Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఇంద్రధనస్సు ఇక భారత్‌ కనిపించదు..!
ADVERTISEMENT 

ఇంద్రధనస్సు ఇక భారత్‌ కనిపించదు..!

National Sakshi User Sakshi Sakshi Time Aug 23, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
545.jpg

భవిష్యత్తులో భారత్‌లో కనిపించకపోవచ్చంటున్న శాస్త్రవేత్తలు 

అత్యంత అరుదుగా కనిపించే అవకాశం ఉందన్న అధ్యయనం

ఇంద్రధనస్సు. కొత్త ఆనందాలకు ఉషస్సు. ఆకాశంలో హరివిల్లు కనిపించిందంటే చాలు చిన్నారులు మొదలు పెద్దల దాకా అందరూ ఆసక్తిగా చూస్తారు. రంగురంగుల ఇంద్రధనస్సు ఎంతో మందికి ప్రేమానురాగాల విరిజల్లును కురిపిస్తుంది. వర్షం ఆగిపోగానే, కొన్ని సార్లు చిరుజల్లులు పడుతున్నప్పుడే వినీలాకాశంలో అర్థచంద్రాకృతి ఆవిష్కృతమై కనువిందు చేస్తుంది. హరివిల్లులోని రంగులను లెక్కబెట్టేవాళ్లు కొందరైతే ఆ మొత్తం హరివిల్లు తమకు పూర్తిగా కనిపించట్లేదే అని బాధపడే వాళ్లు ఇంకొందరు. భారతీయులు మెచ్చే అందాల ఇంద్రధనస్సు ఇకపై కనిపించకపోచ్చన్న చేదు నిజాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందమొకటి నిర్ధారించింది. కాలుష్యం, భూతాపోన్నతి, వాతావరణ మార్పులు కారణంగా మళ్లీ మార్చలేనంతగా మారిపోతున్న వాతావరణ పరిస్థితుల కారణంగానే హరివిల్లు అంతర్థానమయ్యే అవకాశాలు బాగా పెరిగిపోయాయని అధ్యయన బృందం వెల్లడించింది. ఈ పరిశోధనా తాలూకు వివరాలు తాజాగా ‘గ్లోబల్‌ ఎని్వరోన్మెంటల్‌ ఛేంజ్‌’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.  

కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం 
ఆనందానికి, ఆశకు ప్రతిరూపంగా కనిపించే ఇంద్రధనస్సు భారతదేశంతోపాటు మరికొన్ని దేశాల్లో ఏర్పడే అవకాశాలు బాగా సన్నగిల్లుతున్నాయని అధ్యయనం పేర్కొంది. వర్షపాతం నమోదయ్యే రేటు, మేఘావృతమయ్యే పరిస్థితులు ఇటీవలికాలంలో వాతావరణ మార్పుల కారణంగా మారిపోయాయి. వర్షం పడినప్పుడు తప్పితే మిగతా సందర్భాల్లో హరివిల్లు కనిపించదు. ఈ దృగి్వíÙయం ప్రకారమే వర్షాలకు, ఇంద్రధనస్సు ఆవిర్భావ సందర్భాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎక్కడైతే వర్షాలు తగ్గిపోతాయో అక్కడ హరివిల్లు అంతర్థానమవుతుంది. మేఘాల్లోని నీటి ఆవిరి వర్షపు చినుకులుగా మారే సందర్భాల్లో వాటి మీదుగా సూర్యకాంతి ప్రసరించి పరావర్తనం చెందినప్పుడు దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంద్రధనస్సు కనిపిస్తుంది. 

ఇలా ఏర్పడిన హరివిల్లులను తమ కెమెరాల్లో బంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు శాస్త్రవేత్తలకు పంపించారు. అలా వేర్వేరు ఖండాల్లో భిన్న ప్రాంతాల్లో ఏర్పడిన హరివిల్లు ఛాయాచిత్రాలతో ఒక పేద్ద డేటాబేస్‌ను అధ్యయనకారులు సిద్ధంచేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత వాతావరణ మార్పులు, వాతావరణ పరిస్థితులను క్రోడీకరించి భవిష్యత్తు వాతావరణ అంచనాలను రాబట్టారు. దీంతో ప్రస్తుతం ప్రపంచంలో ఏడాదికి 117 రోజులపాటు ఇంద్రధనస్సులు ఏర్పడుతుండగా భవిష్యత్తులో మరింతగా ఏర్పడే అవకాశాలు ఉండటం విశేషం. 2100 ఏడాదికల్లా మరో 4 నుంచి 4.9 శాతం అధికంగా ఇంద్రధనస్సులు ఏర్పడొచ్చని శాస్త్రవేత్తలు అంచానావేశారు. అయితే అన్ని దేశాల్లో సమసంఖ్య ఏర్పడకుండా కొన్ని చోట్ల అత్యధికంగా, కొన్ని దేశాల్లో అత్యల్పంగా ఏర్పడతాయిన తేలింది. అత్యల్పంగా ఏర్పడే దేశాల్లో భారత్‌ కూడా ఉంది. 

భారత్‌లోనే ఎందుకు తక్కువ?
మంచుమయ ప్రదేశాలతో పోలిస్తే మైదానాల వంటి నేలమయ ప్రాంతాల్లో హరివిల్లు ఏర్పడే అవకాశాలు 21 శాతం నుంచి 34 శాతం తగ్గిపోతున్నాయని అధ్యయనం తెలిపింది. మిగతా ప్రాంతాల్లో ఇంద్రధనస్సు ఏర్పడే అవకాశాలు 66 నుంచి 79 శాతం మెరుగుపడ్డాయి. చల్లటి, పర్వతమయ ప్రాంతాల్లోనే హరివిల్లులు అధికంగా ఏర్పడే ఛాన్సుంది. అధిక జనాభా దేశాల్లో ఇంద్రధనస్సు కనివిందు చేయడం తగ్గిపోనుంది. ఆర్కిటిక్, హిమాలయాల్లో రెయిన్‌బో ఏర్పడే సంభావ్యత అధికంగా ఉందని గణాంకాల్లో తేలింది. సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో ఉండే ప్రదేశాల్లో హరివిల్లు సాక్షాత్కార ఘటనలు అధికంకానున్నాయి. 

భూమధ్యరేఖ నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఇంద్రధనస్సు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఆ లెక్కన భారతదేశం భూమధ్యరేఖకు సమీపంలో ఉంది. భూమధ్యరేఖకు దూరంగా ఉండే అంటార్కిటి ఖండం వంటి ప్రదేశాల్లో అత్యధికంగా హరివిల్లులు ఎక్కువగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు అంచనావేశారు. ఇప్పటికైనా కట్టుతప్పిన శిలాజఇంధన అతి వినియోగం, అడవుల నరికివేత, దారుణంగా పెరిగిపోయిన కాలుష్యం వంటివి తగ్గిపోతే భారత్‌ను హరివిల్లులు వదిలిపోవని భావించవచ్చు. ఆ మేరకు ప్రజల జీవనశైలిలో మార్పులొస్తాయని, ఆ మేరకు మళ్లీ హరివిల్లులు సందడి చేస్తాయని ఆశిద్దాం.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Rainbow
India
changing
Disappear
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.