రభసకు కారు పూర్తిగా తుక్కయింది. కారులోని వారికి ఏం జరిగిందో తెలిసేలోగా నుజ్జునుజ్జయి ప్రాణాలు కోల్పోయారు. ఈ కంటైనర్‌తో పాటు పాల వ్యాన్‌ బోల్తా పడగా, ఆ డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి.  

స్థానికుల చొరవ  
వెంటనే స్థానిక యువకులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కంటైనర్‌ కింద నుంచి కారును బయటకు తీయడానికి శ్రమించారు. క్రేన్లను తెప్పించి కంటైనర్‌ను పక్కకు జరిపించారు. ఇంతలో స్థానిక పోలీసులు చేరుకున్నారు. అతి కష్టం మీద కారులోని మృతదేహాలను బయటకు తీశారు. ఉదయం 11 గంటలకు దుర్ఘటన జరిగితే మధ్యాహ్నం 1 గంట వరకు కారును బయటకు లాగే పని కొనసాగింది. ఈ ప్రమాదంలో హైవేలో అటు ఇటు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జాం నెలకొంది. వాట్సాప్‌ గ్రూప్‌లలో ఈ సమాచారం వేగంగా వ్యాపించింది. తమ యజమాని కుటుంబం దుర్మరణం పాలైందని తెలిసి హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లో ఉన్న ఐఏఎస్‌టీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సిబ్బంది షాక్‌కు గురయ్యారు. 2018లో ప్రారంభమైన ఈ కంపెనీలో 100మందిపైగా పని చేస్తున్నారు. కొందరు వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరారు. మరికొందరు లాగౌట్‌ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. విజయపుర వద్ద మొరబగి గ్రామంలో ఉండే యోగప్ప తల్లితండ్రులయిన ఈరగొండ, జక్కవ్వలకు ప్రమాదం విషయం ఇంకా చెప్పలేదని తెలిసింది.

అలా జరిగిపోయింది కంటైనర్‌ డ్రైవర్‌
దొడ్డబళ్లాపురం: ముందు వెళ్తున్న కారును తప్పించబోయి ఈ ఘోరం జరిగిందని కంటైనర్‌ లారీ డ్రైవర్‌ ఆరిఫ్‌ చెప్పాడు. ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుర్ఘటన గురించి మీడియాతో మాట్లాడుతూ.. ముందు వెళ్తున్న కారు సడన్‌గా బ్రేక్‌ వేయడంతో ఢీకొనకుండా తప్పించబోయి స్టీరింగ్‌ తిప్పడంతో వాహనం పక్కకి దూసుకుపోయిందన్నాడు. ఇంత ఘోరం జరిగినట్టు తనకు తెలీదని,  విషయం తెలిసి చాలా భాధగా ఉందని ఆరిఫ్‌ అన్నారు. మరోవైపు ప్రమాదంపై నెలమంగల డీఎస్పీ జగదీష్‌ సమగ్ర విచారణ చేయనున్నారు.

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Road Accident
Crime News
Container lorry
car
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్‌

శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

షాబాద్‌ హత్యకేసుల నిందితుడు రాజ్‌కుమార్‌ మృతి

షాబాద్‌ హత్యకేసుల నిందితుడు రాజ్‌కుమార్‌ మృతి

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

మరో ఎన్‌కౌంటర్‌: నకిలీ నోట్ల అక్రమ రవాణాదారు అజయ్‌పై కాల్పులు

మరో ఎన్‌కౌంటర్‌: నకిలీ నోట్ల అక్రమ రవాణాదారు అజయ్‌పై కాల్పులు

మేడారంలో విషాదం..

మేడారంలో విషాదం..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.