Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. టికెట్ల కోసం పైరవీలు వద్దు..  క్షేత్రస్థాయిలో నిలబడండి..!
ADVERTISEMENT 

టికెట్ల కోసం పైరవీలు వద్దు..  క్షేత్రస్థాయిలో నిలబడండి..!

National Sakshi User Sakshi Sakshi Time Jan 27, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
rahu.jpg

ఉపన్యాసాలు చాలు... ఏసీ గదులు వదిలి రోడ్డెక్కండి.. 

పెద్దల చుట్టూ ప్రదక్షిణలు వద్దు.. వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యం

గ్రూపు రాజకీయాలకు చెక్‌.. జిల్లా అధ్యక్షులే ఇక నా సేనాపతులు

ఓటరు జాబితాల నుంచి వ్యవస్థల వరకు అన్నీ బీజేపీ గుప్పిట్లోనే!

ప్రతి బూత్‌లో నిఘా పెట్టండి.. క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉండండి

కురుక్షేత్ర వేదికగా కాంగ్రెస్‌ శ్రేణులకు రాహుల్‌ గాంధీ దిశానిర్దేశం

సాక్షి, న్యూఢిల్లీ: ‘రాజకీయమంటే మైకుల ముందు ఉపన్యాసాలు దంచడం కాదు.. ఓటరు జాబితాలో అక్రమాలను అడ్డుకోవడం! ఏసీ గదుల్లో కూర్చుని రాజకీయాలు నడిపే రోజులు పోయాయి.. ఇకపై ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుగ్గా నిలబడాల్సిందే. బీజేపీని ఎదుర్కోవాలంటే కేవలం ప్రసంగాలు సరిపోవు.. బూత్‌ స్థాయి పోరాటమే శరణ్యం’అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

 హరియాణాలోని కురుక్షేత్రలో జరిగిన పార్టీ శిక్షణ శిబిరంలో ఆయన 2029 ఎన్నిక లను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలకు తగు హెచ్చరి కలు చేశారు. బీజేపీ అధికార బలంతో వ్యవస్థలను హైజాక్‌ చేస్తోందంటూ ఆయన.. ‘కాంగ్రెస్‌ నాయకులు ఇకపై యుద్ధం చేయాల్సింది వేదికలపై కాదు, ఓటరు జాబితాలపై’అని స్పష్టం చేశారు.

అసలు కథ బూత్‌లోనే ఉంది..
బీజేపీ గెలుపు గురించి రాహుల్‌గాంధీ మాట్లాడుతూ, ‘వాళ్లు కేవలం ప్రచారంతో గెలవడం లేదు. అధికార యంత్రాంగాన్ని వాడుకుని ఓటరు లిస్టుల ను ట్యాంపర్‌ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకున్నారు. అందుకే మన నిఘా బూత్‌ స్థాయి నుంచే మొదలుకావాలి. ప్రతీ గల్లీలో పహారా కాయాలి. నిరుద్యోగం, రైతు సమస్యలు, ధరల పెరు గుదల వంటి అంశాలను ఆయుధాలుగా మలుచు కుని జనంలోకి వెళ్లాలి’అని పిలుపునిచ్చారు. బీజేపీ పాలనా తీరుపై రాహుల్‌ గాంధీ నిప్పులు చెరిగారు. 

ప్రధాని మోదీ, బీజేపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కేవలం ప్రచారం, ఈవెంట్ల మయంగా మార్చేశారని ధ్వజమెత్తారు. ‘ప్రకటనలు, ఆర్భాటాలతో ప్రజాస్వా మ్యం బతకదు. బీజేపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని వాడుకుంటోంది. ఓటరు జాబితా నుంచి ఈవీఎంల నిర్వహణ వరకు ప్రతి చోటా వారి కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయి. హరియా ణాలో ఓట్ల గల్లంతు, దొంగ ఓట్ల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. అందుకే కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇకపై ప్రతి గల్లీలో, ప్రతి బూత్‌లో కాపలాదారులుగా మారాలి. కేవలం ఓట్లు అడగడమే కాదు.. మన ఓట్లను కాపాడుకోవడం కూడా యుద్ధంలో భాగమే’అని రాహుల్‌ ఉద్బోధించారు.

నేనే రాజు అనుకుంటే కుదరదు..
సొంత పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, పైరవీ రాజకీయాలపై రాహుల్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. వేదికపై ఉన్న సీనియర్‌ నేతలను ఉద్దేశించి పరోక్షంగా చురకలు అంటించారు. ‘కొందరు నేతలు తమను తాము పార్టీ కంటే గొప్పవారని, తాము లేకపోతే పార్టీయే లేదని భ్రమపడుతున్నారు. అలాంటి వారి వెనుక తిరగడం, వారి కోటరీలలో చేరడం జిల్లా అధ్యక్షులు మానుకోవాలి.

 టికెట్ల కోసం ఢిల్లీలో సిఫార్సులు, పెద్దల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసే సంస్కృతికి కాలం చెల్లింది. గ్రూపు రాజకీయాలను నేను సహించను. ఎవరైతే క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉంటారో వారికే భవిష్యత్తు ఉంటుంది. మీరే క్షేత్రస్థాయిలో సేనాపతులు. ఎవరి బెదిరింపులకు లొంగకండి. కష్టపడి పనిచేసే వారికే టికెట్‌ దక్కుతుంది తప్ప.. సిఫార్సులతో వచ్చే వారికి కాదు,’అని రాహుల్‌ తేల్చి చెప్పారు. 

బీజేపీకి చెక్‌ పెట్టాల్సిందే
సంస్థాగతంగా ఎంతో పటిష్టంగా ఉన్న బీజేపీని ఢీకొట్టేందుకు డేటా మేనేజ్‌మెంట్, బూత్‌ స్థాయి కమిటీలే కీలకమని రాహుల్‌ స్పష్టం చేశారు. ప్రచార ఆర్భాటాల కంటే, క్షేత్రస్థాయి నిఘానే 2029లో కాంగ్రెస్‌ను గెలిపిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సంస్థాగతంగా ఎంతో పటిష్టంగా ఉన్న బీజేపీ యంత్రాంగాన్ని ఢీకొట్టేందుకు కాంగ్రెస్‌ కూడా సాంకేతికతను, డేటాను నమ్ముకోవాలని రాహుల్‌ పిలుపునిచ్చారు. బూత్‌ మేనేజ్‌మెంట్‌లో డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించుకోవాలని, ఇది బీజేపీ సంస్థాగత బలానికి గట్టి పోటీ ఇస్తుందని ఆయన సూచించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
voter list
Congress Party
Rahul Gandhi
haryana
Kurukshetra
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

ఒత్తిడిలోనే ఓటర్ల సర్వే

ఒత్తిడిలోనే ఓటర్ల సర్వే

అలనాటి అస్త్రాలు...  ఎంత శక్తిమంతాలు?

అలనాటి అస్త్రాలు...  ఎంత శక్తిమంతాలు?

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ అక్రమాలు, లోపాలమయం

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ అక్రమాలు, లోపాలమయం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.