Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. జిలేబీ, సమోసాలపై ఆరోగ్య హెచ్చరికలు! 
ADVERTISEMENT 

జిలేబీ, సమోసాలపై ఆరోగ్య హెచ్చరికలు! 

National Sakshi User Sakshi Sakshi Time Jul 15, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
SAMOSA.jpg

పకోడీ, చాయ్‌ బిస్కట్‌ వంటి అన్ని చిరుతిళ్లపైనా 

సిగరెట్‌ ప్యాకెట్లపై తరహాలో ముద్రణ:  కేంద్రం 

ప్రయోగాత్మకంగా నాగపూర్‌ ఎయిమ్స్‌లో శ్రీకారం 

నూనెలు, కొవ్వు, చక్కెర శాతం తెలిసేలా పోస్టర్లు 

న్యూఢిల్లీ: సిగరెట్‌ ప్యాకెట్‌పై ‘ఆరోగ్యానికి హానికరం’ అంటూ విధిగా కనిపించే హెచ్చరిక ఇకపై అన్నిరకాల చిరుతిళ్లపైనా దర్శనమివ్వనుంది. జిలేబీ, సమోసా, పకోడీ, వడా పావ్‌ మొదలుకుని చాయ్‌ బిస్కట్‌ దాకా దాదాపుగా అన్నిరకాల చిరుతిళ్ల ప్యాకెట్లపైనా వాటిలోని నూనెలు, చక్కెర, కొవ్వు తదితరాల శాతాన్ని ప్రముఖంగా ముద్రించనున్నారు.

 జీవనశైలికి సంబంధించిన పలు రకాల వ్యాధులకు హెచ్చు మోతాదులో నూనెలు, చక్కెర తదితరాలే కారణంగా మారుతున్న నేపథ్యంలో అనారోగ్యకర ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహనను పెంచడమే ఈ చర్య ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది.

 దేశంలోనే తొలిసారిగా దీన్ని నాగపూర్‌ ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టనున్నారు. ఇందులో భాగంగా క్యాంపస్‌లోని కేఫ్టేరియాలు, ఫుడ్‌ కౌంటర్లు తదితర పక్కనే అందురూ తేలిగ్గా చదవడానికి వీలయ్యేలా పెద్ద అక్షరాలతో కూడిన భారీ పోస్టర్లు, హెచ్చరిక బోర్డులు పెడతారు. వాటిని తరచూ తింటే తలెత్తే ఆరోగ్య సమస్యలను వివరంగా ఏకరువు పెడతారు. అనంతరం దీన్ని కొద్ది నెలల్లో దేశమంతటికీ విస్తరిస్తారు. 

నిషేధం కాదన్న కేంద్ర ప్రభుత్వం 
చిరుతిళ్లలో ఇమిడి ఉండే ఆరోగ్యసమస్యల గురించి అధికారిక లెటర్‌హెడ్లు, కవర్లు, నోట్‌ప్యాడ్లు, ఇతర ప్రచురణల్లో ఆరోగ్య సందేశాలను విధిగా ప్రచురించాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఆ శాఖ కార్యదర్శి పుణ్యసలిల శ్రీవాత్సవ జూన్‌ 21న ఈ మేరకు వాటికి లేఖలు రాశారు. సమోసా, వడా పావ్‌ తదిత సంప్రదాయ చిరుతిళ్లతో పాటు పిజ్జాలు, బర్గర్లు, డోనట్లను వంటి విదేశీ స్నాక్స్‌ను ఈ జాబితాలో చేర్చాలని సబార్డినేట్‌ లెజిస్లేషన్‌పై పార్లమెంటరీ కమిటీ చైర్మన్, శివసేన ఎంపీ మిలింద్‌ దేవ్‌రా సూచించారు. అయితే ఈ చర్య సమోసా, జిలేబీ, పకోడీ వంటి పాపులర్‌ చిరుతిళ్లపై నిషేధం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ‘‘కేవలం వాటని తినడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం, తద్వారా జీవన శైలి వ్యాధుల ముప్పును కనీస స్థాయికి తగ్గించడమే మా లక్ష్యం’’ అని వివరించింది.  

పెను సమస్యగా... భారత్‌లో ఆరోగ్య సంక్షోభం నానాటికీ పెరుగుతూ వస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణాల్లో అతిగా వేయించిన, చక్కెర తదితరాల శాతం ఎక్కువగా ఉండే స్నాక్స్‌ వాడకం ఒకటని గుర్తించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025 కల్లా భారత్‌లో ఏకంగా 44 కోట్ల మంది స్థూలకాయులుగా మారడం ఖాయమని ప్రఖ్యాత లాన్సెట్‌ జర్నల్‌ ఇటీవల ప్రచురించిన అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరించింది. ‘‘దేశవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దల్లో కూడా స్థూలకాయ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఐదుగురిలో ఒకరి కంటే ఎక్కువగా అధిక బరువుతో బాధ పడుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5) ఎత్తిచూపింది.

హెచ్చరికలు వేటిపై? 
సమోసా, జిలేబీ, పకోడీ, వడా పావ్, కచోరీ, పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్‌ ఫ్రైస్, గులా బ్‌ జామూన్, చాక్లెట్‌ పేస్ట్రీ లు, అన్నిరకాల శీతల పానీయాలు తదితరాలు  
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Jalebi
samosa
Pakodi
Health Problems
Obese
Street food
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

లండన్‌ వీధుల్లో గోరియాదేవి సమోసాలు, ఫన్నీవీడియో వైరల్‌

లండన్‌ వీధుల్లో గోరియాదేవి సమోసాలు, ఫన్నీవీడియో వైరల్‌

ఆ గాలి పీల్చితే రోగాలే

ఆ గాలి పీల్చితే రోగాలే

ఐఏఎస్‌లం.. అన్నీ తెలుసనుకోవద్దు

ఐఏఎస్‌లం.. అన్నీ తెలుసనుకోవద్దు

ఓటీసీ 'మందు'

ఓటీసీ 'మందు'

బంగారం చూస్తే అలా..వీడేమో ఇలా!

బంగారం చూస్తే అలా..వీడేమో ఇలా!

దావోస్‌లో బిలియనీర్ల నోరు ఊరిస్తున్న కిచిడీ

దావోస్‌లో బిలియనీర్ల నోరు ఊరిస్తున్న కిచిడీ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.