Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. దేశ నిర్మాణమే సంఘ్‌ ధ్యేయం 
ADVERTISEMENT 

దేశ నిర్మాణమే సంఘ్‌ ధ్యేయం 

National Sakshi User Sakshi Sakshi Time Oct 2, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
PM.jpg

ఎన్ని దాడులు జరిగినా విద్వేషం ప్రదర్శించలేదు

సవాళ్లను తట్టుకొని స్థిరంగా నిలిచింది  

భిన్నత్వంలో ఏకత్వమే మనదేశ ఆత్మ   

ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి  

సంఘ్‌ స్మారక నాణెంపై భరతమాత, స్వయం సేవకులు   

స్వతంత్ర భారతదేశంలో కరెన్సీపై తొలిసారిగా భరతమాత చిత్రం  

న్యూఢిల్లీ: దేశ నిర్మాణంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అద్వితీయమైన పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో కార్యాచరణ కొనసాగిస్తోందని అన్నారు. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన సంఘ్‌పై ఇప్పటిదాకా ఎన్నో దాడులు జరిగాయని గుర్తుచేశారు. అయినప్పటికీ ఏనాడూ ఎవరిపైనా విద్వేషం ప్రదర్శించలేదని, అందరినీ అక్కున చేర్చుకుందని కొనియాడారు. 

బుధవారం ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సంఘ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘ్‌ సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. కులం, జాతి అనే అడ్డుగోడలను తొలగించి, సమాజంలో ప్రజల మధ్య సామరస్యం, సోదరభావం పెంపొందించడమే లక్ష్యంగా దేశంలో నలుమూలలకూ సంఘ్‌ విస్తరించిందని చెప్పారు.

 సమీకృత సమాజ నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తోందని ఉద్ఘాటించారు. బ్రిటిషర్ల పాలనలో జరిగిన అకృత్యాలపై ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు స్వయంసేవకులు ఆశ్రయం ఇచ్చారని, స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది సంఘ్‌ నాయకులు అరెస్టయ్యి జైలుశిక్ష అనుభవించారని చెప్పారు. దేశాన్ని ప్రేమించడమే ఆర్‌ఎస్‌ఎస్‌ విధానమని స్పష్టంచేశారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే...  

విశ్వాసం, గౌరవమే సంఘ్‌ బలం  
‘‘ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశయాలను అణచివేయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారు. తప్పుడు కేసులు పెట్టారు. సంఘ్‌ను శాశ్వతంగా నిషేధించే ప్రయత్నాలు కూడా చేశారు. లెక్కలేనన్ని సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ సంఘ్‌ ఏనాడూ వెనక్కి తగ్గలేదు. మహా మర్రివృక్షంగా స్థిరంగా నిలిచింది. ఎవరినీ ద్వేషించలేదు. ఎందుకంటే మనమంతా ఈ సమాజంలో భాగమే. ఇక్కడ మంచితోపాటు చెడును కూడా స్వీకరించాల్సిందే. సంఘ్‌ అధినేత గురూజీ గోల్వాల్కర్‌పై తప్పుడు కేసు నమోదుచేసి, జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకు వచి్చన తర్వాత ఆయన విజ్ఞత ప్రదర్శించారు. 

జనాభా స్థితిగతుల్లో మార్పులు ఆందోళనకరం  
ఆర్‌ఎస్‌ఎస్‌కు వందేళ్లు పూర్తవుతున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలను బతికించుకోవాలన్న ఉద్దేశంతో సరిగ్గా వందేళ్ల క్రితం విజయ దశమి రోజున సంఘ్‌ స్థాపన జరిగింది. అప్పటి నుంచి దేశ ప్రగతికి కృషి చేస్తూనే ఉంది. దేశ భక్తి, ప్రజాసేవకు పర్యాయపదం ఆర్‌ఎస్‌ఎస్‌. ‘ఒకే భారత్, మహోన్నత భారత్‌’ అనే సిద్ధాంతాన్ని సంఘ్‌ విశ్వసిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వమే మనదేశ ఆత్మ. 

అది విచ్ఛిన్నమైతే దేశం బలహీనపడుతుంది. దేశంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తుండడం ఆందోళనకరం. ఈ పరిణామం దేశ భద్రతకు, సామాజిక సామరస్యానికి ప్రమాదకరం. బాహ్య శక్తులు మన దేశంలోకి చొరబడి వేర్పాటువాద సిద్ధాంతాలను నూరిపోస్తున్నాయి. చొరబాటుదారుల నుంచి మన పౌరులను కాపాడేందుకు ‘డెమొగ్రఫిక్‌ మిషన్‌’ను ప్రకటించాం. 

వాటి నుంచి సమాజానికి విముక్తి కల్పించాలి   
1962లో యుద్ధం సమయంలో, 1971 నాటి సంక్షోభంలో, 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో వారు విశేషమైన సేవలందించారు. బాధితులను ఆదుకున్నారు. సంఘ్‌ సేవలను మాజీ రాష్ట్రపతులు అబ్దుల్‌ కలాం, ప్రణబ్‌ ముఖర్జీ కూడా ప్రశంసించారు. వార్ధాలోని సంఘ్‌ క్యాంప్‌ను మహాత్మాగాంధీ సందర్శించారు. సంఘ్‌ సిద్ధాంతాలను కొనియాడారు. ప్రస్తుత సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌ సమాజం ముందు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రజలందరికీ ‘ఒకే బావి, ఒకే గుడి, ఒకే శ్మశాన వాటిక’ అని చెబుతున్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు కలసిమెలసి ఉండాలని బోధిస్తున్నారు. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వివక్ష, విభజన, అసమ్మతి నుంచి సమాజానికి విముక్తి కల్పించాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.  

పోస్టల్‌ స్టాంప్, నాణెం ఆవిష్కరణ  
సంఘ్‌ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్, స్మారక నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. రూ.100 విలువ కలిగిన ఈ నాణెంపై ఒక వైపు భరతమాత చిత్రం, మరోవైపు జాతీయ చిహ్నం ఉంది. సింహంతోపాటు వరద ముద్రతో భరతమాత చిత్రం ఆకట్టుకుంటోంది. స్వయం సేవకులు ఆమెకు వందనం సమర్పిస్తున్నట్లుగా ఈ నాణెం ముద్రించారు. 

స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన కరెన్సీపై భరతమాత చిత్రాన్ని ముద్రించడం ఇదే మొట్టమొదటిసారి అని ప్రధాని మోదీ చెప్పారు. ఇది చరిత్రాత్మకమని, మనకు గర్వకారణమని అన్నారు. నాణెంపై ఆర్‌ఎస్‌ఎస్‌ మోటో ‘రాష్ట్రాయ స్వాహా, ఇదం రాష్ట్రాయ, ఇదం న మమ’ కూడా ముద్రించారు. ‘ఏదీ నాది కాదు.. అంతా దేశానికే అంకితం’ అని దీని అర్థం. ఇక పోస్టల్‌ స్టాంప్‌పై 1963 రిపబ్లిక్‌ డే పరేడ్‌లో స్వయంసేవకులు పాల్గొన్న చిత్రం ముద్రించారు.    

‘పంచ పరివర్తన్‌’ ఎజెండా 
ప్రజల మద్దతుతోనే సంఘ్‌ వందేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుందని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే చెప్పారు. శతాబ్ది వేడుకల్లో ఆయన మాట్లాడారు. దేశంలో నేడు అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా మారిందని, దీని వెనుక ఎన్నో సవాళ్లు, కష్టాలు ఉన్నాయని తెలిపారు. సంఘ్‌పై ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్, నాణెం విడుదల చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘ్‌ నిస్వార్థ సేవలకు ఇది చక్కటి గుర్తింపు అని పేర్కొన్నారు.

 మన దేశ ప్రగతి కోసం స్వదేశీ ఉత్పత్తులకు పెద్దపీట వేయాలని ప్రజలను కోరారు. దేశం స్వయం సమృద్ధి సాధించడానికి అందరూ కృషి చేయాలన్నారు. శతాబ్ది వేడుకలను పురస్కరించుకొని సంఘ్‌ నాయకత్వం ‘పంచ పరివర్తన్‌’ ఎజెండాను రూపొందించింది. భారతీయ విలువలు, సరైన కుటుంబ విలువలు, సామాజిక సామరస్యం, పర్యావరణహిత జీవనశైలితోపాటు పౌర విధులు సక్రమంగా నిర్వర్తించేలా ప్రజలను ప్రోత్సహించాలన్నదే ఈ ఎజెండా లక్ష్యం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Nation Building
rashtriya swayamsevak sangh
Narendra Modi
RSS
centenary celebrations
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

అజేయంగా మన సముద్ర శక్తి

అజేయంగా మన సముద్ర శక్తి

యోగాతో ప్రపంచ శాంతి 

యోగాతో ప్రపంచ శాంతి 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.