Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఉగ్రవాదానికి భారత్‌ తలవంచదు
ADVERTISEMENT 

ఉగ్రవాదానికి భారత్‌ తలవంచదు

National Sakshi User Sakshi Sakshi Time Apr 24, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
amit.jpg

హోం మంత్రి అమిత్‌ షా 

పహల్గాం ఘటనాస్థలిని పరిశీలించిన మంత్రి

శ్రీనగర్‌/న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి భారత్‌ ఏనాడూ తలవంచదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. అమాయక పర్యాటకులపై ఉగ్రపంజా విసిరిన వారిని వదిలిపెట్టేదిలేదని ఆయన స్పష్టంచేశారు. బుధవారం ఆయన బైసారన్‌ ఉగ్రదాడి మృతులకు శ్రీనగర్‌లోని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద నివాళులర్పించారు. 26 మంది బాధితుల మృతదేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. అక్కడే ఉన్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు. దారుణదాడికి తెగబడిన వారిని చట్టం ముందు నిలబెడతామని వారికి హామీ ఇచ్చారు. 

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సైతం మృతులకు నివాళులర్పించారు. తర్వాత అమిత్‌షా అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య బోధనాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిసి పరామర్శించారు. తర్వాత అమిత్‌షా ఘటనాస్థలికి చేరుకుని అక్కడి పరిసరాలను పరిశీలించారు. దాడి జరిగిన తీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత కొద్దిసేపు హెలికాప్టర్‌లో ఏరియల్‌ వ్యూలో పాల్గొన్నారు. ‘‘పహల్గాంఉగ్రదాడి బాధితులకు భారమైన హృదయంతో తుది వీడ్కోలు పలికా. ఉగ్రవాదానికి భారత్‌ తలవంచదని పునరుద్ఘాటిస్తున్నా. 

ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టబోమని బాధిత కుటుంబాలకు, యావత్‌ భారతావనికి మాట ఇస్తున్నా’’ అని తర్వాత తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్‌’లో అమిత్‌షా ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘తమ వాళ్లను కోల్పోయిన బాధిత కుటుంబాల బాధను యావత్‌ భారతదేశం అనుభవిస్తోంది. ఇంతటి విషాదాన్ని మాటల్లో వర్ణించలేం’’ అని ఆయన మరో పోస్ట్‌ పెట్టారు. దాడి జరిగిన కొన్ని గంటల్లోపే అమిత్‌ షా కశ్మీర్‌కు చేరుకోగా జమ్మూకశ్మీర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ నళిని ప్రభాత్, ఆర్మీ 15 కోర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ప్రశాంత్‌ శ్రీవాస్తవ తాజా పరిస్థితిని ఆయనకు వివరించారు. వెంటనే ఆయన లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో కలిసి భద్రతా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
మృతుల కుటుంబాలకు జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు తలో రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1లక్ష పరిహారం ఇస్తున్నట్లు తెలిపింది. స్థానిక పోలీసులకు దర్యాప్తులో సాయపడేందుకు ఐజీ నేతృత్వంలోని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బృందం ఢిల్లీ నుంచి కశ్మీర్‌కు బయల్దేరింది. దారుణదాడిని మూకుమ్మడిగా ఖండిస్తూ సంతాప సూచికగా కశ్మీర్‌ లోయ అంతటా బంద్‌ పాటించారు. ఇలా కశ్మీర్‌ అంతటా బంద్‌ పాటించడం గత 35 ఏళ్లలో ఇదే తొలిసారి. 

కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అమిత్ షా

అధికార నేషనల్‌ కాన్ఫరెన్స్‌సçహా పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ, పీపుల్స్‌ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీలు ఈ బంద్‌కు పిలుపు నిచ్చాయి. కశ్మీర్‌లో ప్రచురితమయ్యే ప్రధాన దినపత్రికలన్నీ తమ ఫ్రంట్‌పేజీలను నల్లరంగులో ముద్రించాయి. అమానవీయ చర్యను వ్యా పార సంఘాలు, నేతలు, మీడియా సహా పౌర సమాజం మొత్తం ఖండిస్తోందంటూ పదునైన హెడ్డింగ్‌లతో పతాక శీర్షికలను ఎరుపు రంగులో ప్రింట్‌ చేశాయి. పలు చోట్ల శాంతియుత ర్యాలీలు జరిగాయి. దాడి నేపథ్యంలో కశ్మీర్‌ సందర్శనను పర్యాటకులు హఠాత్తుగా రద్దుచేసుకుని వెనుదిరిగే పక్షంలో శ్రీనగర్‌ రూట్‌లో విమానచార్జీలను ఒక్కసారిగా పెంచకూడదని విమానసంస్థలను  పౌరవిమాన యాన శాఖ హెచ్చరించింది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
kashmir
Pahalgam
Terror attack
Pakistan
India
Amit Shah
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

పహల్గామ్‌ నరమేధం..  సూత్రధారి ఇతడే!

పహల్గామ్‌ నరమేధం.. సూత్రధారి ఇతడే!

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.