Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. శబరిమలలో జనమేజనం..! భక్తులపై ఆంక్షలు
ADVERTISEMENT 

శబరిమలలో జనమేజనం..! భక్తులపై ఆంక్షలు

National Sakshi User Sakshi Sakshi Time Nov 19, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Sabarimala.jpeg

ఇకపై 20 వేల మందికే స్పాట్ బుకింగ్

ఆ సంఖ్య దాటితే.. తర్వాతి రోజు స్లాట్ కేటాయింపు

నీలక్కల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

అయ్యప్ప దర్శనానికి 6 గంటల సమయం

కుప్పకూలి మృతిచెందిన 58 ఏళ్ల భక్తురాలు

పథనంతిట్ట: ముందెన్నడూ లేనివిధంగా మండల పూజ ప్రారంభం నుంచే శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. ఆదివారం సాయంత్రం సన్నిధానంలో అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకోగా.. సోమవారం రికార్డు స్థాయిలో 1.25 లక్షల మంది భక్తులు ఆ హరిహరపుత్రుడిని దర్శించుకున్నారు. నిజానికి ఆన్‌లైన్ (www.sabarimalaonline.org)లో రోజుకు 70 వేల మందికి స్లాట్ బుకింగ్ అవకాశం కల్పించారు. అదనంగా 20వేల మందికి స్పాట్ బుకింగ్‌కు ఏర్పాట్లు చేశారు. అయితే.. సోమవారం ఏకంగా 37 వేల మంది భక్తులు స్పాట్ బుకింగ్ చేసుకున్నారని, అందుకే రద్దీ విపరీతంగా పెరిగిందని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధికారులు చెబుతున్నారు. 


 

భారీ క్యూలైన్లు

సోమవారం నుంచి నీలక్కల్, పంపాబేస్, శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా.. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు కనిపిస్తున్నారు. పంపా కంట్రోల్ రూమ్ వద్ద బస్సు దిగిన భక్తులు త్రివేణీ బ్రిడ్జిని దాటడానికి అరగంట పట్టిందని, అక్కడి నుంచి పంపా గణపతి ఆలయానికి చేరుకోవడానికి గంట సమయం పట్టిందని కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌కు చెందిన సుందరేశ అనే భక్తుడు ‘సాక్షి డిజిటల్’కి వివరించారు. ఇక శరణ్‌గుత్తి ప్రాంతంలోనూ నిమిషానికి నాలుగు అడుగులు వేసేలా రద్దీ ఉందని హైదరాబాద్‌కు చెందిన పవన్ కుమార్ గురుస్వామి వివరించారు. మారక్కూటం నుంచి 18 మెట్ల వరకు గంట సమయం.. పదునెట్టాంబడిని అధిరోహించాక.. అయ్యప్ప స్వామి దర్శనానికి మరో గంట పడుతోందని పేర్కొన్నారు. వృద్ధులు, చిన్నారులను నేరుగా ధ్వజస్తంభం నుంచి అయ్యప్ప దర్శనానికి వదులుతున్నా.. 18 మెట్లను చేరేవరకు వారికి ఇబ్బందులు తప్పడం లేదని సైదాబాద్‌కు చెందిన రవికుమార్ గురుస్వామి తెలిపారు. నీలిమలను అధిరోహించినప్పటి నుంచి భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకోవడానికి 6 గంటల సమయం పడుతున్నట్లు వివరించారు.

 

నీలక్కల్‌లోనే నిలిపివేత

భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పంపాలో స్పాట్ బుకింగ్ కౌంటర్ల సంఖ్యను 7కు పెంచినట్లు అధికారులు తెలిపారు. అయితే.. పంపా బేస్‌లో రద్దీని బట్టి ఆన్‌లైన్ బుకింగ్ లేని భక్తులను నీలక్కల్‌లో నిలిపివేస్తున్నామన్నారు. నీలక్కల్‌లో భక్తులకు వసతి సదుపాయాలున్నాయని వెల్లడించారు. అటు పంపాబేస్ నుంచి నీలిమలను అధిరోహించాక శరణ్‌గుత్తి, మారక్కూటం క్యూకాంప్లెక్సుల్లో తాగునీరు, స్నాక్స్, టీ, కాఫీ అందజేసే వెసులుబాట్లు కల్పిస్తామన్నారు. ప్రతిచోట సిబ్బందిని నియమించామన్నారు. రద్దీని అదుపుచేయడానికి ఎక్కడికక్కడ పోలీసులను మోహరించినట్లు అదనపు డీజీపీ ఎస్.శ్రీజిత్ వివరించారు. భక్తులు పరిస్థితిని అర్థం చేసుకుని, పోలీసులకు సహకరించాలని కోరారు. ‘‘సోమవారం 20 వేల మందికి స్పాట్ బుకింగ్‌కు ఏర్పాట్లు చేశాం. అయితే.. 37 వేల మంది భక్తులు వచ్చారు. అందుకే.. బుధవారం నుంచి 20 వేల స్పాట్ బుకింగ్ నిబంధనను కచ్చితంగా పాటిస్తాం. అదనంగా వచ్చే భక్తులకు తర్వాతి రోజు స్లాట్లను కేటాయిస్తాం’’ అని ఆయన వెల్లడించారు. ఈ సీజన్‌లో మంగళవారం మధ్యాహ్నం వరకు 1.97 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు తెలిపారు.

 


నీలక్కల్ వద్ద భారీగా ట్రాఫిక్

శబరిమలకు వ్యక్తిగత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో.. ఎరుమేలి-పంపా, రాణి-పంపా మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు నెలకొంటున్నాయి. ముఖ్యంగా ప్లాపల్లి, నీలక్కల్ వద్ద వాహనాలు నత్తనడకను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాగా.. అప్పాచిమేడు ప్రాంతంలో ఓ భక్తురాలు కుప్పకూలి మృతిచెందారు. ఆమెను కోళిక్కోడ్ జిల్లా కోయిలాండికి చెందిన సతీ(58)గా పోలీసులు గుర్తించారు. భారీ క్యూలైన్ల కారణంగా ఆమె ఊపిరి ఆడక.. ఉక్కిరిబిక్కిరి అయ్యి.. మరణించినట్లు తెలుస్తోంది.

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
sabarimala
Sabarimala Ayyappa
Sabarimala Ayyappa Temple
Sabarimala Ayyapppa shrine
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శబరిమల మహిళల ప్రవేశం.. మళ్లీ చర్చల్లోకి..

శబరిమల మహిళల ప్రవేశం.. మళ్లీ చర్చల్లోకి..

శబరిమలలో రద్దీ నియంత్రణకు ఏఐ టెక్నాలజీ

శబరిమలలో రద్దీ నియంత్రణకు ఏఐ టెక్నాలజీ

ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నీలినీడలు

ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నీలినీడలు

ఉత్తరాంధ్ర శబరిమల (అయ్యప్ప స్వామి దేవాలయం) ఎక్కడ ఉందో తెలుసా (ఫొటోలు)

ఉత్తరాంధ్ర శబరిమల (అయ్యప్ప స్వామి దేవాలయం) ఎక్కడ ఉందో తెలుసా (ఫొటోలు)

ఎరుమేలిలో కొత్త చెక్ డ్యామ్ నిర్మాణం

ఎరుమేలిలో కొత్త చెక్ డ్యామ్ నిర్మాణం

భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం మీనమాస పూజలు

భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం మీనమాస పూజలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.