Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ‘నేనే ఒరిజినల్‌ సీఎం..’ బీహార్‌ రాజకీయాల్లో నాటకీయ పరిణామం
ADVERTISEMENT 

‘నేనే ఒరిజినల్‌ సీఎం..’ బీహార్‌ రాజకీయాల్లో నాటకీయ పరిణామం

National Sakshi User Sakshi Sakshi Time Aug 30, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Tejaswi_Latest_News.jpg

బీహార్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ఓటర్‌ అధికార్‌ యాత్రలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఈ పరిణామం అక్కడి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

బీహార్‌లో రాహుల్‌ గాంధీ చేపట్టిన ఓటర్‌ అధికార యాత్ర పాట్నా సభతో పూర్తి కానుంది. ఈ రోజు యాత్ర సరన్ జిల్లా చాప్రా నుంచి ప్రారంభమై, ఆరా, భోజ్‌పూర్ మీదుగా సాగింది. బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ను ‘కాపీక్యాట్‌ సీఎంగా’ అభివర్ణిస్తూ ఆరాలో నిర్వహించిన ర్యాలీలో తేజస్వి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

నితీశ్‌ నా విధానాలను కాపీ కొడుతూ.. ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, తేజస్వి ప్రజల్లోకి దూసుకుపోతుంటే..  ఈ ప్రభుత్వం మాత్రం వెనుకబడిపోయింది. మీకు సిసలైన సీఎం కావాలా? లేదంటే నకిలీ సీఎం కావాలా? అంటూ తేజస్వి మాట్లాడారు. తద్వారా తనను తాను సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ ప్రకటించుకున్నట్లైంది. ఆ సమయంలో రాహుల్‌ గాంధీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌లు తేజస్విని చూస్తూ ఉండిపోయారు.

కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అయినప్పటికీ.. బీహార్‌కు ఆర్జేడీనే పెద్దన్నగా తేజస్వి గతంలో వ్యాఖ్యానించారు.  ఓటర్‌ అధికార్‌ యాత్రలో  ఈ ఇద్దరు నేతలూ కలిసే ముందుకు సాగారు. కానీ ఎక్కడా కాంగ్రెస్‌గానీ, రాహుల్‌ గాంధీగానీ అధికారికంగా బీహార్‌ సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై స్పందించలేదు. ఇదిలా ఉంటే..

కాంగ్రెస్‌-ఆర్జేడీ మధ్య సీట్ల పంపకాల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదని ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ తాజాగా కథనం ఇచ్చింది. తాము ఆశించినన్ని సీట్లు ఆర్జేడీ ఇవ్వకపోవచ్చనే యోచనలో ఉన్న కాంగ్రెస్‌.. తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రమోట్‌ చేసేందుకు ముందుకు రావడం లేదన్నది ఆ కథనం సారాంశం.

2020లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక మహాఘట్‌బంధన్‌ కూటమి తరఫున కాంగ్రెస్‌ 70 స్థానాల్లో పోటీ చేసి.. కేవలం 19 స్థానాల్లో ెగ్గింది. అయితే ఈసారి కూడా అన్నే స్థానాలను కాంగ్రెస్‌ ఆశిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్‌ లేదంటే నవంబర్‌లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 35 ఏళ్ల తేజస్వి యాదవ్‌ గతంలో రెండుసార్లు డిప్యూటీ సీఎంగా పని చేశారు.

ఓటర్‌ అధికార్‌ యాత్ర బీహార్‌లో ఆరా (Ara) పట్టణంలో 2025 ఆగస్టు 30న జరిగింది. ఈ రోజు యాత్ర సరన్ జిల్లా చాప్రా నుంచి ప్రారంభమై, ఆరా, భోజ్‌పూర్ మీదుగా సాగింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Bihar
Tejaswi Yadav
RJD
Rahul Gandhi
Mahagathbandhan
CM candidate
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

‘ఎన్‌టీఏ అబుదాబి’ నిర్వాకంపై రాహుల్‌ నిప్పులు!

‘ఎన్‌టీఏ అబుదాబి’ నిర్వాకంపై రాహుల్‌ నిప్పులు!

ఇండియా కూటమిలో చేరనున్న డీఎంకే..?

ఇండియా కూటమిలో చేరనున్న డీఎంకే..?

రీ-నీట్‌ రగడలో మరో రాజకీయ తుపాన్‌.. రాహుల్‌ పోరాట పిలుపు

రీ-నీట్‌ రగడలో మరో రాజకీయ తుపాన్‌.. రాహుల్‌ పోరాట పిలుపు

అశ్లీల, కుల వివక్ష పాటలు పెడితే ఇక జైలుకే!

అశ్లీల, కుల వివక్ష పాటలు పెడితే ఇక జైలుకే!

కాంగ్రెస్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. 12 రోజుల్లో 4 సమావేశాలు..

కాంగ్రెస్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. 12 రోజుల్లో 4 సమావేశాలు..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.