Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత: ప్రధాని మోదీ
ADVERTISEMENT 

జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత: ప్రధాని మోదీ

National Sakshi User Sakshi Sakshi Time Sep 22, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
modi.jpg

దేశవ్యాప్తంగా అభివృద్ధి ఇక వేగవంతం  

స్వదేశీ ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం  

పేదలు, మధ్య తరగతి సహా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి  

దేశంలో ప్రతి ఇంటినీ స్వదేశీకి ప్రతీకగా మార్చుకోవాలి  

దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు  

పౌరులకు ‘డబుల్‌ బొనాంజా’ ఇచ్చామని స్పష్టీకరణ  

న్యూఢిల్లీ: తదుపరి తరం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలతో దేశవ్యాప్తంగా అభివృద్ధి వేగం పుంజుకోనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ సాధన దిశగా ఇది అతిపెద్ద, కీలకమైన అడుగు అని అభివర్ణించారు. దేశ సౌభాగ్యం కోసం స్వదేశీ ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచే అమల్లోకి రాబోతున్నాయని, నిత్యావసరాల ధరలు తగ్గుతాయని, పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. 

నవరాత్రులను పురస్కరించుకొని ప్రధాని మోదీ ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘స్వదేశీ’ ఉద్యమం దేశ స్వాతంత్య్ర పోరాటానికి కొత్త శక్తిని ఇచి్చందని గుర్తుచేశారు. ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులు ఉపయోగించుకుంటే దేశ ఆర్థిక ప్రగతికి నూతన బలం చేకూరుతుందని వెల్లడించారు. దేశంలో ప్రతి ఇంటినీ స్వదేశీకి ప్రతీకగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతి దుకాణాన్నీ స్వదేశీ వస్తువులతో అలంకరించాలని పిలుపునిచ్చారు. 

రూ.12 లక్షల దాకా ఆదాయంపై ఇప్పటికే పన్ను మినహాయింపు ఇచ్చామని, ఇప్పుడు జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చామని, ఈ రెండూ దేశ పౌరులకు ‘డబుల్‌ బోనాంజా’ అని స్పష్టంచేశారు. దీనివల్ల ఖర్చులు తగ్గి, డబ్బులు ఆదా చేయడం పెరుగుతుందని, తద్వారా ప్రజలు వారి కలలు నిజం చేసుకోవడానికి అవకాశం దక్కుతుందని వ్యాఖ్యానించారు. రెండు కీలక నిర్ణయాల వల్ల ప్రజలకు రూ.2.5 లక్షల కోట్లు ఆదా అవుతాయని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..

నాగరిక్‌ దేవో భవ  
‘‘మన దేశం స్వావలంబన సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని రాష్ట్రాలు కల్పించాలి. తయారీ రంగాన్ని మరింతగా ప్రోత్సహించాలి. ప్రజలు ‘మేన్‌ ఇన్‌ ఇండియా’ ఉత్పత్తులు విస్తృతంగా ఉపయోగించాలి. స్వదేశీ ఉత్పతుల కొనుగోలు, విక్రయం మన ధ్యేయం కావాలి. మన దేశంలో తయారైన వస్తువులు, సరుకులే వాడుకుంటున్నామని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవాలి. అప్పుడు మన దేశం ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది. నాగరిక్‌ దేవో భవ(ప్రజలే దేవుళ్లు) అనేదే మా విధానం. ప్రజలకు మేలు చేయాలన్న తలంపుతోనే జీఎస్టీ సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. 

ఈ నిర్ణయంతో కీలకమైన నిత్యావసర వస్తువులు, సేవల ధరలు తగ్గుతాయి. నిర్మాణం, ఆరోగ్య రంగంలోనూ ఖర్చులు తగ్గిపోతాయి. సోమవారం నుంచి ‘జీఎస్టీ సేవింగ్స్‌ ఫెస్టివల్‌’ ప్రారంభం కానుంది. ప్రతి కుటుంబానికీ సంతోషం తీసుకొస్తుంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం ఈ నవరాత్రుల్లో తొలి రోజు దేశం కీలకమైన అడుగు వేయబోతోంది. మీకు ఇష్టమైన వస్తువులు తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. పేదలు, మధ్య తరగతి, యువత, రైతులు, మహిళలు, వ్యాపారులు, దుకాణదారులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతారు. దేశంలో సులభతర వాణిజ్యం ఊపందుకుంటుంది. భారీగా పెట్టుబడులు వస్తాయి’’ అని మోదీ చెప్పారు.  

బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు..  
‘‘2017లో జీఎస్టీ సంస్కరణలు ఆరంభించాం. చరిత్ర లిఖించడానికి అప్పుడే అడుగు పడింది. ఒకే దేశం–ఒకే పన్ను అనే స్వప్నాన్ని జీఎస్టీ నిజం చేసింది. గతంలో రకరకాల పన్నులు, సుంకాల వల్ల వ్యాపారులకు, వినియోగదారులకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. పన్నుల భారాన్ని వ్యాపారులు జనంపైనే వేసేవారు. జీఎస్టీతో ఆ కష్టాలకు చరమగీతం పాడేశాం. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓ విదేశీ పత్రికలో వార్త చదివా. 

బెంగళూరు నుంచి 570 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్‌కు సరుకులు చేరవేయడం ఓ కంపెనీకి పెద్ద సవాలుగా మారిందని అందులో రాశారు. పలు రకాల పన్నులు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. దానికి బదులు తొలుత యూరప్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేర్చడమే సులభమని ప్రస్తావించారు. అందుకే పన్నులపరంగా అవరోధాలు తొలగించాలని నిర్ణయించాం. అన్ని రాష్ట్రాలు, భాగస్వామ్య పక్షాలతో చర్చించి, జీఎస్టీని తీసుకొచ్చాం’’ అని ప్రధాన మంత్రి ‘మోదీ వివరించారు.        

ఇకనుంచి 5, 18% శ్లాబ్‌లే.. 
‘సంస్కరణలతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ) సైతం ప్రయోజనం పొందుతాయి. మేన్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకురావాలని ఎంఎస్‌ఎంఈలను కోరుతున్నా. స్వావలంబన భారత్‌ నిర్మాణంలో ఎంఎస్‌ఎంఈలదే కీలక పాత్ర. సాధ్యమైనంత ఎక్కువగా మన దేశంలోనే వస్తువులు ఉత్పత్తి చేయాలి. మనం ఉపయోగించుకుంటున్న వస్తువు ఎక్కడ తయారైందో ప్రజలు తెలుసుకోవాలి. 

నిత్యం వాడుతున్న దువ్వెన ఎక్కడ తయారు చేశారో కూడా చాలామందికి తెలియదు. విదేశీ వస్తువులకు ప్రాధాన్యం వేయడం సరైంది కాదు. ఇకపై స్వదేశీ ఉత్పత్తులకే పెద్దపీట వేద్దాం. తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రయోజనం ప్రజలకు దక్కేలా పరిశ్రమ వర్గాలు చొరవ చూపుతుండడం సంతోషంగా ఉంది. ఇకనుంచి 5 శాతం, 18 శాతం ట్యాక్స్‌ శ్లాబ్‌లే ఉంటాయి. గతంలో 12 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న 99 శాతం వస్తువులను 5 శాతం పన్ను శ్లాబ్‌లోకి తీసుకొచ్చాం. ఫలితంగా వాటి ధరలు గణనీయంగా తగ్గిపోతాయి’ అని మోదీ అన్నారు.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Goods and Services Tax
Reforms
Narendra Modi
Atma Nirbhar Bharat Abhiyan
made in india
address to the nation
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

అజేయంగా మన సముద్ర శక్తి

అజేయంగా మన సముద్ర శక్తి

యోగాతో ప్రపంచ శాంతి 

యోగాతో ప్రపంచ శాంతి 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.